breaking news
Sensex close
-
కొనసాగిన రికార్డు
ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ మరో గరిష్ట ముగింపును సాధించింది. 36 పాయింట్లు లాభపడి 21,374 వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే విధంగా నిఫ్టీ కూడా 7 పాయింట్లు పెరిగి 6,346 వద్ద నిలిచింది. సెన్సెక్స్ బుధవారం 87 పాయింట్లు పుంజుకోవడం ద్వారా తొలిసారి చరిత్రాత్మక గరిష్ట స్థాయి 21,338 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అయితే 2013 డిసెంబర్ 9న నమోదైన ఇంట్రాడే గరిష్టం 21,483 పాయింట్లను అందుకోవలసి ఉంది. ఇక అదే రోజు సాధించిన 6,364 రికార్డుకు నిఫ్టీ చేరువగా రావడం గమనార్హం. కాగా, గురువారం ట్రేడింగ్‌లో ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలు 2% స్థాయిలో బలపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎల్అండ్టీ, యాక్సిస్, గెయిల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, భారతీ 3-1.5% మధ్య లాభపడగా, ఎంఅండ్ఎం 3% పతనమైంది. ఈ బాటలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, టీసీఎస్, టాటా స్టీల్ 1% స్థాయిలో నష్టపోయాయి. ఇక ఎఫ్ఐఐలు నికరంగా రూ. 434 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 394 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. -
ఫెడ్ ఎఫెక్ట్... ఎగసిపడిన మార్కెట్
వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌వేస్తూ రిజర్వుబ్యాంక్ ఇన్వెస్టర్లకు ఇచ్చిన ఊరట ఒక్కరోజుకే పరిమితమయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ టాపరింగ్‌కు శ్రీకారం చుట్టడంతో తిరిగి మార్కెట్లు క్షీణించాయి. ఆర్బీఐ చర్యతో క్రితం రోజు 248 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్ ఫెడ్ ఎఫెక్ట్‌తో 151 పాయింట్లు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం ప్రతీ నెలా ఉద్దేశించిన 85 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నుంచి 10 బిలియన్ డాలర్లు ఉపసంహరించాలన్న నిర్ణయాన్ని గతరాత్రి ఫెడ్ తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదన్న సంకేతాన్ని ఈ టాపరింగ్ ద్వారా ఫెడ్ అందించడంతో అమెరికా సూచీలు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ ప్రభావంతో గురువారం ఉదయం 20,959 స్థాయికి గ్యాప్‌అప్‌తో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్, తదుపరి కొన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో పడిపోయింది. చివరకు 20,708 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 6,166 వద్ద క్లోజయ్యింది. పెరిగిన బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్. షేర్లలో విక్రయాలు జరిగాయి. అమెరికా రికవరీతో లబ్దిచేకూరవచ్చన్న అంచనాలతో ఐటీ, ఫార్మా షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలుచేయడంతో ఆ షేర్లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎస్బీఐలు 2-3 శాతం మధ్య తగ్గాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు కొత్త రికార్డుస్థాయికి చేరాయి. విప్రో 13యేళ్ల గరిష్ట స్థాయిలో రూ. 530 వద్ద, టెక్ మహీంద్రా ఆరేళ్ల గరిష్ట స్థాయి రూ. 1,799 వద్ద ముగిసాయి. ఫార్మా దిగ్గజాలు సిప్లా, ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు 2-3 శాతం మధ్య ఎగిసాయి. ఆటోమొబైల్ షేరు మారుతి సైతం కొత్త రికార్డుస్థాయి రూ. 1,798 స్థాయికి పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఒకే రోజున భారీగా రూ. 2,264 కోట్ల పెట్టుబడుల్ని కుమ్మరించారు. నిఫ్టీలో లాంగ్ ఆఫ్‌లోడింగ్: ఫెడ్ టాపరింగ్ నిర్ణయంతో నిఫ్టీ 6,200 మద్దతుస్థాయిని కోల్పోయినా, సమీప భవిష్యత్తులో పెద్ద పతనం జరగకపోవొచ్చని డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. 6,263 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 6,150 పాయింట్ల కనిష్టస్థాయివరకూ నిఫ్టీ క్షీణించడానికి లాంగ్ ఆఫ్‌లోడింగ్ కారణం. షార్టింగ్ వల్ల ఈ తగ్గుదల జరగలేదు. ఈ ప్రక్రియను సూచిస్తూ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 30.69 లక్షల షేర్లు (14%) కట్ అయ్యాయి దాంతో మొత్తం ఓఐ 1.89 కోట్ల షేర్లకు తగ్గింది. 6,200 స్ట్రయిక్ వద్ద కాల్‌రైటింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్ ఓఐలో 18.18 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం బిల్డప్ 54.79 లక్షల షేర్లకు చేరింది. 6,200, 6,100 స్ట్రయిక్స్ వద్ద స్వల్పంగా పుట్ కవరింగ్ జరిగింది. 6,200 వద్ద ఏర్పడిన తాజా నిరోధాన్ని దాటితేనే అప్‌ట్రెండ్ సాధ్యమని, ఈ స్థాయి దిగువన బలహీనంగా రేంజ్బౌండ్లో ట్రేడ్‌కావొచ్చని ఈ డేటా సూచిస్తున్నది.