breaking news
Salmon arokhya Raj
-
విద్యార్థులకు తప్పని తిప్పలు
=అత్యధిక పాఠశాలల్లో కనిపించని మరుగుదొడ్లు =నీటి వసతి లేక కొన్నిచోట్ల మూత =ఇంకొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణాలు =విద్యార్థులకు తప్పని తిప్పలు =ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి సాక్షి, చిత్తూరు: జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3,957, ప్రాథమికోన్నత పాఠశాలలు 480, ఉ న్నత పాఠశాలలు 608 ఉన్నాయి. వీటిల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరు రోజులో 8 గం టలు పాఠశాలల్లోనే గడుపుతున్నారు. ఆ సమయంలో మల, మూత్రవిసర్జనకు నానా అగచా ట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సమకూర్చుతున్న శానిటరీ నాప్కిన్స్ను యుక్తవయ స్సు విద్యార్థినులు ఉపయోగించుకోవాలన్నా, పరిశుభ్రమైన మరుగుదొడ్లు పాఠశాలలో అందుబాటులో లేవు. బాలురు ఆరు బయట స్థలాల్లోనే మల, మూత్రవిసర్జన చేస్తున్నారు. బా లికల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుబ యట మల, మూత్ర విసర్జన చేయలేక గంటల కొద్దీ ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతోంది. మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాజీవ్ విద్యామిషన్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మరుగుదొడ్లు లేని పాఠశాలలు 45 మాత్రమే. అదే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల లెక్కల్లో 521 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. నీరు లేక నిరుపయోగంగా మారిన పాఠశాలలు వెయ్యికిపైగా ఉన్నాయి. పాఠశాలల్లో బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల 700 మ రుగుదొడ్లు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నిర్మించేందుకు ఏడాది క్రితం అప్పటి కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ నిధులు మంజూరు చేశా రు. అయితే ఇంత వరకు మరుగుదొడ్ల ని ర్మాణం పూర్తి కాలేదు. సమస్య తీవ్రత ఇలా.. చిత్తూరులోని మిట్టూరు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తలుపులు లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. డీఈవో ఆఫీసు పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్లలో చెత్త వేయడంతో అవి నిరుపయోగంగా మారా యి. చిత్తూరు రూరల్ మండలంలోని పాఠశాలలకు ఒక్కదానికీ నీటి వసతి లేదు. సత్యవేడు మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు సైతం మరుగుదొడ్లు లేక ఇబ్బం దిపడుతున్నారు. విద్యార్థినుల అవస్థలు వర్ణణాతీతం. సత్యవేడు మండలంలోని 71 పాఠశాలల్లోని 65 పాఠశాలల్లో మరుగుదొడ్లు విద్యార్థులకు అందుబాటులో లేవు. మరుగుదొడ్లు ఉన్న 35 పాఠశాలల్లో 15పాఠశాలలకు నీటి వసతి లేదు. ఉన్నత పాఠశాలలు 11 ఉన్నాయి. వీటిల్లో మూడింటికి మాత్రమే నీటి వ సతి ఉంది. మిగిలిన పాఠశాలల్లో నీటి వసతి లేక మరుగుదొడ్లు ఉపయోగంలో లేవు. పీలేరు నియోజకవర్గంలో 360 ప్రాథమిక, 41 ప్రాథమికోన్నత, 52 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పలు ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా వాటి నిర్వహణ కొరవడడంతో నిరుపయోగంగా మారాయి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పలుచోట్ల నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత పాఠశాలల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడున్న 52 ఉన్నత పాఠశాలల్లో సగం పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం లోని ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు శిథి లావస్థలో ఉన్నాయి. పెద్దమండ్యం, ములకలచెరువు, బి.కొత్తకోట మండలాల్లోని పాఠశాలల్లో కొన్నిచోట్ల మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి. పుంగనూరు పరిధిలో 371 పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ మరుగుదొడ్లు ఉన్నాయి. నీటి సమస్య కారణంగా చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. మదనపల్లె మున్సిపాలిటీలోని ఉర్దూ మున్సిపల్ స్కూల్లో 637 మంది విద్యార్థులు చ దువుతున్నారు. ఇక్కడ బాలికలకు 8 మరుగుదొడ్లు ఉన్నాయి. అయితే నీటి వసతి లేదు. మూడురోజులకొకసారి మున్సిపాలిటీ వారు ట్యాంకర్ పంపుతున్నారు. ఈ నీళ్లు చాలడం లేదు. కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 486 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 80 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు ఉ న్నా నీటి సమస్యతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. టైల్స్, పైపులైన్లు దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నాయి. హస్తి నియోజకవర్గంలో 400 పాఠశాలలు ఉన్నాయి. వీటిలోని 360 పాఠశాలలకు మరుగుదొడ్ల వసతి ఉంది. అయితే అత్యధిక పాఠశాలల్లో నీటి సమస్య వేధిస్తోంది. దీం తో విద్యార్థినులు మరుగుదొడ్లు ఉపయోగిం చుకోలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలల మరుగుదొడ్లకు తలుపులు లేవు. పలమనేరు నియోజకవర్గంలో 484 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 212 చోట్ల నీరు, ని ర్వహణ లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. 30 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు. బెరైడ్డిపల్లె, వి.కోట మండలాల్లో మరుగుదొడ్లకు తలుపులు లేవు. పాఠశాల గ్రాంట్లను మరుగుదొడ్ల నిర్వహణకు ఉపయోగించడం లేదు. -
మళ్లీ ముప్పు
=జిల్లాను వణికించిన తుపాను =ఖరీఫ్ వరికి అపార నష్టం =నేలకొరిగిన చోడి, అరటి =నిండుగా జలాశయాలు =అన్నదాతలు కన్నీరుమున్నీరు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతున్నను హెలెన్ తుపాను మరో సారి ముంచింది. సరిగ్గా పంట చేతికందుతుందన్న సమయంలో ఈదురుగాలులతో నేలమట్టం చేసింది. దానికి ఎడతెరిపిలేని వర్షాలు తోడవ్వడంతో అపార నష్టం వాటిల్లింది. కోసి పొలంలో ఉన్న వరిపనలు తడిసి ముద్దయ్యాయి. కంకులతో బరువుగా ఉన్న ఖరీఫ్ వరి నీట మునిగి కుళ్లిపోతోంది. చోడి, అరటి పంటలు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న చెరకు తోటలు చుట్టుకుపోయాయి. అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3వేల హెక్టార్లలో వరి శతశాతం నష్టపోయినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మరో 3వేల హెక్టార్లు వరద నీటిలో ఉండటంతో కాస్త నష్టం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే రైతులు మాత్రం నష్టం వేలాది ఎకరాల్లో ఉంటుందని అంటున్నారు. నెల రోజుల కిందటే సరిగ్గా నెల రోజుల కిందటే ఇదే సమయానికి అల్పపీడనం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలను నీట ముంచి రూ.వందల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. రైతులు తేరుకోక ముందే హెలెన్ తుపాను ముంచుకొచ్చింది. దీని ప్రభావంతో రెండ్రోజులుగా వర్షాలతోపాటు గంటకు 50నుంచి 70కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు వరిలో పొడవు రకాలయినఆర్జేఎల్, సోనామసూరి, సాంభమసూరి వంటివి నేలకొరిగిపోయి నీటమునిగాయి. ఖండిపల్లి, దామునాపల్లి,చుక్కపల్లి,చోడవరం, పరిసరాల్లో వరిపంటపై నుంచి రైవాడ కాలువ నీరు పొంగి ప్రవహించడంతో సుమారు 400 ఎకరాలు పూర్తిగా నీటమునిగింది. వర్షం తీవ్రత లేనప్పటికీ గాలులు బలంగా వీయడంతో వరిచేలు నేరకొ రిగాయి. ఒరిగిన పంటను పైకి లేపి దుబ్బులుగా కట్టుకొంటూ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఇన్‌ఫ్లో పెరిగితే ఏక్షణాన పొంగుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. తుపాను తీరందాటినప్పటికీ దాని ప్రభావం మరో 48 గంటల పాటు ఉంటుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. ఏజెన్సీ మండలాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఏపుగా కోతకు సిద్ధంగా ఉన్న చోడి పంటంతా నేలమట్టమైంది. రోజుల తరబడి నీటి నిల్వ తో రాజ్మా పంట కుళ్లిపోతోంది. జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 వరకు 2.81 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలో మాత్రం ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. గాజువాకలో 10.5 సెం.మీ., పెదగంట్యాడలో 10.46 సెం.మీ., విశాఖపట్నం అర్బన్‌లో 6.7 సెం.మీ., విశాఖ రూరల్‌లో 6.5 సెం.మీ, సబ్బవరంలో 5.4 సెం.మీ. వర్షం పడింది. మిగిలిన మండలాల్లో మూడు సెం.మీ. వరకు వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖలో భారీ వర్షం కారణంగా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ గెట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చే స్తున్నారు. అధికారులు అప్రమత్తం హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ ఎటువంటి నష్టం లేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు మండలాల్లోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ తరలించలేదన్నారు. భారీ వర్షాలు పడినప్పటికీ నష్ట శాతాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.