breaking news
rutwika shivani
-
India Maharashtra International Challenge 2022: ఫైనల్లో రుత్విక శివాని
సాక్షి, హైదరాబాద్: ఇండియా మహారాష్ట్ర ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 24–22, 21–17తో ఇషారాణి బారువా (భారత్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రుత్విక 25–23, 21–16తో మాన్సి సింగ్ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 18–21, 23–21, 21–9తో తారా షా (భారత్)పై, రెండో రౌండ్లో 21–14, 21–9తో ప్రణవి (భారత్)పై గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్ ప్లేయర్ మిహో కయామతో రుత్విక శివాని తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మిహో కయామ 21–14, 21–15తో తస్నీమ్ మీర్ (భారత్)పై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కె.మనీషా–షేక్ గౌస్ (భారత్) జోడీ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో మనీషా–షేక్ గౌస్ ద్వయం 21–12, 19–21, 21–17తో బొక్కా నవనీత్–ప్రియా కొంజెంగ్‌బమ్ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో మైస్నమ్ మెరాబా (భారత్), మిథున్ మంజునాథ్ (భారత్) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో మైస్నమ్ మెరాబా 22–20, 21–14తో టాప్ సీడ్ కిరణ్ జార్జి (భారత్)పై, మిథున్ 22–24, 21–7, 21–18తో రవి (భారత్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణ ప్రసాద్ (భారత్) ద్వయం 12–21, 15–21తో చోలెంపన్–నాంథకర్న్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో రుత్విక శివాని, లక్ష్యసేన్
ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: యొనెక్స్ సన్‌రైజ్ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రుత్విక శివాని, లక్ష్యసేన్ సెమీస్‌కి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రుత్విక శివాని 11-5, 11-6, 11-8తో రేష్మ కార్తీక్‌పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 10-12, 11-4, 11-8, 6-11, 11-9తో మునావర్‌ను ఓడించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో అర్జున్- రామచంద్రన్ శ్లోక్ ద్వయం 11-6, 12-10, 11-7తో అనిల్‌కుమార్- వెంకట్ గౌరవ్ జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో మహిమా అగర్వాల్- శిఖా గౌతమ్ ద్వయం 10-12, 11-7, 7-11, 11-4,11-9తో కుహూ గార్గ్- హజరికా జోడీపై, మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో బషీర్ సయ్యద్- సాహితి జోడీ 13-11, 4-11, 12-10, 15-14తో అక్షయ్- రుప్సా ఘోష్ జంటపై గెలుపొందాయి. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు మహిళల సింగిల్స్: శ్రీకృష్ణ ప్రియ 11-6, 8-11, 11-3, 11-5తో కేయూరపై, రీతూపర్ణ దాస్ 9-11, 12-10, 11-5, 11-2తో శిఖా గౌతమ్‌పై, శ్రుతి 12-10, 11-8, 11-7తో స్మిత్ తోష్ని వాల్‌పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్: శ్రేయాన్‌ష జైశ్వాల్ 11-6, 9-11, 11-9, 11-4తో కెయ్ వున్ థీ (మలేసియా)పై, జున్ వెయ్ చెమ్ (మలేసియా) 11-2, 8-11, 11-6, 11-8తో అన్సల్ యాదవ్ (భారత్)పై, జి జియా లీ (మలేసియా) 7-11, 11-6, 11-8, 11-8తో అభిషేక్ పై గెలిచారు. పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడీ 11-9, 11-7, 11-8తో నరేంద్రన్- సంజిత్ జంటపై, ఆరోన్- జిన్ హువా థాన్ (మలేసియా) జోడీ 11-7, 11-7, 11-8తో కేతన్ చాహల్- నీరజ్ వశిష్ట్‌పై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్: సాత్విక్ సాయిరాజ్- మనీషా జోడీ 8-11, 12-10, 12-10, 4-11, 11-7తో ధ్రువ్ కపిల- మేఘన జంటపై, విఘ్నేశ్- కుహు గార్గ్ జోడీ 11-7, 11-6, 11-6తో శ్రీకృష్ణ సాయి- సృష్టి జంటపై గెలుపొందారు.