breaking news
rules and regulations relaxations
-
ఇక భారీ ఐపీవోలకు జోష్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా భారీ కంపెనీల పబ్లిక్ ఇష్యూ నిబంధనలను సరళీకరించేందుకు నిర్ణయించింది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా విషయంలో వెసులుబాటును కల్పించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితినీ సవరించనుంది. వీటితో పాటు పలు తాజా ప్రతిపాదనలను శుక్రవారం(12న) నిర్వహించిన బోర్డు సమావేశంలో సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం..ముంబై: అతి భారీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడంలో దన్నునిస్తూ సెబీ తాజాగా పలు వెసులుబాట్లకు తెరతీస్తోంది. ప్రధానంగా పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించే అంశంలో గడువును సవరించేందుకు నిర్ణయించింది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తదితర మెగా అన్‌లిస్టెడ్ కంపెనీలు లబ్ది పొందే వీలుంది. తాజా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే దిగ్గజ కంపెనీలు లిస్టింగ్‌లోనే భారీగా వాటాను విక్రయించవలసిన అవసరం ఉండదు. పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో తగినంత గడువుకు వీలు చిక్కనుంది. 10 శాతం నుంచి తగ్గింపు కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువగల కంపెనీలు ఐపీవోలో ప్రస్తుత 10 శాతానికి బదులుగా 8 శాతం వాటాను విక్రయించేందుకు అనుమతిస్తారు. వీటికి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించడంలో ఐదేళ్ల గడువునిస్తారు. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా అమలవుతోంది. రూ. లక్ష కోట్లకుపైన మార్కెట్ విలువతో ఐపీవోకు వచ్చే కంపెనీలు ప్రస్తుత 5 శాతానికి బదులుగా 2.75 శాతం వాటాను ఆఫర్ చేయవచ్చు. రూ. 5 లక్షల కోట్లకు మించిన అతిభారీ కంపెనీలైతే ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయానికీ వీలుంటుంది. ఇలాంటి భారీ కంపెనీలు 10ఏళ్లలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఐదేళ్లు గడువును అనుమతిస్తోంది. వెరసి అతితక్కువ స్థాయిలో వాటా విక్రయించడం ద్వారా కంపెనీలు లిస్టయ్యేందుకు వీలు చిక్కుతుంది. తదుపరి దశలవారీగా పబ్లిక్ వాటాకు తెరతీయవచ్చు. దీంతో ఓకేసారి భారీస్థాయిలో వాటా విక్రయించవలసిన అవసరం తప్పుతుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా భారీ ఐపీవోలకు లిక్విడిటీ సమస్య తలెత్తకుండా నివారించవచ్చని తెలియజేశారు. రిటైల్ పరిమాణం ఓకే రూ. 5,000 కోట్లకు మించిన ఐపీవోల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయింపులను 35 శాతంగానే కొనసాగించనున్నట్లు పాండే తెలియజేశారు. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) వాటాను సైతం 50 శాతం నుంచి పెంచే ఆలోచనలేదని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐపీవోలలో మరింత చోటు కల్పించేందుకు వీలుగా యాంకర్ కేటాయింపులను సవరిస్తున్నట్లు వెల్లడించారు. వీటి ప్రకారం యాంకర్ వాటా రూ. 250 కోట్లుదాటితే ఇన్వెస్టర్ల సంఖ్యను ప్రస్తుత 10 నుంచి 15కు పెంచనుంది. కనీసం 5 నుంచి గరిష్టంగా 15వరకూ అనుమతిస్తారు. ఆపై ప్రతీ రూ. 250 కోట్ల కేటాయింపులకు అదనంగా 15మంది ఇన్వెస్టర్లకు వీలుంటుంది. అంటే ఒక్కో ఇన్వెస్టర్‌కు కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడికి వీలుంటుంది. ఇదేవిధంగా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపుల వాటా ప్రస్తుత 33 శాతం నుంచి 40 శాతానికి పెరగనుంది. దీనిలో ఎంఎఫ్లకు 33 శాతం, జీవిత బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్లకు మిగిలిన వాటాను రిజర్వ్ చేయనున్నారు. రీట్, ఇన్విట్లలో బీమా, పెన్షన్ ఫండ్స్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ నిబంధనలను సెబీ సవరించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్)సహా కొన్ని కేటగిరీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు)ను ఇందుకు అనుమతించనుంది. అంతేకాకుండా రీట్‌ను ఈక్విటీగా గుర్తించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రత్యేక పెట్టుబడులకు వీలుగా ఇన్విట్‌ను హైబ్రిడ్‌గా కొనసాగించనుంది. ఇన్విట్, రీట్ నిబంధనల సవరణ ద్వారా ఇన్వెస్టర్ల పరిధి మరింత విస్తరించనుంది. దీంతో రీట్, ఇన్విట్ల వ్యూహాత్మక పెట్టుబడిదారుల కేటగిరీలో విభిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులకు వీలు చిక్కనుంది. ఇది రీట్, ఇన్విట్‌లకు జోష్‌నివ్వడంతోపాటు.. సులభ వ్యాపార నిర్వహణకు దారి ఏర్పడనున్నట్లు పాండే పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, బీమా ఫండ్స్ తదితర పలు భారీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్లకు ప్రస్తుత నిబంధనలు అడ్డుపడుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపే ఆయా సంస్థలకు రీట్, ఇన్విట్లు అత్యుత్తమ అవకాశాలని సెబీ పేర్కొంది. ఎగ్జిట్ లోడ్ కుదింపు ఆర్థిక వృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసే వ్యూహంలో భాగంగా సెబీ బోర్డు ఎంఎఫ్ పంపిణీ సంస్థలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మరింత పారదర్శక, నిలకడైన ప్రోత్సాహకాలకు దన్నునిస్తూ గరిష్ట ఎగ్జిట్ లోడ్‌ను ప్రస్తుత 5 శాతం నుంచి 3 శాతానికి కోత పెట్టింది. టాప్–30 పట్టణాలను దాటి ఫండ్స్‌లోకి కొత్తగా మహిళా ఇన్వెస్టర్లను చేర్చుకుంటే పంపిణీదారులకు అధిక ప్రోత్సాహకాలు అందేటట్లు నిబంధనలు సవరించింది.లోరిస్క్ ఎఫ్‌పీఐలకు సపోర్ట్ తక్కువ రిస్్కగల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను సింగిల్ విండో ద్వారా దేశీ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలు చేపట్టేందుకు అనుమతించనున్నారు. ఇందుకు వీలుగా సెబీ బోర్డు నిబంధనలను సవరించింది. తద్వారా ఎఫ్‌పీఐలకు దేశీయంగా సులభతర పెట్టుబడులకు వీలు చిక్కనుంది. లోరిస్క్ ఎఫ్‌పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లో సులభంగా పెట్టుబడులు చేపట్టేందుకు స్వాగత్–ఎఫ్ఐ పేరుతో తెరతీయనున్న సింగిల్ విండో దారి చూపనుంది. దీంతో యూనిఫైడ్ రిజి్రస్టేషన్ విధానం ద్వా రా విభిన్న పె ట్టుబడి మార్గాలలో ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని పాండే తెలియజేశారు. ఫలితంగా పెట్టుబడుల విష యంలో ఎఫ్‌పీఐలకు పదేపదే ఎదురయ్యే నిబంధనలు, భారీ డాక్యుమెంటేషన్ వంటి అవరోధాలు తొలగిపోనున్నట్లు వివరించారు. లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ సొంత ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యంత నియంత్రణలతోకూడిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ చేరనున్నట్లు వెల్లడించారు. స్వాగత్–ఎఫ్ఐ మార్గదర్శకాల ను ఎఫ్ఫీఐలతోపాటు.. విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్‌వీసీఐలు)కు వర్తించనున్న ట్లు పేర్కొన్నారు. 2025 జూన్30కల్లా దేశీయంగా 11,913 మంది ఎఫ్‌పీఐలు రిజిస్టరై ఉన్నట్లు వెల్లడించింది. రూ. 80.83 లక్షల కోట్ల ఆస్తులను హోల్డ్ చేస్తున్నట్లు తెలియజేసింది. -
సొరంగం పనులకు నిబంధనల సడలింపు
– టెండర్ల దాఖలు కాలపరిమితి 14రోజులకు పెంపు – సాంకేతిక అర్హత 50శాతానికి తగ్గింపు – ఈనెల 25నుంచి ఆగస్టు 8 వరకు టెండర్లు బి.కొత్తకోట: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో పెద్దమండ్యం మండలంలో పూర్తిచేయాల్సిన సొరంగం పనుల అప్పగింతకు కాంట్రాక్టర్ల అర్హత తగ్గింపు, టెండర్లకు కాల పరిమితి పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా ఎక్కువ టెండర్లు దాఖలవుతాయని భావిస్తోంది. 20బీ ప్యాకేజీలోని సొరంగం పనులకు నిర్వహించిన టెండర్లలో మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ ఒక్కటే 3.99శాతం ఎక్కువతో సింగిల్ టెండర్ దాఖలు చేయడం, దాన్ని ప్రభుత్వం రద్దుచేయడం తెలిసిందే. పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె నుంచి వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం మండలం కోటగడ్డకాలనీ వరకు మట్టిలో సొరంగ మార్గానికి చెందిన 20ఎ ప్యాకేజీ పనిలో రూ.16.77కోట్ల విలువైన 2కిలోమీటర్ల మట్టిసొరంగం పనుల విలువను రూ.70.82కోట్లకు పెంచారు. దీనికి గతనెలలో టెండర్లు నిర్వహించినా ఒకటే టెండర్ దాఖలైంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జీవోల ఆధారంగా టెండర్లు దాఖలుచేసే కాంట్రాక్టు సంస్థలకు ఉండాల్సిన సాంకేతిక అర్హత, అనుభవంలో 50శాతం మేరకు తగ్గిస్తోంది. పెద్దమండ్యం మండలంలో సొరంగం పనులు చేసేందుకు నిబంధనల మేరకు 16వేల క్యూబిక్ మీటర్ల సొరంగం కాంక్రీట్ పనులు, 2.5 కిలోమీటర్ల సొరంగం పనులను ఏడాది కాలంలో చేసిన అనుభవం ఉండాలి. అయితే 20బీ ప్యాకేజీ పనులకోసం సాంకేతిక అర్హతలను 50శాతానికి కుదిస్తున్నారు. సొరంగం పని అప్పగించేందుకు టెండర్లు దాఖలుచేసే కాంట్రాక్టు సంస్థ ఏడాది కాలంలో 1.25కిలోమీటర్ల సొరంగం పనులు, 8వేల క్యూబిక్ మీటర్ల సొరంగం కాంక్రీట్ పనులుచేసిన అనుభవం ఉంటే చాలాని నిర్ణయించనుంది. ఈమేరకు ఈనెల 25నుంచి టెండర్లు ఆహ్వనించేలా ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో టెండర్లను వారంలో పూర్తిచేసేవారు. ప్రస్తుతం ఈ టెండర్లకు రెండు వారాలకు గడువు పెంచుతున్నారు. దీంతో ఈనెల 25న టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆగస్టు8కి ముగించనున్నారు. దీనికోసం చర్యలు తీసుకొంటున్నారు.