breaking news
Rs.5
-
యూపీలో ఒక్కో ఓటుకు ఎంతపెట్టారంటే..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఎంత డబ్బును ఆయా పార్టీలు ఖర్చు చేశాయో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5,500కోట్లను యూపీ ఎన్నికల్లో అడ్డగోలుగా వెదజల్లినట్లు ఓ ఎన్నికల సర్వే తెలిపింది. వీటిల్లో దాదాపు రూ.1000కోట్లు ఓట్లను నేరుగా కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకున్నారంట. అంతేకాదు, 1/3వంతు మంది డబ్బు తీసుకోవడమో లేదా మద్యానికి తమ ఓటును ఇచ్చేయడమో చేసినట్లు కూడా ఆ సర్వే వెల్లడించింది. సీఎంఎస్ ప్రీ పోస్ట్ పోల్ అనే పేరిట ఒక స్టడీ చేయగా అందులో ఒక్క యూపీలో ఖర్చయిన డబ్బు వివరాలు తెలిశాయి. ఒక్కో వ్యక్తికి ఎన్నికల ప్రచారంలో భాగంగా రూ.25లక్షలను ఖర్చుచేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెబితే దాదాపు దానికి రెట్టింపుల కొద్ది డబ్బును ఇతర మార్గాల్లో రహస్యంగా ఖర్చుచేసినట్లు తాజా అధ్యయనంలో తెలిసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, పెద్ద పెద్ద తెరలమీద తమ ప్రచారం చూపించడం, వీడియో వ్యానులు ఉపయోగించడం తదితర పనులకు యూపీ ఎన్నికల్లో రూ.600 నుంచి రూ.900కోట్లు సర్వే తెలిపింది. ఒక్కో ఓటును సగటున రూ.750 పెట్టి కొనుగోలు చేశారంట. ఇప్పటి వరకు సగటున ఒక ఓటుకు చేసిన అతి పెద్ద వ్యయం ఇదేనని సర్వే తెలిపింది. -
పెసలు @ రూ.5,225
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ఖమ్మం వ్యవసాయం : నాణ్యమైన పెసలకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. క్వింటాకు రూ.5,225 చొప్పున కొనుగోలు చేయనుంది. దీంతో మార్క్‌ఫెడ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందు రంగం సిద్ధం చేసింది. ‘పత్తి వద్దు పప్పు దినుసులు ముద్దు’ అనే నినాదంతో ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నినాదానికి బాగా ప్రాధాన్యం ఇచ్చింది. వేసవిలో ఖరీఫ్ పంటల సాగుపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా మన తెలంగాణ–మన వ్యవసాయం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పత్తి పంటల స్థానంలో పప్పు పంటలు వేయాలని వ్యవసాయ శాఖ ప్రచారం, అవగాహన కల్పించింది. దీంతో జిల్లాలో 1,62,970 సాధారణ విస్తీర్ణం ఉన్న పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. పత్తి విస్తీర్ణం 1,22,572కు పడిపోయింది. దీని స్థానంలో పప్పుదినుసల పంటలైన పెసర, కంది పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. పెసర జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,962 హెక్టార్లు కాగా.. అనూహ్యంగా 27,310 హెక్టార్లు సాగు చేశారు. కంది సాధారణ సాగు విస్తీర్ణం 2,964 హెక్టార్లు కాగా.. 9,420 హెక్టార్లలో వేశారు. కంది సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. జూన్‌లో వేసిన పెసర పంట ఆగస్టు 15 నుంచి ఉత్పత్తి అవుతుంది. గత ఏడాది ఈ పంట మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,850. అయితే గత రబీ, వేసవిలో పెసల ధర రూ.8వేల వరకు తాకింది. ప్రస్తుత ఖరీఫ్‌లో పంట ధర ఒక్కసారిగా సగానికి పడిపోయింది. కారణం సాగు విస్తీర్ణం పెరగటంతోపాటు వ్యాపారులు సిండికేట్ కావడమే. క్వింటా పెసలను రూ.4వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన ప్రభుత్వం మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయటం సరికాదని, ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని నిర్ణయించింది. నేటి నుంచి కొనుగోళ్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెసలను మార్క్‌ఫెడ్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. మార్కెట్లోని అపరాల యార్డులో పంట ఉత్పత్తిని బుధవారం నుంచి కొనుగోలు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రైతులు మార్కెట్‌కు పంట ఉత్పత్తిని తెచ్చుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. 12 శాతం తేమ కలిగిన సరుకు కొనుగోలు పంట కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సంస్థ పలు నిబంధనలు రూపొందించింది. సరుకులో నిర్ణీత తేమ కలిగి ఉండి, సరుకు ఆరబెట్టి ఉండాలి. మట్టి, రాయి, చెత్తాచెదారం లేకుండా ఉండాలి. సరుకు 12 శాతం తేమను మించి ఉండొద్దు. కాగా.. రైతు పంట సాగు చేసినట్లు స్థానిక గ్రామ రెవెన్యూ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. రైతు వెంట ఆధార్ కార్డు , పట్టాదారు పాస్ పుస్తకం ప్రతులు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం కూడా వెంట తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. 13సీకెఎం263 : పెసల రాశి