breaking news
Rebel League
-
ఎసెల్ గ్రూప్ లీగ్ వస్తే కాదనలేమేమో!
ఐసీసీకి పోటీగా త్వరలో ప్రారంభం కానున్న ఎసెల్ గ్రూప్ వారి రెబెల్ లీగ్‌లో ఉన్న భారీ డబ్బు క్రికెటర్లను ఆకర్షించడం ఖాయమని డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. దేశం తరఫున ఆడటం అందరికీ గర్వకారణమే అయినా... పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంటే ఎవరూ కాదనలేరని, అలా ఎవరైనా చెబితే అది ఆత్మవంచన అవుతుందన్నాడు. -
పాక్‌తో సిరీస్‌పై అనుమానాలు
న్యూఢిల్లీ : భారత్‌తో యూఏఈలో డిసెంబరులో జరగాల్సిన క్రికెట్ సిరీస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరోమారు నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరీస్ ప్రసార హక్కుల విషయంలో బీసీసీఐ భిన్నాభిప్రాయంతో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ ప్రసారహక్కులు టెన్‌స్పోర్ట్స్ దగ్గర ఉన్నాయి. ఇటీవల ఐసీసీకి పోటీగా రెబల్ లీగ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన ఎసెల్ గ్రూప్‌కు చెందిన సంస్థే ఈ టెన్ స్పోర్ట్స్. దీంతో పీసీబీ-టెన్ స్పోర్ట్స్ ఒప్పందాన్ని ఈ సిరీస్ విషయంలో భారత బోర్డు ఒప్పుకునే ప్రసక్తే లేదు. -
రెబల్ లీగ్‌కు ‘ఎసెల్’ సై!
అధికారికంగా ఖరారు చేసిన సంస్థ ముందుగా భారత్‌లో దేశవాళీ టోర్నీ సిడ్నీ: ఐపీఎల్‌కు పోటీగా ప్రపంచ క్రికెట్లో మరో కొత్త లీగ్ రాకకు రంగం సిద్ధమైంది. గతంలో ఐసీఎల్ నిర్వహించిన ‘జీ’ సంస్థ అధినేత సుభాష్ చంద్ర మరోసారి దీనికి శ్రీకారం చుడుతున్నారు. గత రెండు వారాలుగా దీనిపై పలు వార్తలు వచ్చినా దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక కథనం ప్రకారం రెబల్ లీగ్ విషయాన్ని ఎసెల్ గ్రూప్ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ హెడ్ హిమాంశు మోదీ నిర్ధారించారు. ఈ టి20 లీగ్‌ను ముందుగా భారత్‌లోని వివిధ నగరాలలో నిర్వహించనున్నట్లు సమాచారం. గతంలో విఫల ప్రయత్నంగా మిగిలిన ఐసీఎల్ తరహాలో కాకుండా...ఈ సారి విజయవంతం చేసేందుకు మరిన్ని జాగ్రత్తలతో లీగ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. ఐపీఎల్‌కు పోటీగా ప్రముఖ క్రికెటర్లతో పాటు యువ ఆటగాళ్లను కూడా ఈ లీగ్ ఆకర్షించనుంది. క్రికెటర్లకు ఆర్థికపరమైన భద్రత ముందే కల్పిస్తూ, వారిని ఒప్పించడం కోసం ముందే బ్యాంక్ గ్యారంటీలు కూడా ఇవ్వాలని ‘ఎసెల్’ ప్రతిపాదిస్తోంది. ఐపీఎల్‌కు దూరంగా ఉన్న పాక్ క్రికెటర్లను కూడా లీగ్‌లో చేర్చాలని భావిస్తున్న నిర్వాహకులు, ఏడాదిలోగా దీనిని ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నారు.