breaking news
Ravuri funeral
-
స్వాతంత్య్రయోధుడు రావూరి కన్నుమూత
వానపాముల(పెదపారుపూడి)/లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికోద్యమ నాయకుడు, గాంధేయవాది రావూరి అర్జునరావు (104) కన్నుమూశారు. ఆయన వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లో కుమారుడు డాక్టర్ పవర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాములలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయనకు భార్య మనోరమ, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మనోరమ నాస్తికోద్యమ నాయకుడు గోరా పెద్దకుమార్తె. అర్జునరావు.. గోరాతో కలిసి స్వతంత్ర పోరాటం, సాంఘిక ఉద్యమాల్లో పనిచేశారు. క్విట్ ఇండియా పోరు సమయంలో జైలు జీవితం గడిపారు. అర్జునరావు, మనోరమ గుజరాత్‌లోని గాంధీ సేవాగ్రాం ఆశ్రమంలో గాంధీతో కలిసి రెండేళ్లు ఉన్నారు. ఆ ఆశ్రమంలో మహాత్మాగాంధీ చేతుల మీదుగా జరగాల్సిన వీరి ఆదర్శ (కులాంతర) వివాహం.. ఆయన హత్యకు గురవడంతో నాటి ప్రధాని నెహ్రు చేతుల మీదుగా నిర్వహించారు. జీవితాంతం సామాజిక పరివర్తనకు కృషిచేసిన అర్జునరావు 2018లో వానపాములలో మార్పు ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం, దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. అర్జునరావు భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడలో నాస్తిక కేంద్రానికి తరలించి సోమవారం అంత్యక్రియలు జరపనున్నారు. -
'రావూరి' అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం విజయ్‌నగర్ కాలనీలో హిందూ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని సమాధి చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో భరద్వాజ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు విజయ్‌నగర్ కాలనీలో స్వగృహంలో వైఎస్సార్సీపీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులులుతో పాటు పలువరు ప్రముఖులు భరద్వాజ భౌతిక కాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రావూరి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.