breaking news
Ration cards canceled
-
3 కోట్ల రేషన్ కార్డుల తొలగింపా.. సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుతో అనుసంధానం లేదన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం సుమారు మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసింది. ఈ విషయంలో కొయిలీ దేవి అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ జరిపింది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు మంజూరు చేసే రేషన్ కార్డులను ఒకే దఫాలో ఇంత భారీ మొత్తంలో రద్దు చేయడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని డీల్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొప్పన్న, వి సుబ్రమణ్యన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. రేషన్ కార్డుల రద్దు అంశాన్ని చులకనగా చూడవద్దని, దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టాలని సూచించింది. పిటిషనర్ కొయిలీ దేవి తరపున సీనియర్ న్యాయవాది కొలిన్ గొంజాల్వెస్ వాదించారు. -
బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు..
ఆదిలాబాద్‌అర్బన్ : చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తీసుకోకుంటే అట్టి రేషన్ కార్డులను రద్దు చేయడం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ సంధ్యారాణి, డీసీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డుపై వచ్చే బియ్యాన్ని కార్డుదారులు వాడుకోకుండా ఇతరులకు ఇచ్చినా, అమ్మినా, కొనుగోలు చేసిన ప్రజాపంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల ప్రకారం నేరంగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. -
రేషన్ కట్
31 వేల రేషన్ కార్డులు రద్దు 1.58 లక్షల లబ్ధిదారులకు రేషన్ సరుకులు బంద్ ఎన్ఐసీతో ఆధార్ అనుసంధానం ఫలితం సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో అక్షరాల లక్షా 58 వేల మంది ఆహార భద్రత లబ్ధిదారులకు రేషన్ కోటా రద్దయింది. తాజాగా సుమారు 31 వేల 715 ఆహార భద్రత కార్డులను తొలగించి మార్చి కోటాను నిలిపివేస్తూ పౌరసరఫరాల శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆహార భద్రత లబ్ధిదారులు ఆధార్ నంబర్లను నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ)తో అనుసంధానం చేయడంతో బోగస్, డబుల్, అనర్హుల చిట్టా బయటపడింది. దీంతో అధికారులు వారిని గుర్తించి వేటు వేశారు. ఫలితంగా 96 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం కోటా తగ్గినట్లయింది. గతేడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డులను రద్దుచేసి ఆహార భద్రత పథకం కింద దరఖాస్తులు స్వీకరించడంతో పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. నగరవాసులతో పాటు వలస వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పౌరసరఫరాల శాఖ వద్ద సిబ్బంది కొరత కారణంగా కేవలం ఆధార్ కార్డులను పరిగణనలోకి తీసుకోని ఆహార భద్రత కార్డులు మంజూరు చేశారు. దీంతో బోగస్, డబుల్, ఇతర రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు సైతం మంజూరు కావడంతో కార్డుల సంఖ్య ఒకేసారి ఎగబాకింది. తాజాగా ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధార్ నంబర్లను ఎన్ఐసీ తో అనుసంధానం చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది. మొత్తం మీద బోగస్, డబుల్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల్లో కార్డులు ఉన్నవారిని గుర్తించి తొలగించారు. ఇదీ పరిస్థితి గ్రేటర్ ప్రజా పంపిణీ వ్యవస్థలో మొత్తం 12 సివిల్ సప్లయిస్ సర్కిల్స్ ఉండగా అందులో హైదరాబాద్ పరిధిలో తొమ్మిది, రంగారెడ్డి అర్బన్ పరిధిలో మూడు సర్కిల్స్ ఉన్నాయి. మొత్తంమీద ప్రస్తుతం ఆహార భద్రత కార్డులు 13.91 లక్షలు ఉండగా, అందులో 47,42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాగా తాజాగా లబ్ధిదారుల ఆధార్‌ను ఎన్ఐసీతో అనుసంధానం చేయడంతో ఆహార భద్రత కార్డుల సంఖ్య 13.60 లక్షలకు, లబ్ధిదారుల సంఖ్య 45.84 లక్షలకు చేరింది. దీంతో పీఎడీఎస్ బియ్యం కోటా కూడా 2964 మెట్రిక్ టన్నుల నుంచి 2868 మెట్రిక్ టన్నులకు తగ్గిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.