breaking news
purashkara
-
29న శివశంకరికి ‘సినారే’ పురస్కారం!
గన్‌ఫౌండ్రీ: జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహిత పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి 93వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరికి ఈ నెల 29న విశ్వంభర సినారే జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.ఈ విషయాన్ని సుశీల నారాయణరెడ్డి ట్రస్టు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాంతా బయోటిక్ ఎండి డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన పుస్తకావిష్కరణ, నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.ఇవి చదవండి: పదునైన రచయిత పసునూరి.. -
సినీ నటుడు సుమన్‌కు కీర్తి పురస్కారం
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : రాజమహేంద్రవరానికి చెందిన సాంస్కృతిక సేవాసంస్థ ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో సినీనటుడు సుమన్‌కు ప్రతిష్టాత్మకమైన కీర్తి పురస్కారాన్ని అందించారు. బొమ్మూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. నటుడిగా, సామాజికవేత్తగా సుమన్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు అద్దంకి రాజయోనా తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కామిని ప్రసాదచౌదరి, పంచాయతీ కార్యదర్శి ఎల్వీఎస్ఎన్ మూర్తి, జక్కంపూడి కళాపరిషత్ అధ్యక్షుడు యెనుముల త్యాగరాజు, జక్కంపూడి యువజన సంఘం అధ్యక్షుడు ముద్దాల అను, అంగరకృష్ణ పాల్గొన్నారు.