breaking news
proverty
-
కరోనా కాటు: దారిద్య్రంలోకి 10 కోట్ల మంది
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మురికి వాడల్లో నివసిస్తోన్న ప్రజల్లో దాదాపు పది కోట్ల మంది ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే రక్షిత మంచినీరు, సరైన మురికి పారుదల వ్యవస్థ లేకుండా అనారోగ్యానికి గురవుతున్న వారి పరిస్థితి మరింత దుర్భరం అవుతుందని ప్రపంచ బ్యాంక్‌కు చెందిన పట్టణ పరిస్థితులపై అవగాహన కలిగిన నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల మురికి వాడల నుంచి వచ్చే పన్ను వసూళ్లు కూడా 15 నుంచి 25 శాతానికి పడి పోతాయి కనుక ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం పట్టణ కార్పొరేషన్లకు ఉండే అవకాశం కూడా లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల కడు పేద ప్రజలు, నిత్య దరిద్రులు ప్రధానంగా దెబ్బతింటారని ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ డైరెక్టర్ సమేహ్ వాహ్‌బా తెలిపారు. వీరింత ఉపాధి కోల్పోవడం వల్లనే రోడ్డున పడతారని ఆయన హెచ్చరించారు. ఎక్కడైతే కామన్ మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారో, ఎక్కడైతే భౌతిక దూరం పాటించడం అసాధ్యమో ఆ ప్రాంతాలను శాటిలైట్ సహాయంతో మ్యాపింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే భారత్‌లోని ముంబై నగరంతోపాటు కైరో, కిన్షాసా నగరాలను మ్యాపింగ్ చేసినట్లు ఆయన చెప్పారు. (వరల్డ్ వార్ హీరో శత జయంతి) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది కోట్ల మందికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆహారం, ఆర్థిక సహాయం అందడం లేదని ప్రముఖ సామాజిక కార్యకర్త శీలా పటేల్ తెలియజేశారు. మురికి వాడల్లో నివసించే నిరాశ్రుయుడివైనా లేదా ఫుట్‌పాత్‌లపై పడుకునే వ్యక్తయినా వలస కార్మికుడివి అయితే చాలు ఎలాంటి రేషన్ లేదా ఆర్థిక సహాయం అందడం లేదని భారత మానవ హక్కుల సంఘానికి చెందిన శీలా పటేల్ ఆరోపించారు. పలు ప్రాంతాల్లో మురికి వాడల్లోని స్వరాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకే అక్కడి స్థానిక ప్రభుత్వాలు సతమతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వియత్నాం యుద్ధాన్ని మించి.. -
అగ్రిమెంట్ చేసినా పన్ను చెల్లించాల్సిందే
- ఆస్తుల క్రయవిక్రయాలపై ఫల్గుణకుమార్ - చాంబర్ కామర్స్‌లో అవగాహన కార్యక్రమం కర్నూలు(హాస్పిటల్): ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తేనే బదలాయించినట్లు కాదని, కొంత ప్రతిఫలం తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్నా అమ్మకంగా భావించి ఆదాయం పన్ను విధిస్తారని సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ మాజీ చైర్మన్(చెన్నై), చార్టెడ్ అకౌంటెంట్ ఈ. ఫల్గుణకుమార్ చెప్పారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కర్నూలు బ్రాంచ్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ జి. శేషాచలం ఆధ్వర్యంలో స్తిరాస్తి కొనుగోలు, అమ్మకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫల్గుణకుమార్ మాట్లాడుతూ స్తిరాస్తిని వ్యాపారం కోసం కొంటే అతని ఖర్చుగా కాకుండా ఆదాయంగా పరిగణిస్తారన్నారు. ఆస్తిని ప్రభుత్వ విలువ కన్నా తక్కువకు అమ్మినా, కొన్నా ఆ వ్యత్యాసం కూడా అతని ఆదాయం కిందనే చూపుతారన్నారు. స్తిరాస్తి కొనుగోలు విలువ రూ.50లక్షలు దాటితే, ప్రతి చెల్లింపులో 1 శాతం ఆదాయం పన్ను మినహాయించుకుని, ప్రత్యేక చలానా ద్వారా అమ్మకందారుని పేరుపై చెల్లించాలన్నారు. ఇది అగ్రిమెంట్లకు కూడా వర్తిస్తుందన్నారు. ఇంటి స్థలాన్ని అపార్ట్మెంట్ నిర్మాణం కోసం వేరొకరికి అగ్రిమెంట్ రాయిస్తే, ఆ రోజే తన భాగానికి వచ్చే ఇళ్ల కోసం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. తనకున్న భూమిలో ప్లాట్లు వేసి, ఇళ్ల స్థలాలను అమ్మేందుకు ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ తేదీనే అతను సొంత ఆస్తిని వ్యాపార నిమిత్తం బదలాయించినట్లు భావించి పన్ను విధిస్తారన్నారు. కొత్తగా నిర్మించిన ఇళ్లు, అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నా బాడుగ ఇచ్చినట్లు ఆదాయం పన్ను చెల్లించాలన్నారు. ఆస్తులు కొనేందుకు కావాల్సిన డబ్బు ఎలా వచ్చింది, ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బు ఎలా ఉపయోగించారు అనే ప్రశ్నలకు కూడా ఆదాయపు పన్ను శాఖకు సమాధానమివ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఇకాయ్ కర్నూలు బ్రాంచ్ మాజీ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ కేవీ కృష్ణయ్య, కర్నూలు ట్యాక్స్ బేరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి. బుచ్చన్న, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి, కార్యదర్శి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.