breaking news
Private Share
-
దేశవ్యాప్తంగా 60 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 60 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద కొత్తగా 5.87 కోట్ల కనెక్షన్లు మంజూరైన నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరా కోసం బాట్లింగ్ సామర్ధ్యం మరింత పెంచుకోవాల్సి ఉందన్నారు. చిన్న స్థాయిలో ఏర్పాటయ్యే 60 ప్రైవేట్ బాట్లింగ్ ప్లాŠంట్లలో ఇండియన్ ఆయిల్ 21 ప్లాంట్లను, భారత్ పెట్రోలియం 20, హిందుస్తాన్ పెట్రోలియం 19 ప్లాంట్ల సర్వీసులను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలియజేశారు. సాధారణ బాట్లింగ్ యూనిట్ వార్షిక సామర్ద్యం 1,20,000 టన్నులుగా ఉంటుండగా, ప్రైవేట్ రంగంలోని చిన్న బాట్లింగ్ ప్లాంట్ల సామర్ధ్యం వార్షికంగా 30,000 టన్నులుగా ఉంటుంది. దేశీయంగా ఎల్పీజీ వినియోగం వచ్చే ఏడాది 6–8 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు సింగ్ చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఇప్పటిదాకా ఇండియన్ ఆయిల్ 2.75 కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం: సీఎం
{పతి నియోజకవర్గంలోనూ ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల ఎస్సీ, ఎస్టీలకు అందించే పథకాలకు ఆధార్ అనుసంధానం హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల తలసరి ఆదాయం పెంచేలా.. సామాజిక అంతరాలు తొలగిపోయేలా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ల అమలుపై మంత్రులు రావెల కిశోర్‌బాబు, పీతల సుజాత, ఆ వర్గాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. 2016-17 బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.8,724 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.3,099 కోట్లు కేటాయించామన్నారు. దళితవాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికీ ఒక ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అందించే అన్ని పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో గృహాలు... ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణంలో ప్రైవేట్ నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి సచివాలయంలో గృహ నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు ఎలా ఉండాలనే అంశంపై మంత్రుల బృందంతో చర్చించి వెంటనే ఒక స్పష్టతకు రావాలని ఆధికారులను సీఎం ఆదేశించారు.