breaking news
Pravasi Bharatiya Awards Winners
-
నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌కు ఎంపికచేసింది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్‌కు ఎంపికచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానంచేస్తారు. సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఐజాక్ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్ పెరీస్‌సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు -
13మందికి ‘ప్రవాసి భారతీయ సమ్మాన్’
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో చేసిన సేవలకు గానూ 13 మంది ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ప్రవాసి భారతీయ సమ్మాన్’ పురస్కారాలను ప్రదానం చేశారు. వారి వివరాలు.. ఇలా గాంధీ: మహాత్మాగాంధీ మునిమనవరాలు. దక్షిణాఫ్రికాలో 1994 నుంచి 2004 వరకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ఆ దేశంలో ఆమె చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా ఈ అవార్డ్‌ను ప్రకటించారు. లీసా మేరియా సింగ్: భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్. లీసా ఆస్ట్రేలియాలో తొలి దక్షిణాసియా సెనేటర్. మంత్రిగానూ పనిచేశారు. ప్రజాసేవతో పాటు భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహ సంబంధాల వృద్ధికి కృషిచేసినందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రామకృష్ణ మిషన్: 1937 నుంచి ఫిజీలో సామాజిక సేవలందిస్తున్నందుకు.. కురియన్ వర్గీస్, వాసుదేవన్ చంచ్లానీ, వికాస్ చంద్ర సన్యాల్, సత్నారాయన్‌సింగ్ రాబిన్ బల్దేవ్సింగ్, శశింద్రన్ముత్తువేల్, శిబుద్దీన్ వావ కుంజు, షంషేర్ వాయలీల్ పరంబత్, శైలేశ్ లక్ష్మణ్ వర, పార్థసారధి చిరామెల్ పిళ్లై, రేణు ఖతోర్లకు పురస్కారాలు లభించాయి.