breaking news
prabhuthva
-
ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ.. ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోన్న ట్రైలర్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సూపర్బ్ అంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. తమ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఉద్యమస్థాయిలో కృషి చేద్దాం
–ప్రభుత్వ బడుల్లో చిన్నారుల చేరికలు పెంచుదాం –సర్వ శిక్షాభియాన్ పీవో శేషగిరి భానుగుడి(కాకినాడ సిటీ) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే కేంద్ర, రాష్ట్ర ప«థకాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు ఉద్యమస్థాయిలో పనిచేయాలని సర్వశిక్షాభియాన్ పీవో మేకా శేషగిరి కోరారు. ‘ప్రభుత్వ బడి–అమ్మ ఒడి, పదితర్వాత పెళ్ళి కాదు 11’ కార్యక్రమాలపై సర్వశిక్షాభియాన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, బడిబయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ఐక్యంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిబ్బందికి, ఐఈఆర్టీలకు సూచించారు. ఇన్చార్జి డీఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయని, వసతులు, విద్యాభివృధ్ధి పథకాలలో ప్రైవేటు పాఠశాలలకు అందనంత స్థాయిలో ప్రభుత్వపాఠశాలలు ఉన్నాయని చెప్పారు. తల్లిదడ్రులు అవగాహనారాహిత్యంతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఉచ్చులో పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులకు వర్సిటీ స్నాతకోత్సవం రీతిలో పట్టాలు ప్రదానం చేశారు. డీఈవో కార్యాలయం నుంచి బాలాజీచెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ శారదాదేవి, వివిధ మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టీలు, అంగన్వాడీలు, సర్వశిక్షాభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.