breaking news
pidamarthy ravi
-
ప్రోటోకాల్ సమస్య లేకుండా రాజీనామాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడమర్తి రవి, ప్రశాంత్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తమ కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రోటోకాల్ సమస్య ఎదురుకాకుండా వీరు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వీరి రాజీనామాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పిడమర్తి రవి ఉండగా.. మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్గా సోమారపు సత్యనారాయణ కొనసాగిన విషయం తెలిసిందే. నామినేటెడ్ పదవుల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం వల్ల ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతాయన్న భావంతో సీఎం కేసీఆర్ సూచన మేరకు వీరు పదవుల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. -
కాలర్పట్టి కొట్లాడితేనే వర్గీకరణ
వనపర్తిటౌన్: ‘ఢిల్లీలో వెంకయ్యనాయుడి కాళ్లు మొక్కితే ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు..కాలర్ పట్టి కొట్లాడితేనే సాధ్యమవుతుంది’ అంటూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై పరోక్షంగా ధ్వజమెత్తారు. శనివారం వనపర్తి పట్టణంలోని యాదవ భవనంలో వనపర్తి జిల్లా పేరిట జరిగిన వనపర్తి, గద్వాల, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాల ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఆంధ్ర వాళ్లను తెలంగాణలో ఉండనీయరని ప్రచారం చేస్తే అవాస్తమని తెలినట్లే ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలు కలిసిమెలసి ఉంటారని ఆచరణలో తేలుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైనదని, సామాజిక న్యాయంలో అదో భాగమన్నారు. మాదిగ జాతిలో డక్కలి, బుడగ జంగాలు తదితర ఉప కులాలకు సమన్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ ఏకైక మార్గమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెడితే మాల కులస్థులు సైతం మద్దతిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేయించిన తీర్మానం నిలబడేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వర్గీకరణపై అడుగులు కదుపుతోందని,, ప్రస్తుత తరుణంలో అందరం ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. 27 జిల్లాలో మాదిగ జేఏసీ పటిష్టం చేయనున్నట్లు వివరించారు. కాళ్లు మొక్కే బానిసలకు మాదిగ జేఏసీలో స్థానం లేదని చెప్పారు. 2001లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 14 ఏళ్లలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందని, 1994లో ప్రారంభభమైన వర్గీకరణ ఉద్యమం 20ఏళ్లలో ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. ఓ నేత రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పనికొస్తున్నదని మండిపడ్డారు. ఆయన అంబేద్కర్ వారసుడనని చెప్పుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ ప్రతినిధులు గోపాల్, కిరణ్కుమార్,దొడ్ల రాములు, డీఎం రాములు, రవి, కృష్ణమోహన్ ప్రశాంత్, బాలస్వామి, మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులూ.. ఆందోళన వద్దు
ఎంపికైన అందరికీ సబ్సిడీ రుణాలు పేద దళితులను రైతులుగా చూడటమే ప్రభుత్వ లక్ష్యం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మహబూబ్నగర్ విద్యావిభాగం: ఎంపికైన లబ్ధిదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ సబ్సిడీ మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి చెప్పారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణంలో హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.సబ్సిడీ మంజూరు చేసేందుకు నిధులు విడుదలయ్యాయని తెలిపారు. విడతల వారిగా అందరికీ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 1221 మందికి రూ.42కోట్లతో కొనుగోలి చేసిన 4వేల ఎకరాల భూమి పంపిణీకి సిద్ధంగా ఉందని తెలిపారు. నిరుపేద దళితులను రైతులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత రెండేళ్లలో రూ.360కోట్లు ఖర్చు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 3,222 మందికి మూడెరాల భూమిని పంపిణీ చేసినట్లు వివరించారు. భూమిలేని దళితులందరికీ మూడెకరాల భూమి పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సబ్సిడీని 80శాతం నుంచి 90శాతానికి పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సర్వయ్య మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా కొందుర్గు మండలం వెంకిర్యాలలో మూడు కుటుంబాలకు పంపిణీ చేసి 9 ఎకరాల భూమిలో చైర్మన్ టేకు మొక్కలు నాటారని తెలిపారు. నిరుద్యోగులకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని కల్పిస్తున్నామని అన్నారు. బ్యాంకర్లు నిర్లక్ష్యం చేయకుండా సబ్సిడీ మంజూరైన వారందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈఓ అశోక్, ఉద్యోగులు ఖలీల్, హన్మంతు, గఫార్ పాల్గొన్నారు. వర్గీకరణ సాధనకు ఢిల్లీలో ధర్నా పాలమూరు: ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ 119 ఎమ్మెల్యేల సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం చేశారని దాన్ని గెలిపించేందుకు కేంద్రంపై పోరాటం చేస్తానని మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తిరవి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అథితి గృహంలో ఏర్పాటు చేసిన మాదిగ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా కేసీఆర్ తీర్మానం చేస్తే 8మంది మాల ఎమ్మెల్యేలు ప్రశ్నించలేదని, కనీసం టీడీపీ, కాంగ్రెస్కు చెందిన మాలలు కూడా ప్రశ్నించలేదని గుర్తు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ మాదిగ ఉద్యమంలో పాల్గొంటున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారని ఇది సరికాదన్నారు. 25ఏళ్ల వర్గీకరణ ఉద్యమాన్ని విద్యావంతుల, యువకుల ఉద్యమంగా మార్చాలన్నారు. ఆగష్టు 8,9,10 తేదీలలో వర్గీకరణ సాధనకు మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు విద్యార్థులు, యువత, ఉద్యోగులు, జర్నలిస్టులు, డాక్టర్లు, తరలిరావాలని కోరారు. మల్లన్నసాగర్లో నాలుగు ఊర్లు పోతున్నాయని, పోలవరంలో 400ఊర్లు పోయాయని అన్నారు. 20ఏళ్లుగా సాగుతున్న వర్గీకరణ ఉద్యమానికి కోదండరాం ఎందుకు మద్ధతు తెలపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో 119 రోజులు జైలు జీవితం గడిపిన తాను, వర్గీకరణ సాధించే వరకు పోరాటం చేస్తానన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్, నాయకులు సుందర్, మైనర్బాబు, గోపాల్, నంచర్ల శ్రీను, బొర్రసురేష్, దినేష్, పాతూరి రమేష్ పాల్గొన్నారు.