breaking news
Pets Are My Best Friend
-
అమెరికా అధ్యక్షుల పెంపుడు జంతువులు ఇవే..
వైట్‌హౌస్ అంటే అక్కడి ప్రెసిడెంటు గారిలాగే ఆయన పెంపుడు జంతువులు (పెట్స్) కూడా ఫేమసే.. ఎప్పుడో 1789లో అమెరికా మొదటి అధ్యక్షుడిగా పీఠాన్ని అధిరోహించిన జార్జ్ వాషింగ్టన్ నుంచి మొన్నమొన్నటి బరాక్ ఒబామా దాకా పెంపుడు జంతువులంటే పడి చచ్చేవారే.. ఒక్క మన ట్రంప్ మాత్రమే మినహాయింపు.. ఆయనకు పెంపుడు జంతువులు లేనేలేవు.. అమెరికా అధ్యక్షుల్లో అలా లేకపోవడం ఓ రికార్డు కూడా.. కనీసం కుక్కనైనా పెంచుకోమని సలహా ఇస్తే.. నాకంత టైం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. బైడెన్ రాకతో వైట్‌హౌస్‌లో మళ్లీ ఇప్పుడు పెంపుడు జంతువులు ప్రవేశించనున్నాయి. ఆయనకు రెండు కుక్కలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు పెంచుకునే వాటిల్లో కుక్కలు, పిల్లులు, గుర్రాలు, మేకలు, గొర్రెలు, రకరకాల పక్షులు.. అంతేనా.. ఎలుగుబంట్లు, మొసలి కూడా ఉన్నాయి. జార్జ్ వాషింగ్టన్ దగ్గర బోలెడన్ని గుర్రాలు ఉండేవి. వాటితోపాటు మొసలి కూడా ఉండేది. అది ఆయన బాత్రూంలోనే మకాం వేసేదట. విదేశాల నుంచి వచ్చిన అతిథులు సడెన్‌గా దాన్ని చూసి.. హడలి చచ్చిన రోజులున్నాయి. ఇక ఉడ్రో విల్సన్ గారి గొర్రెలు వైట్‌హౌస్ లాన్‌లోనే గడ్డిమేసిన ఉదంతాలెన్నో. ఇలా చెప్పుకుంటే బోలెడు కథలు. కొందరు అధ్యక్షులైతే.. . కొన్ని రకాల పక్షులు, గొర్రెల మందలను పెంచుకునేవారని.. అవి ఎన్ని వందలు ఉండేవో వాటి లెక్కే లేదని ప్రెసిడెన్షియల్ పెట్ మ్యూజియం గణాంకాలు చెబుతున్నాయి. వాటిని లెక్కేయకుండా.. ప్రధానమైన పెంపుడు జంతువుల లెక్కను మాత్రమే ఈ పెట్ మ్యూజియం నిర్వహిస్తోంది. దీని ప్రకారం అందరి కన్నా ఎక్కువగా.. థియేడర్ రూజ్వెల్ట్ వద్ద 48 పెంపుడు జంతువులు ఉండేవి. ఇందులో 6 కుక్కలు, 2 పిల్లులు, 40 ఇతర జంతువులు ఉన్నాయి. అందరి అధ్యక్షుల లిస్టు అంటే చదవడం కష్టం కానీ.. ఓసారి బైడెన్‌తో కలుసుకుని లాస్ట్ 10 మంది అధ్యక్షుల పెంపుడు జంతువుల జాబితా ఓసారి చూసేద్దామా.. -
పెట్ లవర్స్ డే
హరీబరీ జీవితాలతో మనిషి వర్రీ అయిపోతున్నాడు. మనిషితో మనిషి మనసు విప్పి మాట్లాడుకునే సందర్భాలే కరువయ్యాయి. ఆ ఆందోళనల నుంచి బయటపడటానికి బెస్ట్ ఆప్షన్స్ పెట్స్. ఎంతటి ప్రెజర్లో ఉన్నా సరే... మనసును ప్లెజెంట్ చేసే ఈ మూగజీవాలను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు నగరవాసులు. పెట్ లవర్స్ డే సందర్భంగా ‘పెట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్’ అంటున్న కొందరి సెలబ్రిటీస్‌ని సిటీప్లస్ పలకరించింది. - శిరీష చల్లపల్లి పెట్స్ కోసం ఆఫీసు పూరీ జగన్నాథ్.. అనగానే మనకు మాస్ సినిమాల దర్శకుడే గుర్తుకొస్తాడు. ఆయనలో చాలా సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. అందుకు నిదర్శనం ఆయన సాంగత్యంలో పెరుగుతున్న జంతువులు, పక్షులే. సిటీకి ఏ కొత్తరకం పక్షులు, కుక్కలు వచ్చినా కొనే పూరీ, వాటికోసం చిన్నపాటి ‘జూ’యే ఏర్పాటు చేశాడు. ఆయనేమంటున్నాడంటే... ‘నాకు మొదటినుంచి మూగజీవాలంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. ఎంత టెన్షన్లో ఉన్నా... ఎన్ని పనులున్నా... ప్రతిరోజూ కనీసం ఓ గంటైనా వాటితో గడుపుతాను. ఇంకా చెప్పాలంటే నా దగ్గర చిన్న సైజు జూయే ఉంది. కేవలం నా పెట్స్ కంఫర్ట్ కోసం ఇప్పటివరకు నాలుగు ఆఫీసులు మార్చాల్సొచ్చింది. నా దగ్గర పగ్, లాబోరేదర్, జర్మన్ షెపర్డ్, చువా... ఇలా తొమ్మిది రకాల డిఫరెంట్ బ్రీడ్ డాగ్స్, లక్షల విలువ చేసే పది రకాల జాతి పక్షులు, మూడు రకాల కుందేళ్లు, ఒక పర్షియన్ క్యాట్ ఉన్నాయి. ఇక రేర్ కలెక్షన్ ఫిషెస్ను కూడా పెంచుతున్నాను. సిటీలోకి కొత్తరకం పక్షులు, కుక్కలు ఏవి వచ్చినా అది ఎంత ఖరీదైనదైనా సరే నచ్చితే వెంటనే కొనేస్తాను. వాటిపై ఇంత ప్రేమ పెంచుకోవడానికి కారణం... వాటిలో ఎలాంటి కల్మషం ఉండదు. ఎంతో విశ్వాసంగా ఉంటాయి. నా పెట్స్‌ను చూసుకోవడానికి ఓ కేర్‌టేకర్ ఉన్నాడు. వాటి ఫుడ్, మంత్లీ చెకప్స్, మెయింటెనెన్స్‌కి నెలకు 30 వేల దాకా ఖర్చవుతుంది. అవి చూపే ప్రేమ ముందు దాని విలువ చాలా తక్కువ. మనుషులకంటే మూగజీవాలకే మానవత్వం ఎక్కువని నమ్ముతాను. నా దగ్గర ఉన్న అన్ని పెట్స్‌కి వాటికి అనుకూలంగా ఉండేట్టు స్పెషల్ హౌసెస్ ఇంటీరియర్ డిజైనర్‌తో చేయించాను. ఇక నా వైఫ్ లావణ్య కూడా పెట్ లవర్ కావడం నాకు కలిసొచ్చిన అంశం. బర్త్ డేస్ అయినా వెడ్డింగ్ యానివర్సరీ అయినా తను నాకు సంతోషాన్నిచ్చే పెట్స్‌నే గిఫ్ట్‌గా ఇస్తుంది’ మై రోమియో - నటి సంజన నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర లాజాప్సో బ్రీడ్ డాగ్ ఉంది. వాడి పేరు రోమియో. నా లవర్ బోయ్లాగ. నాతోనే ఉంటాడు. నా బిలాంగింగ్స్ అన్ని తెచ్చిస్తాడు. వాడికి నా చేత్తో ఫుడ్ పెట్టి నేను అక్కడ నిలబడితేనే తింటాడు. రోడ్‌పైన ఏ డాగ్‌ని చూసినా నాకు జాలి అనిపిస్తుంది. అందుకే ఫోర్ స్ట్రీట్ డాగ్స్‌ను కూడా పర్సనల్‌గా అడాప్ట్ చేసుకున్నాను. వాటికి టైమ్ టు టైమ్ మెడికల్ చె కప్‌తోపాటు అన్ని రకాల లగ్జరీస్ ఉన్నాయి. నా రోమియో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. నా బెడ్రూమ్లోకి ఒక్క మస్కిటో వచ్చినా అది వెళ్లేవరకు వదిలిపెట్టడు. హీ ఈజ్ మై ట్రూ లవర్. అండ్ ఐ లవ్ హిమ్ టూ! బర్డ్స్ లవర్ - హీరో నందు నాకు మొదటినుంచే పక్షులంటే చాలా క్రేజ్. అందులోనూ టాకింగ్ ప్యారెట్స్ అంటే ఇంకా పిచ్చి. అయితే పక్షులను పంజరాల్లో బంధించడం అంటే అస్సలు నచ్చదు. లవ్ బర్డ్స్ గురించి అందరికీ తెలుసు... నేను బర్డ్స్ లవర్ని. అందుకే ఇంపోర్టెడ్ ఎక్సోటిక్ బర్డ్స్ అయితే పంజరంలో ఉంచాల్సిన అవసరం లేదు. బయటికి ఎగిరిపోవు. అందుకే ఆఫ్రికన్ గ్రే ప్యారె ట్ని తెచ్చుకున్నాను. వాడి పేరు ఆలివ్. చాలా యాక్టివ్. ప్రపంచంలోని బెస్ట్ టాకింగ్ బ్రీడ్. వాడి వయసు నాలుగు నెలలు. ఇప్పుడిప్పుడే ‘హాయ్ బేబీ’, ‘లవ్ యూ’ లాంటి చిన్నచిన్న మాటలు నేర్చుకుంటున్నాడు. నాకే కాదు ఇంట్లో అందరికీ వాడంటే ప్రాణం. అమ్మయితే ఆలివ్‌ని తన చిన్న కొడుకు అంటూ మురిసిపోతుంటుంది. అమ్మచేత్తో పెట్టే ‘పప్పు అన్నం’ వాడికి ఇష్టం. షూటింగ్స్ లేని టైమ్‌లో వాడితో ఫుల్ టైంపాస్. వాడికోసం బుజ్జి వార్డ్రోబ్, అందులో చిట్టి కోంబ్, బ్యూటీ బ్యాండ్ అన్నీ ఉన్నాయి. ఫొటోలకు ఫోజులు ఇవ్వడమంటే వాడికి చాలా ఇష్టం. వాడితో ఆడి ఆడి మనం అలసిపోవాలే కానీ... వాడు అస్సలు అలసిపోడు. ఐ లవ్ మై లవ్లీ ‘ఆలివ్’! హీ ఈజ్ ఆసమ్! - హీరో తనీష్ నాకు స్కూల్ టైమ్ నుంచి డాగ్స్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర లాజాప్సో బ్రీడ్ పెట్ ఉంది. వాడి పేరు బర్ఫీ. నా లిటిల్ బ్రదర్. నేను బయటికి వెళ్తే వచ్చేవరకూ నాకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చాక్లెట్స్ చూస్తే చాలు.. రెండు కాళ్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తాడు. మ్యూజిక్ ఆన్ చేస్తే డ్యాన్స్ చేస్తాడు. మంత్లీ వన్స్ గ్రూమింగ్ చేయిస్తాం. వాడి గ్రూమింగ్, ఫుడ్ మెయింటెనెన్స్ అంతా నెలకు ఐదువేల దాకా అవుతుంది. ఇంట్లో అందరం ఎప్పుడూ తన చుట్టే ఉండాలని వాడి ఫీలింగ్. అందుకే ఎప్పుడైనా ఊరెళ్తే మాతోనే ప్రయాణమవుతాడు. చూడ్డానికి అచ్చు బొమ్మలా ఉంటాడు. అందుకే వాడిని చూసిన ప్రతి ఒక్కరూ ముచ్చటపడతారు. వాడితో గడుపుతుంటే టైమే తెలియదు. ఇంట్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. హీ ఈజ్ జస్ట్ ఆసమ్!