breaking news
petrolium dealers
-
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
సాక్షి,ఢిల్లీ: కూటమి ప్రభుత్వం తప్పును ఒప్పుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు తప్పేనని అంగీకరించింది. అందుకు అనుగుణంగా ఆదేశాలను ఉపసంహరించుకున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.అమరావతి నిర్మాణం కోసం రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు ఇవ్వడంతో కొరత ఏర్పడింది. ఈ ఆదేశాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి లేఖ రాశారు. కేంద్రం వార్నింగ్‌తో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలను రద్దు చేసింది.కాగా, గత నెలలో ఏపీలో పెట్రోల్ సంక్షోభానికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్‌ను రిటైల్ బంకుల నుంచి సరఫరా చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్‌ను సరఫరా చేయాలని నిర్ణయించింది.కూటమి సర్కార్ చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. తాజాగా ఆ అంశానికి సంబంధించి తన తప్పును కూటమి సర్కార్ ఒప్పుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు తప్పేనని అంగీకరించారు మనోహర్.అందుకు అనుగుణంగా ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు.పెట్రోల్ ధరల తగ్గింపుపై తర్వాత మాట్లాడదాందేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి, వాటిపై ట్యాక్స్‌ను ఎత్తివేసే ఆలోచన ఏమైనా ఉందా’? అంటూ నాదెండ్ల మనోహర్ని మీడియా అడగ్గా.. . ధరల తగ్గింపుపై తర్వాత మాట్లాడదాం’ అంటూ సమాధానాన్ని దాటవేశారు.ఇది ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు.ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను ఆదా చేసేలా ఉండాలని ప్రధాని పిలుపునిస్తుండగా.. రాష్ట్రంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా.. ‘‘ఇది ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు, దీనిపై ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు’’ అని సమాధానమిచ్చారు. -
పెట్రోలియం డీలర్ల నిరసన విరమణ
-
పెట్రోలియం డీలర్ల నిరసన విరమణ
⇒ చమురు కంపెనీలతో డీలర్ల చర్చలు సఫలం ⇒ఓఎంసీ, సీఐపీడీ, ఏఐపీడీఏ మధ్య ఒప్పందం ⇒యథావిధిగా బంకుల నిర్వహణ సాక్షి, హైదరాబాద్: కమీషన్ పెంపు వ్యవహరంపై చమురు కంపెనీలకు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య నెలకొన్న వివాదానికి తెరపడినట్లరుుంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించి కమీషన్ పెంపునకు చమురు సంస్థలు అంగీకరించడంతో తాము చేపట్టదలచిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీ.వినయ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం ముంబైలో చమురు కంపెనీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకు ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ సింగిల్ షిఫ్ట్ విధానంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు సాగిస్తామని, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ బంకులు మూసేస్తామని తీవ్ర నిర్ణయాలను పెట్రోలియం డీలర్లు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో వారు తమ నిర్ణయాలను ఉపసంహరించుకున్నారు. కుదిరిన ఒప్పందం.. డీలర్ల మార్జిన్ పెంపు విషయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు, కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ), ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్(ఏఐపీడీఏ) మధ్య ఒప్పందం కుదిరింది. మోటర్ స్పిరిట్ కిలో లీటర్‌కు రూ.138, హైస్పీడ్ డీజిల్ కిలో లీటర్‌కు రూ.102ను డీలర్ మార్జిన్ కింద పెంచేందుకు అంగీకారం కుదిరింది. ఈ పెంపును నవంబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఓఎంసీ, సీఐపీడీ, ఏఐపీడీఏ సభ్యుల సంయుక్త కమిటీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ సంయుక్త కమిటీ డీలర్ రెమ్యునరేషన్, గతంలో జరిగిన తప్పుల పరిశీలనను నవంబర్ 15 కల్లా పూర్తి చేసి తగిన సిఫారసులు చేస్తుంది. కొత్త డీలర్ రెమ్యునరేషన్‌ను తదుపరి డీలర్ మార్జిన్ పెంపు సమయంలో అమలు చేస్తారు. ప్రతీ ఆరు నెలలకొకసారి అంటే జనవరి 1, జూలై 1న డీలర్ మార్జిన్‌ను సవరించడం జరుగుతుంది. సవరించిన ఎన్ఎఫ్ఏ రిపోర్ట్‌ను నవంబర్ 30లోపు ఖరారు చేస్తారు. తదుపరి డీలర్ మార్జిన్ సవరణ సమయంలో ఈ రిపోర్ట్‌ను అమలు చేస్తారు. సిబ్బంది అధ్యయనాన్ని బయట ఏజెన్సీ చేత డిసెంబర్ 31 నాటికి ప్రారంభిస్తారు. హైస్పీడ్ డీజిల్ నష్టాల నివేదికను ఈ నెలాఖరుకల్లా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి తెప్పించుకోవాలని నిర్ణయించారు. ఆ సంస్థ సిఫారసులను వచ్చే డీలర్ కమిషన్ సవరణ సమయంలో అమలు చేయాలని కూడా నిర్ణరుుంచారు. మోటర్ స్పిరిట్ నష్టాలపై అధ్యయనాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి చేపట్టి 2018 జనవరి 1 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.


