breaking news
pension rates
-
అమ్మో.. ఒకటో తారీఖు..
ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడంతో జిల్లాలో 42,152 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు, 27,696 మంది పింఛనుదారులు ఆర్థిక ఇబ్బందులతో బతుకుబండిని లాగుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఇప్పటికే రెండు పీఆర్సీలను కోల్పోవడంతో కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దీంతో అక్కడి ఉద్యోగుల్లో ఆనందంలో నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటించే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. సరైన ఫిట్మెంట్ ఇవ్వకపోవడంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఏటా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పోటీ పడలేక వచ్చే వేతనాలతోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. వారాంతంలో సరదాలకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వస్తోంది. సినిమాలకు వెళ్లాలన్నా ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకటించి ఫిట్మెంట్ ఇస్తే కొత్త వేతనాలతో కొంత కోలుకుంటామని పలువురు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బి.కొత్తకోట: ఫిట్మెంట్ శాతం ఆధారంగానే ఉద్యోగుల మూల వేతన నిర్ధారణ జరుగుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. గడిచిన ఐదేళ్లలో పెరిగిన నిత్యావసరాల ధరల సరాసరి అంచనాతో ఫిట్మెంట్ ప్రకటించారన్నది ఉద్యోగ సంఘాల వాదన. దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే వేతనం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరాలు తీర్చుకునేందుకు వీలవుతుంది. గతంలో 8వ పీఆర్సీలో 16శాతం, 9వ పీఆర్సీలో 39శాతం, 10వ పీఆర్సీలో 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సుచేశారు. ప్రస్తుతం 69శాతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 2013 జూలైలోనే కొత్త పీఆర్సీ అమలు కావాల్సిన ఉన్నా అమలుకునోచుకోలేదు. ఇప్పటికే 19నెలల కాలాన్ని కోల్పోయిన ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. ఫలితంగా రెండు పీఆర్సీలను కోల్పోవాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో కొత్త ఫిట్మెంట్ ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడడం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిట్మెంట్ ప్రకటిస్తే మూలవేతనం పెరుగుతాయని ఆశతో ఉన్నారు. ఇదీ చంద్రయ్య బడ్జెట్ పెద్దతిప్పసముద్రం మండల పరిషత్ కార్యాలయం లో టైపిస్టుగా పనిచేస్తున్న ఆర్.చంద్రయ్య బి.కొత్తకోటలో అద్దెఇంట్లో ఉంటున్నాడు. ఇతనికివచ్చే వేతనంలో కోతపోగా రూ.24,188 వస్తుంది. ఇది చేతికివచ్చిరాగానే కరిగిపోతోంది. ఇంట్లో నిత్యం మందు లు వాడాల్సిన వారి కారణంగా జీతంలో ఎక్కువ సోమ్ము దానికే సరిపోతోంది. ఇంటిఅద్దె రూ.3,500 పాలు, కూరగాయలకు రూ.3,000 బియ్యానికి రూ.1,200 కరెంట్చార్జీ రూ.400 నీటి ట్యాంకర్లు రెండింటీకి రూ.800 బట్టలు ఉతకడం, ఇస్త్రీకి రూ.1,000 కుటుంబానికి అవసరమైన మందులకు రూ.5,000 బంధువుల ఇళ్లకు వెళ్లివచ్చేందుకు రూ.2,000 పిల్లల విద్యకు రూ.2,500 ఇతర ఖర్చులు రూ.2,500 మొత్తం రూ.21,900 ఇక మిగిలిన సోమ్ము కూడా దాచిపెట్టుకునే వీలులే దు. అది కూడా వైద్యానికి వినియోగించాల్సివస్తోం ది. ఇలా అందే వేతనం ఖర్చులకే సరిపోతే భవిష్యత్తుకోసం ఏం దాచుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇది వెంకట్రమణ కష్టం! పలమనేరు: పలమనేరు తహశీల్దార్ కార్యాలయానికి సంబంధించి జగమర్ల వీఆర్ఏగా పనిచేస్తున్నాడు వెంకట్రమణ. చాలీచాలని జీతంతో ఇళ్లు గడవడమే కష్టంగా మారిన తరుణంలో రాష్ర్టప్రభుత్వం ఫిట్మెంట్నైనా ప్రకటిస్తే జీతానికి ఏకొంతో చేరుతుందని ఆశపడ్డాడు. కానీ ఆ సగటు ఉద్యోగి ఆశలు అడియాశలే అయ్యాయి. గంగవరం మండ లం కీలపట్లకు చెందిన వెంకట్రమణ పదేళ్లకు పైగా ఈ ఉద్యోగంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నెల రూ.6,300 జీతం. అది కూడా ఏ రెండు నెలలకో, మూడు నెలలకో మాత్రమే అందుతోంది. జీతంపై ఆధారపడి జీవించే ఇతను ప్రతి నెలా అప్పులతోనే సంసారాన్ని లాక్కొస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. ముగ్గురు కుమార్తెలకు ఎట్టాగో పెళ్ళిళ్ళు చేశాడు. కొడుకు పలమనేరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తొడుక్కోవడానికి సరైన బట్టలు లేకపోవడంతో పలమనేరు ఎంపీడీవో బాలాజీ కొంత ఆర్థిక సాయం చేసి బట్టలు కొనిచ్చారు. ఇక కళాశాలలో ఫీజు కట్టేందుకు ఇబ్బంది ఎదురైతే కళాశాల కరస్పాండెంట్ కనుకరించారు. గతంలో ఈయన భార్య చనిపోయింది. ఇతనితో పాటు పుట్టిన అక్కా చెల్లెళ్లు నలుగురు వారి బాగోగులు వెంకట్రమణే చూసుకోవాలి. ప్రస్తుతం భర్త చనిపోయిన ఓ చెల్లె ఇంట్లోనే ఉంది. వచ్చే జీతంతో ఈ కష్టాలను ఎదురీదాలా. తనకు రెండెకరాల మెట్టపొలముంది. వర్షాలు రాక వేరుశెనగ చేతికొచ్చి ఐదారేళ్లయ్యింది. నెలకు ఇంట్లో బియ్యానికి రూ.2వేలు కావాల్సిందే. ఆస్పత్రులు, చదువు తదితరాలకు నెలకు ఎంతలేదన్నా రూ.10వేల దాకా ఉండాల్సిందే. కానీ అతనికొచ్చే జీతం ఏ మాత్రం చాలదు. కనీసం ఫిట్‌మెంట్‌తోనైనా ఓ వెయ్యి పెరుగుతుందేమోనని ఆశించాడు. ఇప్పటికే అప్పు రూ.20వేలు దాటింది. చాలీచాలని జీతాలతో జీవితాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థంగాక బాధపడుతున్నాడు. 2004 పునరావృతం అవుతుంది నేను మారాను. నన్ను గెలిపిస్తే మంచి పాలన అందిస్తాను. ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రభుత్వం అని చెప్పుకునేలా వ్యవహరిస్తానని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతోకాలంగా ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఖాళీ ఖజానా, కేంద్రం ఆర్థిక సాయం నిరాకరణ, రాష్ట్ర విభజన వంటి కుంటి సాకులతో జాప్యం చేస్తున్నారు. ఇప్పటికైనా తీరు మారకుంటే 2004 ఎన్నికలు పునరావృతం అవుతాయి. -ఎస్.బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పరిషత్(ఆపస్) డీఏకు కోత విధించడం బాధాకరం ఖాళీ ఖజానా పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు గతంలో ఇస్తున్న 0.856డీఏను ప్రస్తు తం 0.524శాతానికి కోత విధించడం బాధాకరం. దీనివల్ల జీతాలపై ఆధారపడ్డ మధ్య తరగతి ఉద్యోగులు చాలా నష్టపోతారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల డీఏలో కోత విధించడం సరికాదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ప్రకటించకుండా జాప్యం చేయడం తగదు. ముఖ్యమంత్రి స్పందించి తెలంగాణ ప్రభుత్వం కంటే మెరుగైన పీఆర్సీని ప్రకటించాలి. -టీ.గోపాల్, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్(ఆర్జేయూపీ), తిరుచానూరు. చాలీచాలని జీతాలు ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా వూరింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె, పిల్లలు చదువులు, కుటుంబానికి సంబంధించిన ఇతర ఖర్చులు చూస్తుంటే ఇప్పుడు వస్తున్న జీతం చాలక ప్రతినెలా అప్పు చేయూల్సిన పరిస్థితి నెలకొంది. 2009లో అప్పటి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 2013 జూలై నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వాలి. పీఆర్సీ కమిటీ 29 శాతం పెంచవుని చెప్పడంతో ఇప్పుడు పెంచినా కేవలం 2 శాతమే పీఆర్సీ పెరుగుతుంది. వెంటనే పీఆర్సీ 65 శాతం పెంచి ఉద్యోగులను ఆదుకోవాలి. - మోహన్, ఉపాధ్యాయుడు, బాలుర ఉన్నత పాఠశాల, శ్రీకాళహస్తి మావి చాలీచాలని బతుకులు పొరుగు రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ను ప్రకటించింది. ఇక్కడేమో సరిగ్గా జీతాలు కూడా ఇవ్వడం లేదు. మాలాంటి బక్క ఉద్యోగుల పరిస్థి తి దయనీయంగా ఉంది. ప్రభుత్వం ఆలోచించి తమలాంటోళ్లను ఆదుకోవాలి. -దేవేంద్రుడు, వీఆర్ఏల సంఘ నాయకులు, పలమనేరు ఉద్యోగస్తులు బాగుండాలి తెలంగాణలోని ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చినట్టుగానే ఇక్కడా ఇవ్వాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగులు మనస్ఫూర్తిగా విధులు నిర్వహించాలి. ఇక్కడి ప్రభుత్వమేమో ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తోంది. మధ్య తరగతి ఉద్యోగులకు ఆసరాగా నిలిచే ఫిట్మెంట్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి. -పుష్పరాజ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయసంఘ నాయకులు త్వరలో వస్తుందనుకుంటున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తుందనే అనుకుంటున్నాం. నిత్యావసర వస్తువులు భారీగా పెరిగిన నేపథ్యంలో సగటు ఉద్యోగుల పరిస్థితి కష్టాలమయమే. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి తగు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. - సోమచంద్రారెడ్డి, యూటీఎఫ్ నాయకులు -
పింఛన్ల పంపిణీలో దొంగనోట్లు..
నెల్లూరు(విద్య) : ఎవ్వరిది మోసం..ఎక్కడ జరిగిందిలోపం.. లబ్ధిదారులకు మాత్రం శాపం. నెల రోజులగా ఎదురుచూపులు..గంటలకొద్ది పడిగాపులు..చివరికి చేతికి వచ్చింది దొంగనోట్లు. వారంత వృద్ధులు, వికలాంగులు, కళ్లు కనిపించని వారు, నడవలేని వాళ్లు గంటల తరబడి పింఛన్ డబ్బులు అందుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. చివరికి తమ వంతు వచ్చేసరికి దొంగనోట్లు అందడంతో నిరాశచెందారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని 3వ డివిజన్లోని సింహపురికాలనీలో బుధవారం ఇద్దరికి రూ.1000ల కాగితాలు దొంగనోట్లు వచ్చాయి. గురువారం ఏకంగా 11 మందికి రూ.1000లు దొంగనోట్లు రావడంతో పింఛన్‌దారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దదైంది. పింఛన్ పేరుతో దొంగనోట్లు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? అంటూ పింఛన్‌దారులు అధికారులను నిలదీశా రు. ఎన్ని ఇబ్బందులు పెట్టి తీరా దొంగనోట్లు ఇస్తారా.. అంటూ జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. పింఛన్లు ఇవ్వడాన్ని నిలిపివేశారు. సమాచారమందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దొంగనోట్లను అధికారులు వెనక్కి తీసుకున్నారు. మళ్లీ వారికి వేరే నోట్లను అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లలో దొంగనోట్లు రావడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజలను కావాలని మోసం చేసేందు కు ప్రభుత్వం ఇలా చేసిందా.. లేక అధికారుల చేతివాటం ఉందని బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తాయి. వృద్ధులకు పింఛన్లు పెంచామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం పింఛన్ల కోసం లబ్ధిదారులను నానా ఇబ్బందులకు గురిచేసింది. ఇలా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ప్రక్రియలో దొంగనోట్లు రావడంతో వృద్ధులు శాపనార్ధాలు పెట్టారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియకు అవసరమైన నగదు ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తారు. అలాంటిది ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన నగదులో దొంగనోట్లు ఎలావచ్చాయి. మోసానికి పాల్పడింది ఎవరో? అనే విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
భయోమెట్రిక్
తమకు వచ్చే నాలుగు రూకలనే వారు కొండంత అండగా భావిస్తారు. ఆ సొమ్ముతో ఒకనెల ఎలాగోలా నెట్టుకొస్తారు. అందుకోసం ప్రతి నెల వచ్చే ఒకటో తేదీ కోసం ఎదురు చూస్తారు. కొన్ని నెలలుగా పింఛన్లు అందుకోవటానికి అగచాట్లు పడుతున్నారు. సాంకేతిక లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గం చూపడంలో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. పింఛన్ కేంద్రాల వద్ద పండుటాకులు, వికలాంగులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. కడప రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా సాగుతోంది. ముఖ్యంగా బయో మెట్రిక్ విధానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు సమస్యకు పరిష్కారం చూపకుండా చోద్యం చూస్తున్నారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మనోవేదనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఫినో, పట్టణ ప్రాంతాలలో మణిపాల్ సంస్థల ద్వారా పింఛన్ల పంపిణీ సాగుతోంది. అయితే బయో మెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఐసీఐసీఐ వారి అనుసంధానంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), పట్టణ ఇందిరాక్రాంతి పథం (మెప్మా) ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ సాగుతోంది. జిల్లాలో ఏడు కేటగిరీలకు సంబంధించి 2,47,592 మందికి ప్రతినెల రూ. 8,28,65,400 పంపిణీ చేస్తున్నారు. ఇందులో 23,014 మంది బయో మెట్రిక్‌లో పేరు నమోదు చేసుకోలేని కారణంగా రెండు నెలల నుంచి పింఛన్లు మంజూరు కాలేదు. బయోమెట్రిక్‌లో తమ పేరు, వేలిముద్రలు తదితర వివరాలను నమోదు చేసుకుంటేనే పింఛన్లను పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. వేలిముద్రలను తిరస్కరిస్తున్న మిషన్ బయో మెట్రిక్ (పీఓటీ) మిషన్ ద్వారా పింఛన్‌దారుల వేలిముద్రల వివరాలను పింఛన్ సొమ్మును పంపిణీ చేసే సిబ్బంది స్వీకరిస్తారు. వేలిముద్రలను బయో మెట్రిక్ స్వీకరిస్తేనే సదరు వ్యక్తికి పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తారు.50 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసుకునే వారి వేలిముద్రలను మిషన్ స్వీకరించలేకపోతోంది. దీంతో వారు తమకు వచ్చే పింఛన్ సొమ్ము కోసం రోజుల తరబడి పింఛన్ కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నిరీక్షించి....నిరీక్షించి ఒత్తిడికి, అనారోగ్యానికి లోనవుతున్నారు. మరికొంతమంది సృ్పహతప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు. ప్రస్తుత విధానాన్ని ఎత్తివేసి మాన్యువల్ పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేయాలనే డిమాండ్ వస్తోంది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు కొత్త పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది. గడిచిన ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉప ఎన్నికల ముందు కొత్త పింఛన్లు పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు మరికొన్ని కొత్త పింఛన్లను పంపిణీ చేశారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో నిర్వహించిన రచ్చబండ తర్వాత జిల్లా వ్యాప్తంగా ఆయా ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలకు దాదాపు 12 వేల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వివరాలన్నీ ఆయా అధికారులు పింఛన్ల వెబ్సైట్లో ప్రభుత్వానికి విన్నవించారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలను నివారించి క్రమం తప్పకుండా పంపిణీ చేయడంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లు వచ్చేలా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు నెలలుగా పింఛన్ అందలేదు వేలి ముద్రలు సరి పోలేదని మూడు మాసాలుగా పింఛన్ ఇవ్వడం లేదు. గత నెలలో మళ్లీ ఫొటోలు, వేలి ముద్రలు తీశారు. అయినా ఈ నెల పింఛన్ రాలేదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తెమ్మన్నారు. వచ్చే నెల నుంచి పింఛన్ వస్తుందిలే అంటున్నారు. -బి.సుబ్బారెడ్డి, పుట్లంపల్లె, కమలాపురం ఈ అబ్బాయి పేరు హాజీ. కమలాపురంలో నివాసం ఉంటున్నాడు. మూగవాడు. ప్రతి నెల వచ్చే రూ. 500 పింఛన్ మూడు నెలలుగా రాలే దు. స్మార్ట్ కార్డు వ్యవస్థను తీసేసి మాన్యువల్‌గానే పింఛన్ ఇవ్వాలని హాజీ తల్లి కోరుతోంది.