breaking news
Peach candy
-
ఈట్ కాన్ఫెట్టీ..
ఒకప్పుడు పీచుమిఠాయి ఫుల్ ఫేమస్. చిన్నాపెద్ద అందరూ ఆ మిఠాయికి దాసోహులే. అయితే కాలక్రమంలో పీచుమిఠాయి అంతరించిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఓ చోట అరుదుగా కనిపిస్తోంది. చాలామందికి దాన్ని టేస్ట్ చేయాలనే కోరిక ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకొని సరికొత్త కాన్సెప్ట్‌తో ‘ఈట్ కాన్ఫెట్టీ’కి శ్రీకారం చుట్టారు నిహారిక, వెంకట్. పీచు మిఠాయితో దాదాపు 100 రకాల్లో ఐస్‌క్రీమ్స్ అందిస్తున్నారు. హిమాయత్‌నగర్: హిమాయత్‌నగర్‌కు చెందిన నిహారిక గొల్లపల్లి, వెంకట్ వేక్లు ఇంజినీరింగ్‌లో స్నేహితులు. బీటెక్ అయిపోయాక ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో ఫ్రెండ్స్‌తో కలసి సిటీలోని రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ స్టోర్స్‌ను సందర్శించారు. ఐస్‌క్రీమ్స్‌లో ఫ్లేవర్స్ వస్తున్నాయే తప్పా... ఆకట్టుకునే విధమైన ఐస్‌క్రీమ్స్ రావడం లేదు. దీంతో వీరికో ఐడియా పుట్టుకొచ్చింది. విభిన్న ఆకారాల్లో ఐస్‌క్రీమ్స్‌ను రూపొందించి పార్లర్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.22లో ‘ఈట్ కాన్ఫెట్టీ’ పేరుతో ఐస్‌క్రీమ్ పార్లర్‌ను ప్రారంభించారు. చుట్టూ పీచు... విభిన్న ఆకారాల్లో ఐస్‌క్రీమ్స్ రూపొందించి, దాని చుట్టూ పీచు మిఠాయి ఏర్పాటు చేసి అందిస్తున్నారు. టెడ్డీబేర్, పుల్ల ఐస్, చాక్లెట్, గర్ల్... ఇలా విభిన్న రూపాల్లో వీటిని రూపొందిస్తున్నారు. క్లవ్డ్, మౌంట్ కాన్ఫెట్టి, యూనికోన్, క్యాడీ ఫ్లవర్స్, బురిటో, షుగర్ క్యాడీ, ఫ్రెంచ్ వెన్నెల, బ్లూబెర్రీ, లెమన్ గ్రేస్, ఐరీష్ క్రీమ్, లావండర్, బబుల్గమ్, కొకొనట్ తదితర డిజార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మేమే ఫస్ట్... ఇండియాలో ఈ తరహా ఐస్‌క్రీమ్ పార్లర్ ఫస్ట్ మాదే. మూడు నెలల క్రితం దీనిని ప్రారంభించాం. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేశాం. హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, దిల్‌షుఖ్‌నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంచైజీలు ఏర్పాటుచేయనున్నాం. – నిహారిక, వెంకట్, నిర్వాహకులు -
పీచుమిఠాయి... చేయడం సులువేనోయి!
పీచుమిఠాయి పేరు చెబితే చాలు... పిల్లలూ పెద్దలూ కూడా ఎగిరి గంతేస్తారు! సన్నగా దూదిలా ఉండే పీచు మిఠాయిని మెలమెల్లగా చప్పరించడం ఓ సరదా అందరికీ! అయితే అది మనకి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే దొరుకుతుంది. అంటే... ఎగ్జిబిషన్లు, తీర్థాలు, పార్కులు, థియేటర్లు వంటిచోట మాత్రమే లభిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తినాలంటే ఎలా? దానికి సమాధానం... ఇదిగో, ఈ మెషీన్ చెబుతుంది! దీన్ని ‘కాటన్ క్యాండీ ఫ్లాస్ మేకర్’ అంటారు. రూ. 1900 నుంచి మూడు వేల రూపాయల వరకూ రకరకాల ధరల్లో, సైజుల్లో దొరకుతోందీ యంత్రం. ఇది కరెంటుతో పని చేస్తుంది. తేలికగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. పీచు మిఠాయిని చేసుకోవడం కూడా చాలా సులభం. చక్కెరతో చేసిన క్యాండీలు మార్కెట్లో దొరకుతాయి. వాటిని తెచ్చి, ఈ యంత్రానికున్న గుండ్రటి ట్రేలో వేసి, స్విచ్ ఆన్ చేస్తే చాలు. పల్చటి దూదితెరల్లా పీచుమిఠాయి పైకి లేస్తుంది. దాన్ని పుల్లకు చుట్టుకుని తినడమే తరువాయి!