breaking news
Payment in arrears
-
వివాదంలో మంగళగిరి టీడీపీ కార్యాలయం
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. పార్టీ కార్యాలయం నిర్మించిన కాంట్రాక్టర్‌కు డబ్బులు ఎగ్గొట్టింది పార్టీ. దీంతో వ్యవహారం కోర్టుకు చేరింది. పార్టీ కార్యాలయం నిర్మాణ బాధ్యతల్ని ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది టీడీపీ. ప్రెకా సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది ఎస్ఆర్ఆర్ కంపెనీ. రూ. 21 కోట్లతో మంగళగిరిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించింది ప్రెకా సొల్యూషన్. నిర్మాణ బిల్లులను చెల్లిస్తామని ప్రెకా సొల్యూషన్కు చెప్పిన టీడీపీ.. బిల్లు చెల్లింపుల్లో ఎస్ఆర్ఆర్ లిమిటెడ్‌కు సంబంధం లేదని తేల్చేసింది. అయితే బిల్లులు చెల్లించాలని ప్రెకా సొల్యూషన్ అడిగినా పట్టించుకోలేదు టీడీపీ. దీంతో ప్రెకా సొల్యూషన్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అయితే కోర్టు నోటీసులు ఇచ్చినా జాప్యం చేయడంతో ఆర్బిటర్ పిటిషన్ దాఖలు చేసింది ప్రెకా. వివాద పరిష్కారానికి రిటైర్డ్ జస్టిస్ స్వరూప్రెడ్డిని నియమించింది తెలంగాణ హైకోర్టు. -
చక్కెర మిల్లులకు వడ్డీరహిత రుణాలపై నిబంధనల ఖరారు
న్యూఢిల్లీ: చెరకు రైతుల బకాయిల చెల్లింపు కోసం చక్కెర మిల్లులకు బ్యాం కుల నుంచి రూ.6,600 కోట్ల మేర వడ్డీరహిత రుణాలిచ్చేందుకు ఓకే చెప్పిన సీసీఈఏ... వీటికి విధివిధానాలను కూడా గురువారంనాటి సమావేశంలో ఆమోదించింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చక్కెర పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ విలేకలరుతో చెప్పారు. వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తం రుణంపై రూ.2,750 కోట్ల వడ్డీ భారం పడుతుందని, సుగర్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) నుంచి దీన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు. నిధులను సక్రమంగా(రైతులకు చెల్లిం పులు) వినియోగిస్తున్నారా లేదా అనేది పరిశీలించేందుకు వీలుగా ఈ రుణాలను ప్రత్యేక బ్యాంక్ ఖాతాద్వారా బ్యాంకులు మిల్లులకు ఇస్తాయి. నోడల్ బ్యాంక్ నియామకం, రుణ ప్రక్రియ నిర్వహణకు తగిన నిబంధనలను ఆర్థిక శాఖ జారీచేయనుందని థామస్ చెప్పారు. కాగా, ఐదేళ్ల వ్యవధిలో వడ్డీలేకుండా మిల్లులు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, తొలి రెండేళ్లు చెల్లింపులపై మారటోరియంను వినియోగించుకోవచ్చని కూడా అధికారిక ప్రకటన పేర్కొంది. అసలు చెల్లింపుల్లో డీఫాల్ట్గనుక అయితే, ఆ వ్యవధికి వడ్డీ రాయితీలేవీ వర్తించకుండా విధివిధానాల్లో చేర్చారు. ప్రస్తుత సీజన్(2013-14, అక్టోబర్-సెప్టెంబర్)లోనే మిల్లులకు ఈ రుణాలు లభిస్తాయి.