breaking news
Parveen Dusanj
-
'నా కూతురివి విషపూరిత వ్యాఖ్యలు.. క్షమించను'
బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ, ఆయన కుమార్తె పూజాబేడీ మధ్య విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. కబీర్ బేడీ నాలుగో పెళ్లి చేసుకోవడంపై పూజాబేడీ బాహాటంగా విమర్శలు చేశారు. 70వ పుట్టినరోజున తన తండ్రి వివాహం చేసుకున్న పర్వీన్ దుసాంజ్‌ను 'మంత్రెగత్తె'గా, 'రాక్షసమైన సవతి తల్లి'గా అభివర్ణించారు. ట్విట్టర్లో చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో పూజాబేడీ వాటిని ఉపసంహరించుకున్నారు. 70వ ఏట ఘనంగా తండ్రి చేసుకున్న నాలుగు పెళ్లికి ఆమె దూరంగా ఉన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య సత్సంబంధాలు లేని విషయం ఇది చాటుతున్నా.. తాజాగా కూతురు పూజాబేడీ తీరుపై కబీర్ బేడీ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేం పెళ్లి చేసుకున్న వెంటనే పర్వీన్ దుసాంజ్పై నా కూతురు పూజ చేసిన విషపూరిత వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. చెడు ప్రవర్తనను ఎంతమాత్రం క్షమించను' అంటూ ఆయన ట్వీట్ చేశారు. -
తండ్రి నాలుగో పెళ్లిపై.. కూతురి ట్వీట్‌తో హల్చల్
ముంబై: బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ మరోసారి పెళ్లి చేసుకున్నారు. చాలాకాలంగా తనతో కలిసి ఉంటున్న 40 ఏళ్ల పర్వీన్ దుసాంజ్‌ను తన 70వ పుట్టినరోజున వివాహమాడారు. అయితే, వీరి పెళ్లిపై కబీర్ బేడీ కూతురు, నటి పూజాబేడి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేశాయి. 'ప్రతి సాహస కథలోనూ ఒక క్రూరమైన మంత్రగత్తె లేదా రాక్షస సవతి తల్లి ఉంటుంది. నా విషయంలో ఇప్పుడే వచ్చింది. కబీర్ బేడీ ఇప్పుడే పర్వీన్‌ను పెళ్లి చేసుకున్నారు' అంటూ పూజాబేడీ ట్వీట్ చేసింది. ఈ కామెంట్ ట్విట్టర్లో హల్చల్ చేసింది. దీంతో ఈ కామెంట్‌ను పూజాబేడి తొలగించారు. తన తండ్రిపై చేసిన వ్యాఖ్యను తొలగించానని, ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించాలని అన్నారు. కబీర్ బేడీ, ఆయన మొదటి భార్య, ఒడిస్సీ డాన్సర్ ప్రతిమా బేడీకు పూజాబేడీ పుట్టారు. ఆ తర్వాత ప్రతిమా బేడీతో విడిపోయిన కబీర్ మరో ఇద్దరిని సుసాన్ హంఫ్రేయ్స్, నిక్కీ బేడిని వివాహమాడారు. ఈ పెళ్లిలు కూడా పెటాకులు కావడంతో గతకొంతకాలంగా పర్వీన్‌తో ఆయన సహజీవనం చేస్తున్నారు. కబీర్ బేడీతో కూతురు పూజాబేడీకి విభేదాలు ఉన్న విషయం తాజా కామెంట్‌తో మరోసారి వెల్లడైంది.