breaking news
Parents love
-
కూతురంటే ఎంత ప్రేమో..
-
తల్లిదండ్రుల ప్రేమ
తల్లి తన పిల్లల క్షేమం కొరకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. తండ్రి తన పిల్లల చేతిలో తాను ఓట మిని పొందేంతగా పిల్లలు ఎదగాలి ‘‘పుత్రాదిచ్ఛేత్ పరా జయం’’ అని భావిస్తాడు. జన్మనిచ్చి, పెంచి, పెద్దచేసిన తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలను, కృతజ్ఞతాభావా న్ని కలిగి ఉండటం పిల్లల ప్రథమ కర్తవ్యం. తల్లిదండ్రు లు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి అవసరాలను గుర్తిం చాలి. తల్లిదండ్రుల పట్ల దయలేని పిల్లలు పుట్టనేమి వారు గిట్టనేమి అనే పద్యపాదం పిల్లలు తల్లిదండ్రుల పై చూపవలసిన శ్రద్ధను ఉపదేశిస్తున్నది. తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలని ‘‘మాతృదేవోభవ- పితృదేవోభవ’’ అను ైతె త్తరీయోపనిషత్ వాక్యాలు ఉద్బోధిస్తున్నాయి. ప్రత్యక్ష దైవాలైన తల్లి-తండ్రి-గురువులతో సమానమైన పవి త్ర వ్యక్తులను లోకంలో మరెక్కడా చూడలేము. సత్యదాన తపః కర్మలకంటే, పెద్దలను, ఋషుల ను, దేవతలను పూజించుట కంటే, యథోక్త దక్షిణల నిచ్చి చేసే యజ్ఞాలకంటే తల్లిదండ్రులకు చేసే సేవే గొప్పదని శ్రీరాముడు సీతాదేవికి చేసిన ఉపదేశం అన్ని కాలాలకు చెందిన పిల్లలందరికీ శిరోధార్యమై నట్టిది. ఒక్కొక్క ఫలితాన్ని పొందటానికి లౌకికమైన ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాని తల్లిదండ్రుల సేవ చేసిన వారికి లోకంలో పొందరా నిది ఏదీ ఉండదు. ఐహికమైన శ్రేయస్సుతో పాటు పారలౌకికమైన శ్రేయస్సును కూడా పొందవచ్చునని శ్రీరాముడు ఉపదేశించాడు. తల్లిదండ్రులకు చేయవలసిన సపర్యలను క్రమం తప్పక చేసిన వ్యాధునికి (బోయ వానికి) ధర్మశాస్త్ర సూక్ష్మములన్ని స్ఫురించేవి. అతడు ధర్మవ్యాధుడిగా ప్రసిద్ధిని పొందాడు. మాతాపితృపరా యణుడైన ధర్మవ్యాధుడు తన వద్దకు వచ్చిన ఎందరెం దరికో కర్తవ్యనిర్దేశాన్ని, ధర్మప్రబోధాలను చేశాడు. మాతాపితృ సేవాపరాయణుడైన శ్రవణ కుమారు డు తన తల్లిదండ్రులకు చూపు లేకపోయినా, వారికి ఏ లోటు రాకుండా సకల సపర్యలనందించాడు. అతడు ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే తల్లిదండ్రులను కావడిలో కూర్చుండబెట్టుకొని మోసుకొని వెళ్లేవాడు. శ్రవణ కుమారుడి సేవలు జాతిపిత మహాత్మాగాంధీని ఆక ర్షించాయి. అతడు తన తల్లిదండ్రుల సేవలో నిమ గ్నమయ్యేట్లుగా ప్రేరేపించినాయి. తల్లిదండ్రులకు చేయు ప్రదక్షిణ, పాద నమస్కా రాల వల్ల పరమ పవిత్రత, విశేష పుణ్యములు సమకూ రుతాయని, సత్ఫలితాలు కలుగుతాయని నైతిక, పౌరా ణిక ప్రమాణాలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రుల వల్ల ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న పిల్లలు ఎందరో విదేశాల లో స్థిరపడుతూ విదేశాభివృద్ధికి కారకులవుతున్నారు. అట్టి వారు మాతాపితరులకు, మాతృదేశానికి సంబం ధించిన కర్తవ్య నిర్వహణను కూడా తగిన విధంగా చేయుటకు ఉద్యుక్తులవ్వాలి. తల్లిదండ్రుల ప్రేమతో పుత్రులందరూ తరించాలి. జన్మసార్థకం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి అని ఆశిద్దాం. -సముద్రాల శఠగోపాచార్యులు -
నాన్న ప్రేమ కోసం...
టీవీక్షణం తల్లిదండ్రుల ప్రేమే పిల్లలకు బలం. అలాంటిది తన కన్నతండ్రికి తనమీద ప్రేమే లేదని తెలిస్తే ఆ కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది?! మనసు బాధతో కుమిలిపోతుంది. ఆవేదన పొంగి పొరలుతుంది. అంజలికి కూడా అలానే అవుతుంది. 21 ఏళ్ల వయసులో తన తండ్రి ఆడపిల్లను వద్దనుకున్నాడని, అందుకే అతడికి తన మీద ప్రేమ లేదన్న నిజం తెలిసి షాక్ తింటుందామె. అతడి మనసులో ఎలాగైనా చోటు సంపాదించాలని తహతహలాడుతుంది. దానికోసం తీరకుండా మిగిలిపోయిన అతడి కలను తన కలగా చేసుకుంటుంది. ఆయన అందుకోలేకపోయిన లక్ష్యాన్ని తాను అందుకోవాలి, ఆయన సాధించలేకపోయిన విజయాన్ని తాను సాధించి చూపించాలని నిర్ణయించుకుంటుంది. ఏమిటా లక్ష్యం? దాన్ని ఆమె సాధిస్తుందా, తండ్రి ప్రేమను పొందుతుందా అన్నది తెలుసుకోవాలంటే... ‘స్టార్ ప్లస్’లో ప్రసారమయ్యే ‘ఎవరెస్ట్’ సీరియల్ చూడాలి. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అశుతోష్ గోవారికర్ తను రాసిన కథతో నిర్మిస్తోన్న ఈ సీరియల్, ఆదిలోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. హీరోయిన్ తండ్రికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్న వైవిధ్యభరితమైన లక్ష్యాన్ని పెట్టడం, అది తీరకపోవడంతో కూతురు ఎవరెస్ట్ ఎక్కి, తండ్రి కలను నెరవేర్చాలని తపించడం అన్న పాయింట్‌తో కథని అల్లడంలోనే అశుతోష్ సగం విజయాన్ని సాధించేశారు. దానికితోడు అంజలి పాత్రకు షమతా ఆచన్ చక్కగా సరిపోయింది. ఆమె అందం, ఆకర్షణ, నటన కచ్చితంగా సీరియల్‌కి ప్లస్ పాయింట్సే. ఇక తొలిసారిగా రెహమాన్ సంగీతం అందించిన సీరియల్ ఇదే కావడం... ఇంకో పెద్ద ప్లస్. ఇన్ని ప్లస్సులు కలిసినప్పుడు ఆ సీరియల్ సక్సెస్‌ను ఎవరు మాత్రం ఆపగలరు!