breaking news
Panchakarla Ramesh
-
Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు
-
'అయ్యన్నపాత్రుడితో మనస్పర్దలు నిజమే'
విశాఖపట్టణం: టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడితో మనస్పర్దలు ఉన్న మాట నిజమేనని తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ఎన్ని సమస్యలున్నా చంద్రబాబుతోనే ఉంటానని ఆయన చెప్పారు. సహచర ఎమ్మెల్యేలతో తన నివాసంలో గంటా శ్రీనివాసరావు ఈరోజు సమావేశమయ్యారు. చంద్రబాబు సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు తనపై వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన మనస్తాపం చెందినట్టు తెలిసింది. టీడీపీ చేరిన గంటా సహా నలుగురు ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, చింతలపూడి వెంకట్రామయ్యలపై అయన్నపాత్రుడు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘ఇవాళ టీడీపీలోకి కొందరు వచ్చారు. వాళ్లు ఎంతకాలం ఉంటారో పోతారో తెలియదు. మనం మాత్రం పార్టీలోనే కొనసాగుదాం’’ అంటూ ఎద్దేవా చేశారు. కొత్తగా వచ్చిన నేతలు ఇకనైనా పార్టీలో బుద్ధిగా పనిచేస్తే పార్టీకి మంచిదంటూ విరుచుకుపడ్డారు.


