breaking news
pallavas
-
పలమనేరు అసలు పేరు తెలుసా..?
సాక్షి, చిత్తూరు: ఈతరం పిల్లలకు ఉంటున్న ఊరు పేరెందుకొచ్చిందో తెలియని వారు చాలామంది ఉన్నారు. కనీసం ఊరి పేరు ఎందుకొచ్చిందో గూగూల్ తల్లిని అడిగినా పెద్దక్లారిటీ ఉండదు. అందుకే పలమనేరుకు ఆపేరెలా వచ్చిందో తెలిపే ప్రయత్నం చేద్దాం. పూర్వం పలమనేరు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించే వారు. పట్టణానికి పడమటి వైపు ఓ చెరువును తవ్వించి దానికి పల్లవన్ ఏరి అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. పల్లవన్ ఏరి అంటే చెరువు వద్ద ఉన్న గ్రామమని అర్ధం. ఈ పల్లవనేరే కాలక్రమేణ పల్నేరు ఆపై పలమనేరుగా రూపాంతరం చెందింది. పలమనేరు పట్టణ వ్యూ ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2244 అడుగుల ఎత్తున ఉండడంతో ఇక్కడ వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఈ పట్టణాన్ని పేదవాని ఊటిగా పిలుస్తారు. పలమనేరు పట్టణం మూడు రాష్ట్రాల కూడలిగా ఉండడంతో ఇక్కడ తెలుగు,తమిళం, కన్నడ భాషలను మాట్లాడుతారు. ఇప్పటికీ ఈ మూడు సాంప్రదాయలు, సంస్కృతులు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి గుడియాత్తం, క్రిష్ణగిరి, మదనపల్లె, కుప్పం, బెంగుళూరులకు రోడ్డు మార్గాలున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణానికి పులకించిన అప్పటి యూరోపియన్, బ్రిటిష్ అధికారులు దీన్ని వారి వేసవి విడిదిగా ఉపయోగించారు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు దానికి సంబంధించిన విడిది గృహము ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. (ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం). వీటితో పాటు పీర్ల రహదారి, సర్కెట్ హౌస్, వైట్ సైడ్ అతిథి గృహాల పేర్లు ఉన్నాయి. దీంతో పాటు అమెరికన్ ఆర్కాడ్ మిషన్‌చే ఓ అతిథి గృహం 1932లోనే నిర్మితమైంది. అప్పట్లోనే నెలకు దీని అద్దె రూ.40గా వసూలు చేసేవారట. ఇక ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌తో పాటు క్రిస్టియన్లకు సంబంధించిన పలు సుందరమైన పురాతన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు ఇక్కడి సీఎస్ఐ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడు సేద తీరిన మర్రి చెట్టు ఉంది. ప్రతి శుక్రవారం పట్టణంలో జరిగే వారపు సంత, పశువుల సంత అనాదిగా జరుగుతోంది. పలమనేరు టమోటా, పట్టు, చింతపండు, పాలుకు ప్రసిద్ది చెందింది. జిల్లాలోనే టమోట, పట్టు సాగులో పలమనేరు ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువ. దీన్ని మిల్క్ సిటీగా కూడా పిలుస్తారు. చదవండి: అంతరిస్తున్న ఆదిమానవుడు -
వెలుగు చూసిన పురాతన ఆలయం
బి.కొత్తకోట మండలం ఒకప్పుడు వైడుంబ సామంత రాజ్యంలో ఉండేదా..? తర్వాత పల్లవులు, విజయనగర రాజుల పాలనలో సాగిందా..? శీలంవారిపల్లె సమీపంలోని కోనాపురం ప్రాంతంలో సోమవారం వెలుగులోకి వచ్చిన ఆలయ శిథిలాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలో చారిత్రక కట్టడాలకు కొదువలేదు. అందులో శిథిలమైన ఈ ఆలయం తాజాగా వెలుగుచూసింది. పొలం పనులు చేస్తుండగా బయటపడిన ఆలయ శిథిలాలు, అక్కడ కనిపించే శిలలు, స్తంభాలు, శిలాశాసనం, శిల్పకళ, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో మూడు రాజ్యాల పాలన సాగిందని కన్పిస్తోంది. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మరిన్ని విగ్రహాలు, ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉందని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : మండలంలోని శీలంవారిపల్లె సమీపంలోని పొలంలో ఆలయ శిథిలాలు లభ్యమైన ప్రాంతం ఒకప్పుడు కోనాపురం గ్రామంగా విరాజిల్లింది. ఇప్పటికీ ఇక్కడి వారు ఈ ప్రాంతంగా కోనాపురంగానే పిలుచుకుంటున్నారు. ఆలయం, దాని పరిసరాల్లో నివాసాలతో నిండి ఉండేదని తెలుస్తోంది. దీనికి దగ్గర్లోని చిటికివారిపల్లె ఆలయం శిథిలం తర్వాత ఏర్పడినట్టుగా చెబుతున్నారు. నివాసాలకు సంబం ధించిన ఆధారాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది నుంచి 13వ శతాబ్దం వరకు చిత్తూరు జిల్లా వైడుంబి సామంతరాజుల పాలనలో ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు పశ్చిమ చాణుక్యులకు సామంతులుగా కూడా పనిచేశారు. వీరికి రాష్ట్ర కూటులు, బాణులు, నలంబ పల్లవులు సమకాలికులు. వీరు పీలేరు నియోజకవర్గంలోని కలకడ, కర్ణా్ణటకలోని కోలా రును రాజధానులుగా చేసుకుని పాలన సాగించారు. వీరి కాలంలో వేసిన శిలా శాసనం ఒకటి ఆల య శిథిలాలకు సమీపంలోని పొలంలో ఉం డడం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒక వీరుడు స్వర్గస్తుడై స్వర్గానికి చేరినట్టుగా చెక్కారు. అతనే కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో విల్లు కలిగి ఉన్నాడు. ఇతను సాహసవంతుడు అని తెలిపేలా కింద గుర్రం, దానిపైన రెండు నాగుపాము పడగలు ఉన్నాయి. అతని విల్లుకు ఎదురుగా ముగ్గరు ఉన్నట్టు శిల్పం చెక్కారు. వీటిపైన తెలుగు–కన్నడ భాషలా కనిపించే అక్షరాలు లిఖించి ఉన్నాయి. ఈ శాసనాన్ని వీరగల్ శాసనంగా పేర్కొంటున్నారు. ఇతను శత్రువులను తదముట్టించి వారి చేతిలో చనిపోగా, అతన్ని వీరుడిగా చిత్రీకరిస్తూ వేసిన శిలాశాసనాన్ని బట్టి అది వైడుంబ రాజులు వేయించినట్టుగా నిర్ధారణ అవుతోంది. వైడుంబి పాలనలోనే వీరులు ఎక్కువగా ఉండేవారు కావడంతో వీరి శిలాశాసనం ద్వారా నిర్ధారణ అయ్యింది. వీరి సామంత పాలనకు సాక్ష్యంగా పురాతన సున్నం తో తయారైన శిలకు చెందిన శిరస్సు లభ్యమైం ది. సున్నంతో శిలల తయారీ వీరి కాలం నాటిదే అని పురావస్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పల్లవ, విజయనగర రాజ్యాల్లో.. ఈ ప్రాంతాన్ని క్రీ.శ 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు పల్లవులు, క్రీ.శ 1336 నుం చి 1646 వరకు విజయనగర రాజులు పాలిం చారని తెలుస్తోంది. ఆలయ శిథిలాల్లోని శిల్పాలు, వాటిపై చెక్కిన శిల్పకళ, వన్యప్రాణులు, దేవతా విగ్రహాలు, నామాలు పరిశీలిస్తే పల్లవులు, విజయనగర రాజుల పాలనలో ఈ ఆల యం విరాజల్లినట్టుగా కనిపిస్తుంది. స్తంభాలపై సింహాల చిత్రాల శైలి పల్లవుల కాలం నుంచి ఉంది. కానీ విజయనగర పాలనలోనూ ఇలాగే కనిపిస్తాయి. స్తంభాలను మోస్తున్న భారవాహకుడు, యక్షుడు ఈ రాతి స్తంభాలకు పునాదులు గా కనిపిస్తారు. మకరం (మొసలి), సింహాల గుర్తులు పల్లవుల రాజ్య శైలి అయినప్పటికీ విజయనగర పాలనలో మకరం గుర్తులు కనిపిస్తాయి. ఇలాంటి గుర్తులే ములకలచెరువు మం డలంలోని సొంపాళ్యంలోని చెన్నకేశవాలయంలో కనిపిస్తాయి. వాటి పోలికలు శిథిలాల్లోని శిల్ప కళలో కనిపిస్తుండగా, ఆలయం విజయనగర పాలనకు ముందే నిర్మాణమైనట్టుగా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఆధారాలను బట్టి విష్ణు ఆలయమే శీలంవారిపల్లె సమీప పొలాల్లో లభ్యమైన శిథిలాలు, మహలక్ష్మి విగ్రహాన్ని పరిశీలిస్తే ఇది కచ్చితంగా విష్ణు ఆలయమే అన్న అభిప్రాయం ఉంది. పురావస్తుశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. లభించిన పానవట్టం, శిథిలాల్లో కనిపిస్తున్న నిర్మాణ ఆకా రాలు, స్తంభాల ఆధారం, వాటిపై చెక్కిన శం ఖు, చక్రాలతో విష్ణు ఆలయంగా నిర్ధారణ అవుతోంది. పేరు ఏదైనా వైష్ణవ ఆలయం కచ్చితమని స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిథిలాల్లో విష్ణువు, గరుడుడు తదితర విగ్రహాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా ఆలయాన్ని మూడెంచెల పద్ధతిలో నిర్మించినట్టు కనిపిస్తుంది. ఆలయం చుట్టూ కోటలాంటి కట్టడం కనిపిస్తుంది. తర్వాత రెండో అంచెలో మైదానం, మూడో అంచెలో గర్భగుడి నిర్మాణం జరిగినట్టుంది. ఇప్పడు కనిపిస్తున్న శిథిలాలే గర్భగుడిగా నిర్ధారణ అయ్యింది. మహాలక్ష్మి విగ్రహానికి విశిష్ట ప్రత్యేకలు లభ్యమైన మహాలక్ష్మి విగ్రహానికి ఎన్నో విశిష్ట ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం అరుదైనదిని భావిస్తున్నారు. విగ్రహానికి నాలుగు చేతులున్నాయి. పైనున్న రెండు చేతుల్లో తామర పూలు ఉండగా, ఎడమ చేయి వరద హస్తం, కుడిచేయి అభయహస్తం కలిగి ఉన్నా యి. నుదుట మూడు నామాలు, శరీరంపై జం ద్యం ఉన్నాయి. అరచేతులు, కాళ్లకు రేఖలు కనిపిస్తున్నాయి. సుఖ ఆసనంలో ఉన్నట్టు కనిపిస్తున్న విగ్రహం మెడలో గొలుసు, ఇరువైపులా చెవులకు చక్రాలు, తలపై విష్ణువు ధరించే కిరీ టం కనిపిస్తాయి. అన్నింటికంటే ప్రధానంగా శిల్పం చెక్కిన తీరు అద్భుతం. సాధారణంగా శిల్పం ముందుభాగంలోనే విగ్రహం తయారవుతుంది. ఈ విగ్రహానికి ముందు, వెనుక రెండు వైపులా శిల్పాన్ని తయారు చేశారు. ఒకవైపే కాకుండా ముందు, వెనుక వైపు శరీర ఆకృతి ఉండడం విశేషం. పోలీస్‌స్టేషన్‌లో శ్రీమహాలక్ష్మి పాపం దేవుళ్లకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లక తప్పలేదు. శీలంవారిపల్లె సమీపంలోని కోనాపు రం పొలంలో సోమవారం శ్రీమహాలక్ష్మి విగ్రహం బయల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ సుబ్బన్న, ఎస్ఐ సుమన్ పరిశీలిం చి వివరాలు నమోదు చేశారు. శ్రీమహాలక్ష్మి విగ్రహాన్ని ఎస్ఐకి తహసీల్దార్ అప్పగించారు. ఎస్ఐ సోమవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గదిలో నేలపై వస్త్రాన్ని పరచి విగ్రహాన్ని పడుకోబెట్టారు. ఆలయంలో ఉండాల్సిన శ్రీమహాలక్ష్మి ఇలా పోలీస్‌స్టేషన్ చేరుకుంది. విగ్రహాన్ని తమకు అప్పగించాలని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం ఇవ్వడానికి కుదరదని స్పష్టంచేసి తీసుకొచ్చారు. మంగళవారం మళ్లీ అధికారుల వద్దకు వెళ్లిన గ్రామస్తులు రాతి విగ్రహం ఇస్తే పూజలు చేసుకుంటామని, తమ సంరక్షణలో ఆలయంలో ఉంచుతామని పట్టుబట్టారు. దీనిపై విగ్రహం అప్పగించేందుకు తహసీల్దార్ సుబ్బన్న అంగీకరించారు. విగ్రహాన్ని అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. లిపిని శోధించాలి వీరగల్ శిలాశాసనంలోని లిపిని శోధిస్తే ఆలయ చారి త్రక ఆధారాలు లభ్యమవుతాయి. ఈ లిపి తెలుగు–కన్నడ భాష కనిపిస్తోంది. ఆలయ ప్రాం గణం, లభించిన మహాలక్ష్మి విగ్రహాన్ని పరి శీలిస్తే అది కచ్చితంగా విష్టు ఆలయమే. అయితే చెన్నకేశవ, నరసింహ, వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఒకటి కావొచ్చు. ఇది శిలలు, వాటిపై చెక్కిన బొమ్మలను పరి శీలిస్తే పల్లవరాజుల శైలి, విజయనగర రాజు ల చిహ్నలు ఉన్నాయి. దీన్నిబట్టి శిథిలాల్లో ఇంకా శాసనాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. విగ్రహాలు కూడా లభించవచ్చు. ఆలయ చరిత్ర వెలుగులోకి తీసుకురావడానికి కృషిజరగాలి. – విజయకుమార్, రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్, పురావస్తుశాఖ ఆలయ విగ్రహాల తరలింపు శిథిలాలున్న ప్రాంతంలో కోనాపురం గ్రామంగా ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారు. ఆలయానికి చెందిన ధ్వజస్తంభం, బలిపీఠాన్ని బి.కొత్తకోట మండలంలోని కాండ్లమడుగు అమరనారాయణపురం ఆలయంలో ప్రతి ష్ఠించారు. కొన్నింటిని తిరుమల, తెట్టు వేణుగోపాలస్వామి, గట్టులోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయాలకు తరలించినట్టు చెప్పేవారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన కొన్నిపేర్లు వాడుకలో ఉన్నాయి. వాయిద్యాకారులకు ఇచ్చిన భూమి ప్రాం తాన్ని మేళ్లచెరువుగా, పూలను తెచ్చేవారి కోసం నిర్మించిన ప్రాంతాన్ని పూలచెట్ల బావిగా, ఉత్సవాల కోసం పేరుమాళ్లబండ పేర్లతో పిలుచుకునే ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. – శీలం వేణుగోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్, శీలంవారిపల్లె -
మహాబలిపురానికి మహర్దశ
చెన్నై: తమిళనాడులోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక నేపధ్యం కలిగిన మహాబలిపురానికి మహర్దశ పట్టనుంది. సముద్రతీరంలో వెలిసిన మహాబలిపురంలోని ప్రకృతి రమణీయ దృశ్యాలకు ప్రపంచస్థాయి గుర్తింపురానుంది. బండరాళ్లపై చెక్కిన అద్భుత శిల్ప సౌందర్యానికి అందలమంతటి గౌరవం దక్కనుంది. చెన్నైకి దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం కాంచీపురం జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు మామల్లపురంగా ఉండి క్రమేణా మహాబలిపురంగా మారింది. భారతీయులు తమ వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు ఇక్కడి సముద్రమార్గం గుండా వెళ్లేవారు. 7వ దశాబ్దంలో దక్షిణభారతదేశాన్ని ఏలిన ప్రముఖ మహారాజులైన పల్లవులు మహాబలిపురాన్ని నిర్మించనట్లు చరిత్ర చెబుతోంది. ఎంతో కళాత్మక దృష్టి కలిగిన పల్లవరాజులు ఎందుకూ పనికిరాని బండరాళ్ల నుండి అధ్బుత శిల్ప సౌందర్యాన్ని వెలికితీసారు. నృత్యభంగిమలు, ఏనుగులు, గుహలు, ఆలయ గోపురాలు ఇలా వేలాదిగా శిల్ప సౌందర్యం పల్లవరాజుల కళాతృష్టకు అద్దం పడుతుంది. ఒక బ్రిటీష్ రాజు ఇక్కడి ప్రాచీన శిల్పసౌందర్యాలకు 1827లో మరింతగా మెరుగులు దిద్దారని తెలుస్తోంది. ప్రస్తుత 21 వ శతాబ్దంలోనూ ఇక్కడికి చేరుకునే సందర్శకులను అబ్బురపరుస్తోంది. సముద్ర తీరంలో ఉండటం వల్ల అక్కడి అలల ఘోష శ్రావ్యమైన సంగీతంగా మారిపోతుంది. విదేశాల నుండి వచ్చే పర్యాటకుల్లో అధికశాతం మహాబలిపురాన్ని సందర్శించకుండా వెళ్లరు. విదేశీయులు ఇక్కడి హోటళ్ల రోజుల కొద్దీ బసచేసి మహాబలిపురం ఆందాలను తమ కెమారాల్లో బంధిస్తుంటారు. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులతో మహాబలిపురం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది.ప్రపంచంలోని అతిముఖ్యమైన హెరిటేజ్ ప్రాంతంగా మహాబలిపురాన్ని యునెస్కో చేర్చింది. ప్రపంచ ప్రజలను ఆకర్షించేస్థాయిలో మెచ్చదగిన పర్యాటక ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. అంతేగాక దీనికి మరింత మెరుగులు దిద్ది అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించేందుకు సిద్దం అయింది. శిల్పకళా సౌందర్యం వెల్లివిరిసే ప్రాంతాలను గుర్తించేందుకు చైనా, బంగ్లాదేశ్, కువైట్ దేశాలను పర్యటించిన యునెస్కో లోని 8 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఇటీవల భారత్‌కు వచ్చిన సమయంలో మహాబలిపురాన్ని సంద ర్శించింది. ఒక ప్రయివేటు సంస్థకు చెందిన థియేటర్లో మహాబలిపురంపై చిత్రీకరించిన త్రీడీ యానిమేషన్ చిత్రాన్ని తిలకించింది.