breaking news
p narayana and mayor abdul aziz
-
'వారికి ప్రజా సంక్షేమం గురించి తెలియదు'
-
'వారికి ప్రజా సంక్షేమం గురించి తెలియదు'
నెల్లూరు: మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌లకు వ్యాపారాలు తప్ప ప్రజా సంక్షేమం గురించి తెలియదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎన్ ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందర్ని కలుపుకొని పోకుండా అభివృద్ధిలో వివక్ష చూపడం తగదని వారిద్దరు ప్రసన్నకుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నెల్లూరులో నిరాహార దీక్ష చేస్తున్న నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయన దీక్షకు ప్రసన్నకుమార్ సంఘీభావం ప్రకటించారు. నెల్లూరు నగర అభివృద్ధిపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తు.. అనిల్ కుమార్ రెడ్డి బుధవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.