మల్లన్నసాగర్‌పై విపక్షాలది రాద్ధాంతం
సాగునీరు అందితే పుట్టగుతులు ఉండవనే జిమ్మిక్కులు
పోలవరం, అమరావతి విషయంలో రైతులు గుర్తు రాలేదా?
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు
హన్మకొండ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై విపక్షాలు లేనిపోని రాద్ధాం తం చేస్తున్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు ధ్వజమెత్తారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష సాధ న దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. విపక్షాలు అడుగడుగునా తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు.
రైతాంగానికి సాగునీరందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటే అడ్డు పడుతున్న విపక్షాల తీరును ప్రజ లు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయి రైతులకుసాగునీరందితే తమ కు పుట్టగతులు ఉండవనే భయం విపక్షాల్లో నెలకొం దని ఎద్దేవాచేశారు. 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎనిమిది గ్రామాలు ముంపునకు గురికానుండగా.. రెండు గ్రామాల ప్రజలను కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నేతలు తప్పదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 200 గ్రామాలు, 574 కుటుం బాలు, 1.70 లక్షల మందిని నిర్వాసితులను చేయగా అప్పుడు రైతులు గుర్తుకు రాలేదా అని రవీందర్రావు ప్రశ్నించారు. ఏపీలో అమరావతి నిర్మాణానికి మూడు పంటలు పండే భూములను లాక్కున్న టీడీపీకి రైతుల శ్రేయస్సు ఎందుకు పట్టలేదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రైతులకు నష్టం జరుగొద్దని, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు 123 జీఓను తీసుకొస్తే విమర్శలు చేయడం సరికాదన్నారు. సామరస్యంగా భూసేకరణ జరుగుతుండగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో ఎందుకు లాఠీ చార్జీ జరిగిందో... కారకులెవరో ప్రజలు ఆలోచించాలని రవీందర్రావు కోరారు. తెలంగాణలో ఒక్క పంట కూడా పండని పరిస్థితులున్నాయని, ఈక్రమంలో రెం డు పంటలు పండేలా సాగునీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను సత్వ రం పూర్తి చేసేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్యా, ఇండ్ల నాగేశ్వర్రావు, కమరున్నీసాబేగం, నయీముద్దీన్, గైనేని రాజన్, జోరిక రమేష్, కోల జనార్థన్, వీ.ఎస్. యాకూబ్‌రెడ్డి, చింతం సదానందం, నాగపురి రాజేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.