breaking news
open boxing tournment
-
బాక్సింగ్ టోర్నీలో సంతోష్‌కు స్వర్ణం
ఎల్బీ స్టేడియం: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలిండియా పురుషుల ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్లు సత్తా చాట్టారు. విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ బాక్సర్ సంతోష్ పసిడి పతకం గెలిచాడు. పి.మనోజ్‌రెడ్డి, ఎం.డి.ఇమ్రాన్, అనురాగ్ కాంస్య పతకాలను గెలుపొందారు. ఎండి. జాహెద్ బెస్ట్ లూజర్ అవార్డును అందుకున్నాడు. నేడు బాక్సింగ్ సెలక్షన్ కమ్ టోర్నీ రాష్ట్ర సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ (టీబీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే ఆసక్తి గల బాక్సర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ప్రతాప్‌రెడ్డి (94401-63038)ని సంప్రదించ వచ్చు. -
సాత్విక రెడ్డి కి స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: డెన్నిస్ స్వామి ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ సబ్ జూనియర్ బాలికల 30-32 కేజీల వెయిట్లో సాత్విక రెడ్డి స్వర్ణం గెల్చుకుంది. సుమన రజతం సాధించింది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని ఎస్సీఎఫ్లో ఈ పోటీలు జరిగాయి. ముగింపు కార్యక్రమానికి డెన్నిస్ స్వామి ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాక్సింగ్ కోచ్ స్టీవెన్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: 38-40 కేజీల వెయిట్: 1. నగ్మా, 2. హర్షిత. 48-50 కేజీల వెయిట్: 1. శ్వేత, 2. లాస్య. 56-58 కేజీల వెయిట్: 1. లోహిత, 2. శ్వేత. సబ్ జూనియర్ బాలుర విభాగం: 26-28 కేజీలు: 1. రయీస్, 2. జి.వీరేందర్. 28-30 కేజీలు: 1. అబ్దుల్ రెహమాన్ రియాజ్, 2. ఎం.డి.రయీస్. 30-32 కేజీలు: 1. తవజ్యోత్ సింగ్, 2. మీర్జా ముస్తాఫ్. 32-34 కేజీలు: 1. తహబీర్ హైదర్, 2. తవజ్యోత్ 36-38 కేజీలు: 1. త్రిజోత్ సింగ్, 2. ఎం.డి.సలీముద్దీన్. 38-40 కేజీలు: 1. క్లింటన్ డేవిడ్, 2. రోహిత్, 42-44 కేజీలు: 1. జె.యోగేష్, 2. ఎం.చైతన్య. 44-46 కేజీలు: 1. కె.రవికాంత్, ఎం.డి.సాజిద్ హుస్సేన్, 46-48 కేజీలు: 1. ఎస్.సతీష్, 2. ఎం.డి.పర్వేజ్. 48-50 కేజీలు: 1. ఎన్.రాజ్, 2. టి.అజయ్ సింగ్. 50-52 కేజీలు: 1. పి.పవన్ కుమార్, 2. టి.విజయ్ సింగ్.