breaking news
Nithaya menon
-
తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు
చాలా రోజులుగా తెలుగు మార్కెట్ మీద పట్టు కోసం కష్టపడుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన కొత్త సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 24 సినిమాలో నటిస్తున్న సూర్య, ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్ట్రయిట్ తెలుగు సినిమాకు ప్రమోషన్, రిలీజ్‌లను ఎలా ప్లాన్ చేస్తారో, అదే స్ధాయిలో కష్టపడుతున్నాడు. అఫీషియల్ టీజర్ రిలీజ్ విషయంలోనూ అలాగే వ్యవహరించాడు. తమిళ, తెలుగు ట్రైలర్లను ఒకేసారి రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఆడియో రిలీజ్ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని భావిస్తున్నాడు. ఈ నెల 11న 24 ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఆ రోజు ఉదయం చెన్నైలో తమిళ వర్షన్ ఆడియోను రిలీజ్ చేసిన, వెంటనే సాయంత్రం హైదరబాద్‌లో తెలుగు భాషలో ఆడియోను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు, కాలంలో ప్రయణించటం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రూటు మార్చిన యంగ్ హీరో
రన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తిరిగి షూటింగ్‌లతో బిజీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో, ఇక పై ప్రయోగాత్మక చిత్రాలకు సై అంటున్నాడు. ప్రస్తుతం రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న 'ఒక్క అమ్మాయి తప్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు. నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న, ఈ సినిమా అంతా ఓ ఫ్లై ఓవర్ మీద ఒక్క రాత్రిలో జరిగే ప్రేమకథ. ఈ సినిమాతో పాటు మరో కొత్త దర్శకుడితో 'మా నగరం' అనే సినిమాలో నటిస్తున్నాడు. రెజీనా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మూడు నాలుగు విభిన్న కథలను ఒకేసారి తెరమీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పిజ్జా నిర్మాత సివి కుమార్ డైరెక్షన్లో మాయావన్ అనే సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌లో నటించడానికి అంగీకరించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కూడ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు సందీప్.