దేశం ఒక్కటే.. కరెన్సీలు తొమ్మిది
డబ్బును ఒక కరెన్సీలో వాడటం ఎంతో సులభం. ప్రపంచంలో చాలా మంది ఈ పద్ధతినే ఇష్టపడతారు. అదే డబ్బును తొమ్మిది కరెన్సీల్లో వాడాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా, గజిబిజిగా ఉంటుంది కదూ..! జింబాబ్వేలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. జింబాబ్వే డాలర్ పతనం కావడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఇందుకు కారణాలు.
ప్రస్తుతం జింబాబ్వేలో వ్యాపారాలను తొమ్మిది కరెన్సీల్లో నిర్వహిస్తున్నారు. వ్యాపారులు విదేశీ మారకద్రవ్య డీలర్ల పాత్రను పోషించాల్సివస్తోంది. ఆ దేశంలో యూఎస్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్, దక్షిణాప్రికా ర్యాండ్, బోట్స్వానా పులా, యూరో, బ్రిటీష్ పౌండ్, జపనీస్ యెన్, చైనా యువాన్, భారత్ రుపాయి కరెన్సీలను వాడుతున్నారు. జింబాబ్వే రిజర్వు బాంక్ గవర్నర్ జాన్ మాన్గుడే మాట్లాడుతూ.. చైనా, దక్షిణాఫ్రికా కరెన్నీలలోనే 50 శాతం వరకు వ్యాపారం జరుగుతోందని తెలిపారు. దీంతో ఎక్కువ కరెన్నీలను వాడాల్సన అవసరం ఏర్పడిందని చెప్పారు. యూఎస్ డాలర్ జింబాబ్వే అధికారిక కరెన్సీగా చెలామణి అవుతోంది.
జింబాబ్వే రాజధాని హరారేలో యూఎస్ డాలర్ ఎక్కువగా వాడకంలో ఉన్నా, వర్తకులు ఇతర కరెన్సీలను కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. దక్షిణాఫ్రికా, బొత్స్వానా సరిహద్దుల్లో ర్యాండ్, పులా, యూరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం 2000 సంవత్సరంలో భూసంస్కరణల వేగవంతంగా అమలు చేయడంతో జింబాబ్వే కరెన్సీ పతనమైంది. అనుమతులు మంజూరు చేయడం, ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడంతో జింబాబ్వే డాలర్ పతనం చవిచూడాల్సి వచ్చిందని మాన్గుడే గుర్తుచేశారు.
ఇక జింబాబ్వేలో వస్తువుల ధరలు ఓ నిమిషంలోనే మారిపోతుంటాయి. ధరల పరిస్థితి ఎలా ఉంటుందంటే కాఫీ తాగాలంటే తయారికీ ముందే డబ్బులు చేల్లించాలి. లేకపోతే తాగిన తర్వాత కాఫీ ధర పెరిగే అవకాశం ఉంటుంది.