breaking news
Neurologists
-
స్టార్టింగ్ ప్రాబ్లమా?
స్టార్టింగ్ ప్రాబ్లం.. మనం తరచూ వినే డైలాగ్. తలపెట్టిన పనులను తరచూ వాయిదా వేస్తుంటారు కొందరు. వారిని ఆట పట్టించడానికి ‘స్టార్టింగ్ ప్రాబ్లమా’ అని అంటుంటాం. వ్యాయామం, ఇంటి పనుల వంటివి ప్రారంభించడం కష్టంగా అనిపిస్తుందా? యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్‌లో న్యూరాలజీ వైద్యులు, న్యూరో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫేయ్ బెగేటి ఓ చక్కటి, సులభ పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నారు. మెదడు శక్తిని పెంచడానికి, మానసిక అడ్డంకులను తొలగించడానికి నిబద్ధతతో కూడిన ఓ ‘5 నిమిషాలు’ చాలు అంటున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్రేపట్నుంచి వాకింగ్‌కు వెళ్తా.. డిసెంబర్ 31 నాడు.. ‘జనవరి 1 నుంచి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తా’రేపట్నుంచి ఉదయం ఆరింటికే నిద్ర లేస్తా..పోటీ పరీక్షలకు రేపట్నుంచి ప్రిపరేషన్ మొదలుపెడతా.... ఇలాంటి నిర్ణయాలు చాలామంది తీసుకుంటారు. కానీ, బద్ధకం వాటిని అమలు చేయనివ్వదు. అలాంటి కష్టమైన పనులను చేయడంలో మనసు, మెదడు.. రెండూ మొండికేస్తుంటాయి. మరి, దీన్ని అధిగమించడం ఎలా?5 నిమిషాల నియమం.. మనసును సిద్ధం చేసే ఓ చిట్కా. ఇది వాయిదా వేసే మనస్తత్వాన్ని మారుస్తుంది. తద్వారా మానసిక అలసట తగ్గుతుందని బెగేటి అంటున్నారు. ఒక పనిని ప్రారంభించడానికి మనసు సన్నద్ధంగా లేనప్పుడు.. ఆ పనిని కేవలం 5 నిమిషాల సేపు చేసి చూడాలి. సాధారణంగా మన మెదడు పని కష్టాన్ని ఎక్కువగా అంచనా వేస్తుంది. అందువల్ల ఎక్కువ సేపు చేస్తే అలసిపోతానని ముందే ఊహించుకుంటుంది. కాబట్టి 5 నిమిషాల పాటు నిబద్ధతతో పనిచేస్తే మెదడు అలవాటు పడి, తరవాత ఆ పని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది. మానసిక అలసటే పెద్ద సమస్యశారీరక అలసట ఉన్నా ఫర్వాలేదుగానీ.. మానసిక అలసట ఉంటే మాత్రం మెదడు పనిచేయనివ్వదు. మెదడు అలసటను.. స్మార్ట్‌ఫోన్ ‘లో బ్యాటరీ’ మోడ్‌తో పోల్చారు బెగేటి. లో బ్యాటరీ ఉన్నా మనం పనిచేస్తుంటే.. ‘బ్యాటరీ లో’ అని ప్రతిసారీ అరుస్తున్నట్టే.. ‘నేను చేయను/చేయడానికి సిద్ధంగా లేను’ అని మెదడు కూడా మొరాయిస్తుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ వంటి తక్షణ వినోదాన్ని అందించే సాధారణ కార్యకలాపాలను ఎంచుకోవడం ద్వారా.. మెదడు తక్కువ కష్టమైన పనులవైపు మొగ్గు చూపుతుంది. ‘5 నిమిషాల’ నియమం.. మెదడుకున్న ఈ బద్ధకానికి చక్కటి చిట్కాలా పనిచేస్తుంది. ‘5 నిమిషాలే కదా చేసేద్దాం’ అని చేసేస్తుంది.దినచర్యగా మారుతుందఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మెదడు డోపమైన్ ను విడుదల చేస్తుంది. ఇది ప్రేరణతోపాటు ఆనందం ఇచ్చే రసాయనం. ఈ 5 నిమిషాల ప్రక్రియ.. మనలో జోష్ నింపి ఆ సమయం తరవాత కూడా పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక దినచర్యగా అలవాటైతే.. దీర్ఘకాలంలో మెదడు చురుగ్గా, మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు దారితీస్తుందని బెగేటి పేర్కొన్నారు. వ్యాయామం, ఇంటి బాధ్యతలతో సహా ఏదైనా సవాలుతో కూడిన, శక్తిని వినియోగించే పనికి ఈ నియమం రోజువారీ సాధనంగా పనిచేస్తుంది. 5 నిమిషాల నియమం.. వాయిదా వేసే విధానానికి చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. అదే సమయంలో నిర్ణయం తీసుకోవడంలోనూ , దృష్టి కేంద్రీకరించిన పని వల్ల వచ్చే అలసటను తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది.చిన్న చిన్న ప్రయత్నాలు» చిన్న చిన్న ప్రయత్నాలతో మెదడును సిద్ధం చేయండి. » అవి నిరంతరం పనిని కొనసాగించేలా ప్రేరేపిస్తాయి.» రోజూ కేటాయించే ఆ 5 నిమిషాలు.. అంటే సంవత్సరానికి సుమారు 30 గంటల అభ్యాసంతో స్థిరంగా చేసే చిన్న పనులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. » పనులను మరింత సులువుగా మొదలుపెట్టేందుకు ఈ చిట్కా తోడ్పడుతుంది.» మెదడు.. చేయనని మొండికేసే స్థితి నుంచి నేను చేయగలననే చురుకైన స్థితికి మారడానికి ఈ నియమం దోహద పడుతుంది.ఇలా విజయవంతం చేయండి» చేయాల్సిన పూర్తి పని నుంచి ఒక నిర్దిష్ట చిన్న విభాగాన్ని మీ ప్రారంభ సాధనంగా ఎంచుకోండి» ఇందుకోసం టైమర్‌లో అయిదు నిమిషాల సమయాన్ని సెట్ చేయండి» మీ దృష్టిని మరల్చే వాటిని గుర్తించి తొలగించండి.» 5 నిమిషాల తర్వాత పురోగతిని చెక్ చేయండి. దీనిని బట్టి ఆ పనిని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోండి. -
పాతికేళ్లకే బ్రెయిన్ స్ట్రోక్
సాక్షి, హైదరాబాద్: మనిషి మొదడు మొద్దుబారుతోంది. ఓపక్క పని ఒత్తడి.. మరోపక్క నిద్రలేమి వెరసి దాని పనితనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న వయసులోనే ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయస్కుల్లో వెలుగు చూస్తున్న 20 శాతం మరణాలకు ఇదే కారణంమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెచ్‌సీసీ వేదికగా ఇటీవల నిర్వహించిన ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ’ వార్షిక సదస్సులో దేశవిదేశాలకు చెందిన సుమారు 2500 మంది న్యూరోసర్జన్లు హాజరై ఇదే అభిప్రాయం వెలుబుచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సదస్సు కో–చైర్మన్ డాక్టర్ సుభాష్‌కౌల్ యువత మొదడు ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో వివరించారు. ఒత్తిడి వల్ల చిన్నతనంలోనే స్ట్రోక్ మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లకు తోడు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో ఒకప్పుడు యాభై ఏళ్ల తర్వాత వెలుగు చూసిన బ్రెయిన్ స్ట్రోక్స్ పాతికేళ్ల వయస్కుల్లోనే కనిపించడం ఆందోళన కలిగించే అంశం. టార్గెట్లను ఛేదించాలనే ఆశయంతో రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని పనిచేస్తూ, మానసికంగా తీవ్ర ఒత్తిడిలోనవుతున్నారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన బాధితులను ఆరు గంటల్లోగా ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందించగలిగితే ప్రాణాలు కాపాడొచ్చు. అవగాహన లేమికితోడు నిర్లక్ష్యం వల్ల చాలామంది పూర్తిగా కాళ్లు, చేతులు, మాట పడిపోయిన తర్వాత అచేతనాస్థితిలో ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. అప్పటికే మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి మృత్యువాతపడుతున్నార’ని డాక్టర్ కౌల్ ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ప్రశాంతతతోనే విముక్తి ఇప్పటికే హై బీపీతో బాధపడుతున్న వారు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రశాంత మైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. అంతేకాదు వేళకు ఆహారం తీసుకోవడం, ఆహారంలో పిండిపదార్థాలకు బదులు పీచుపదార్థాలు ఎక్కువ ఉండేలా చూసుకోవడం, మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉండటం, ప్రతిరోజు ఉదయం కనీసం అరగంట పాటు వ్యాయామం, యోగాతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. మానసిక ఆరోగ్యం, చికిత్సల్లో వచ్చిన అత్యాధునిక మార్పులను అధ్యయనం చేసేందుకు ఇలాంటి సదస్సులు భావితరం వైద్యులకు ఎంతో ఉపయోగపడుతాయని ఆయన స్పష్టం చేశారు. -
బ్రెయిన్ స్ట్రోక్స్‌పై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో పలువురు జనరల్ ఫిజీషియన్లు, న్యూరాలజిస్ట్లు, న్యూరో సర్జన్లతో స్ట్రోక్స్ (మెదడు, నరాలు) సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఆసక్తి ఉన్న వైద్యులందరూ రావచ్చునని ఐఎస్సీడీఎస్ (ఇంటర్నేషనల్ స్ట్రోక్ అండ్ సెరెబ్రొవాస్క్యులర్ సింపోజియం) కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ నబీల్ ఎ హెరియల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లల్లో మెదడు సంబంధిత బాధితుల సంఖ్య ఏటికేటికీ గణనీయంగా పెరుగుతోందని, నిపుణులైన వైద్యులు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వైద్యులు ఈ నెల 14న ఉదయం తమ పేరు నమోదుచేసుకుని పాల్గొనవచ్చునన్నారు.