breaking news
navanita Krishnan
-
శశికళ చెల్లని కాసే !
► ప్రధాన కార్యదర్శి ఎన్నిక చెల్లదు ► అన్నాడీఎంకే మాజీ న్యాయ సలహాదారు జ్యోతి వెల్లడి ► శశికళ ఎంపికను ప్రశ్నించలేరు: ఎంపీ నవనీత కృష్ణన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక ఎంతమాత్రం చెల్లదని ఆ పార్టీ మాజీ న్యాయ సలహాదారు, సీనియర్ న్యాయవాది జ్యోతి అభిప్రాయపడ్డారు. 2008లో అన్నాడీఎంకే వదిలి డీఎంకేలో చేరిన జ్యోతి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంలో ఉన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ తీసుకున్న క్రమశిక్షణ చర్య నుంచి శశికళ బయటపడినా అంతకు ముందు పార్టీ సభ్యురాలిగా ఆమె గడిపిన రోజులు రద్దయినట్లేనని చెప్పారు. పార్టీలో ఆమె మరలా చేరిన రోజు నుంచి ఐదేళ్లపాటూ ఆమె సభ్యురాలిగా కొనసాగినట్లయితేనే ప్రధాన కార్యదర్శిగా పోటీకి అర్హురాలు కాగలరని తెలి పారు. కాబట్టి ప్రధాన కార్యదర్శిగా ఆమె నియామకం, ఆమె తీసుకున్న నిర్ణయాలు చెల్లవని చెప్పారు. అంతేగాక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల బీఫారంలో శశికళ సంతకం, రెండాకుల చిహ్నం కేటాయింపు చట్ట ప్రకారం చెల్లదని ఆయన అన్నారు. దీన్ని ధిక్కరించి రెండాకుల చిహ్నాన్ని కేటాయించిన పక్షంలో అది రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు. రెండాకుల చిహ్నం కేటాయింపు సమస్యపై సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నెరవేర్చేందుకు సర్వసభ్య సమావేశం ద్వారా ఒకరిని ఎన్నుకుని, అతని నియామకంపై ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం పొందినట్లయితే బీఫారంలో సంతకం పనికి వస్తుందని ఆయన చెప్పారు. టీటీవీ దినకరన్ మే ఖరారు కాని పరిస్థితిలో ఉప ప్రధాన కార్యదర్శి కావడం కుదరదని అన్నారు. పార్టీలో జయలలిత తనకు ఎంతో ప్రాధాన్యతనివ్వడం శశికళకు నచ్చలేదని తెలిపారు. శశికళ తదితరులకు ఏమికావాలో ఇచ్చి పంపివేయండి, దగ్గరే ఉంచుకోవద్దని జయలలితకు చెప్పానని ఆయన తెలిపారు. అయితే తన సలహాను జయ ఖాతరు చేయని ఫలితంగా తనను తానే కాపాడుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ కు హక్కులేదు: పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నందున ఎన్నికల కమిషన్ కు జోక్యం చేసుకునే హక్కు లేదని అన్నాడీఎంకే లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఎంపీ నవనీతకృష్ణన్ అన్నారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శి ఎంపిక పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం, ఇందులో ఎన్నికల కమిషన్ లేదా న్యాయస్థానం జోక్యం చేసుకోలేరని ఆయన చెప్పారు. -
రాజ్యసభకు నవనీతకృష్ణన్
- అన్నాడీఎంకే అధినేత్రి జయ ప్రకటన - జూలై 3న ఎంపిక తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) చైర్మన్‌గా ఉన్న నవనీతకృష్ణన్ అన్నాడీఎంకే తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యూరు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ఆయన పేరును గురువారం రాత్రి ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఇటీవల మృతిచెందిన విష యం తెల్సిందే. దీంతో రాజ్యసభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్థానం ఖాళీ అరుు్యంది. డీఎంకే రాజ్యసభ సభ్యు లు సెల్వగణపతి అవినీతి ఆరోపణల కారణంగా శిక్ష పడడంతో ఆయన రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో తమిళనాడులో ఒక స్థానం ఖాళీ ఏర్పడింది. ఒడిస్సాకు చెందిన శశిభూషణ్ బేర్, రబీనారాయణ మహాపాత్ర స్థానాలు ఖాళీ అయ్యూరు. ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యూరు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, 118 ఓట్లు దక్కించుకున్నవారే రాజ్యసభకు ఎంపికవుతారు. అన్నాడీఎంకేకు 153 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రాతిపదికన అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు ఏకగ్రీవమైనట్లే. రాజ్యసభకు రాజీనామా చేసిన సెల్వగణపతికి 2016 జూన్ 29 వతేదీ వరకు గడువు ఉంది. అప్పటి వరకు నవనీతకృష్ణన్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు. ఇదిలా ఉండగా రాజ్యసభ ఎన్నికల కోసం ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24వ తేదీన పరిశీలన, 26వ తేదీన ఉపసంహరణ పూర్తిచేసి జూలై 3న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం లెక్కింపు నిర్వహించి విజేత పేరును ప్రకటిస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో అన్నాడీఎంకేకు 10 మంది సభ్యులుండగా, నవనీత కృష్ణన్ గెలుపుతో ఆ బలం 11కు పెరగనుంది.