breaking news
Narayana Udyanavanam
-
తిరుమలలో సైకో హల్చల్
-
తిరుమలలో సైకో హల్చల్
తిరుమలలో ఓ సైకో కలకలం సృష్టించారు. నారాయణగిరి ఉద్యానవనంలో కత్తితో హల్చల్ చేశాడు. దాంతో అక్కడ ఉన్న భక్తులు భయంతో పరుగులు తీశారు. సైకో హల్ చల్ పై భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దాంతో విజిలెన్స్ అధికారులు హుటాహుటిన చేరుకుని సైకోను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి అన్యమతానికి చెందిన పుస్తకాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ విజిలెన్స్ అధికారులు అతడిని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. సైకో కేరళ రాష్ట్రానికి చెందిన ఇబ్రహీం ఖలీల్గా గుర్తించినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. గతంలో నడకదారిలో వస్తున్న దంపతులపై దాడి చేసిన వ్యక్తి ఇతడేనని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు.