breaking news
Mural painting
-
మ్యూరల్ మహాభారతం
ఒక గురువు. ముప్పై ఐదు మంది శిష్యులు. అంతా మహిళలు. నాలుగేళ్లు. వేర్వేరు రాష్ట్రాలు. వేర్వేరు ప్రాంతాలు. విభిన్న భాషలు. అంతా కలిశారు. కుడ్యచిత్రాలలో మహాభారతాన్ని లిఖించారు. ఆ కుడ్యచిత్ర కళ కూడా అతి ప్రాచీనమైనది. ఇక వీరు సృష్టించిన అద్భుతమైతే వర్ణనాతీతమైనది. కుడ్యచిత్ర కళ (మ్యూరల్ పెయింటింగ్) అనేది దక్షిణ భారతదేశంలో ప్రత్యేక కళ. ఇది ‘టెంపుల్ ఆర్ట్’గా కూడా ప్రసిద్ధి. ఆలయాల పైకప్పుల మీద ఎక్కువగా ఈ కళావైభవం కనిపిస్తుంటుంది. వీటిల్లో మళ్లీ కేరళ మ్యూరల్ పెయింటింగ్స్ ది ప్రత్యేక శైలి. గురువాయూరులోని శ్రీకృష్ణ ఆలయంలో, మరికొన్ని ఆలయాల్లో ఇవి విశేషంగా సాక్షాత్కరిస్తాయి. ఈ చిత్రకళా ప్రక్రియ 9 – 12 వ శతాబ్దాల మధ్యలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ కాలంలో రాజుల ప్రోత్సాహంతో కుడ్యచిత్రకళ మనుగడ సాగించింది. ముఖ్యంగా కేరళలోని ఎట్టమన్నూరు శివాలయంలో, మట్టన్ చెరి రాజప్రాసాదంలో.. రామాయణ ఘట్టాల మ్యూరల్స్, కృష్ణపురం ప్యాలెస్‌లో గజేంద్రమోక్షం ఘట్టం, అనంత పద్మనాభస్వామి ఆలయం పైకప్పు మీద.. ఈ మ్యూరల్ పెయింటింగ్స్ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అయితే.. ఇంత వరకు ఎక్కడా మహాభారతంపై మ్యూరల్ పెయింటింగ్స్ పెద్దగా లేవు. ఈ లోటును భర్తీ చేయడానికా అన్నట్లు ఇప్పుడు ప్రిన్స్ తొన్నక్కల్ కుడ్య చిత్రాలను రూపొందించి, వాటితో ఒక విశేష ప్రదర్శన ఇచ్చారు. నూటా పదమూడు ఘట్టాలు ప్రిన్స్ తొన్నక్కల్ కేరళకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు. ఆయన శిష్యురాళ్లైన ముప్పై ఐదు మంది రూపొందించిన ‘మ్యూరల్ మహాభారతం’ ఇప్పుడు దక్షిణ భారతంలో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటోంది. భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని ఈ బృందం 113 కుడ్య చిత్రాలనుగా ప్రదర్శించింది. చెన్నైలోని లలిత కళా అకాడమీలో పదిరోజులు జరిగిన ఈ మ్యూరల్ మహాభారతం చిత్రలేఖనాల ప్రదర్శన ముగింపులో వీటిని రూపొందించిన మహిళామణులు, వారి గురువు సత్కారాలను అందుకున్నారు. విశేషం.. విశ్వరూప దర్శనం ప్రిన్స్ తొన్నక్కల్‌కు ‘మహాగురువు’ అని పేరు. మ్యూరల్ పెయింటింగ్స్‌లో మహాభారతాన్ని రూపొందించాలన్నది ఆయన కల. దీనిని సాకారం చేసేందుకు ఆయన శిష్యురాళ్లు నడుం బిగించారు. మొత్తం కుడ్య చిత్రాలలో మహిళా శిష్యులు ఒక్కొక్కరూ 3 నుండి 4 పెయింటింగ్స్ ను రూపొందించగా గురువు ప్రిన్స్ తొన్నక్కల్ మహాభారతంలోని చివరి ఘట్టమైన విశ్వరూప దర్శనాన్ని ఒక చిత్రంగా తయారుచేశారు. ఈ ప్రాజెక్టులో కేరళలోని కొల్లం, కొట్టాయం, తిరువనంతపురానికి చెందిన మహిళా చిత్రకారులు అధికం ఉన్నారు. తమిళనాడు నుండి 8 మంది, ఢిల్లీ నుంచి ఒకరు, దుబాయ్ నుండి ఒకరు ఉన్నారు. ముందుగా మహాభారత ఘట్టాలను చిత్రీకరించి, ప్రకృతి సహజమైన పంచవర్ణ రంగులతో వాటిని తీర్చిదిద్దారు. ఈ మొత్తం ‘మ్యూరల్ మహాభారతం’ థీమ్ తయారీకి వీళ్లంతా నాలుగేళ్లు శ్రమించాల్సి వచ్చింది. – సంజయ్ గుండ్ల, సాక్షి టీవీ, చెన్నై -
క్లౌడ్‌సోర్సింగ్‌తో కుడ్య చిత్రకళ
విశ్లేషణ కుడ్య చిత్రకళలో ఇది కొత్త నియంత్రిత ప్రక్రియ. చూసేవారికి వెంటనే సందే శాన్ని అందించడానికి జట్టంతా కలసి కళా సృజనను నిర్వహించడం. సృజనాత్మక ఉద్వేగాలను కవాతు చేయించడం, వ్యక్తీకరణలో ఏకత్వాన్ని సాధించడం. బిల్హార్, మహాబలేశ్వర్ పంచాగ్ని ప్రాంతంలోని ఒక గ్రామం. అక్కడ పండించే స్ట్రాబెర్రీ పండ్లను కొనుక్కోవడం కోసం పర్యాటకులు అక్కడికి రావడం పరిపాటే. గ్రామంలోని పాతికకు పైగా గోడలపై చిత్రాలను గీయ డానికి పెద్ద చిత్రకారుల బృందం అక్కడకు వచ్చింది. ‘స్వత్వ,’ వాట్సాప్ ఆధారిత సాంప్రదాయేతర చిత్రకళాకారులు, చిత్ర కళారాధకుల అనుసంధాన సంస్థ. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే పుస్తకాలను భద్రపరచడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వివిధ గృహాల గోడలపై తమ రంగులు, కుంచెలకు పని చెప్పే బాధ్య తను పురమాయించింది. ఇలా పుస్తకాలను భద్రపరచే ఇళ్లు తదితర ప్రదేశాలలో ఒక చోట బాల సాహిత్యం, మరో చోట మహిళలకు సంబంధించినవి, ఇంకో చోట రుషిపుంగవుల రచనలు వగైరా ఉంటాయి. ప్రభుత్వం అందించిన పది వేల పుస్తకాలను 22 చోట్ల భద్ర పరచడానికి వీలుగా వాటిని వేరు చేశారు. ‘పుస్తకాంచె గావో’ (మరా ఠీలో పుస్తకాల గ్రామం) భారీ లక్ష్యంతో చేపట్టిన పథకం. ఇది రెండు ఉద్దేశాలతో చేపట్టినది. మహాబలేశ్వర్, పంచాగ్ని పర్యాటకులు అక్కడ కాలం వెళ్లబుచ్చి పోవడం గాక, పుస్తకాలతో కాలక్షేపం చేసే అవకాశాన్ని కూడా కల్పించడం, అది ఆ ప్రాంత వాసులలో పఠనాసక్తిని ప్రేరేపించగలదనే ఆశ సైతం ఉంది. రెండు బస్సులలో శుక్రవారం ఉదయం వచ్చి, ఆది వారం రాత్రికి తిరిగి వెళ్లిన 70 మంది చిత్రకళాకారు లలో వివిధ స్థాయిల ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నవారు న్నారు. వారిలో ఒకడినైన నాకు, నూతనమైన ఈ చిత్రకళను క్రౌడ్‌సోర్సింగ్... ప్రపంచంతో పంచుకోవా ల్సినదనిపిస్తోంది. కుడ్య చిత్రకళలో ఇది ఒక కొత్త నియంత్రిత ప్రక్రియను సృష్టిస్తోంది. ఇది గోడలను కంటికింపైన రంగులతో నింపి వెళ్లడానికి మించినది. ఇది వ్యక్తులు తమ సృజనాత్మక వాంఛల వెంటపడి చిత్రించుకుపోవడం కాదు. అందుకు భిన్నంగా చూసే వారికి వెంటనే ఒక సందేశాన్ని అందించడం కోసం ఒక జట్టు మొత్తం కలసి కళా సృజనను నిర్వహించడం. కాబట్టి, ఇది సృజన్మాత్మక ఉద్వేగ ప్రవాహాలను క్రమ పద్ధతిలో కవాతు చేయించడం, వ్యక్తీకరణలో ఏక త్వానికి హామీని కలగజేయడం. అయితే అందుకు పీడ కలా సదృశమైన సరఫరాలు, నియంత్రణ, నిర్వహణ తదితర ఏర్పాట్లు అవసరం. ప్రతి వ్యక్తి తన లోలోపలి స్వీయత్వాన్ని వెలికి తెచ్చేలా చేయాలని స్వత్వ కోరుకుంటుంది. ఈ కృషిలో పాల్గొనదలచిన ఔత్సాహికులలో ఏ ఒక్కరినీ స్వత్వ వద్దన్నది లేదు. ప్రధానంగా థానే కేంద్రంగా పనిచేసే స్వత్వకు ఇండోర్, పుణేల వంటి సుదూర ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తలు వచ్చి చేరడం మహో త్తేజాన్ని కలిగించింది. సామాజిక మాధ్యమాల పుణ్య మాని ఇది సాధ్యమైంది. ఈ పర్యటనలో బడి వసతి గృహంలో ఉంటూ, పిల్లల స్నానాల గదిలో ఒకేసారి ఆరుగురు స్నానాలు చేస్తూ గడ్డు జీవితం గడపాల్సి వచ్చింది. సుప్రసిద్ధులు, చెప్పుకోదగిన గుర్తింపున్న కళాకారులు కొత్తవాళ్లతో భుజాలు రాసుకునే కాదు, ఆవేశాలను పూసుకు తిరిగారు. థానే మునిసిపాలిటీ మద్దతుతో పలు గోడలపై చిత్రాలను వేసేటప్పుడు చూసేవారు ఎవరైనా బ్రష్‌తో చేయి కలుపుతానంటే ఆహ్వానించారు. ఇలాంటి ఔత్సాహికులు చేసే పొరపాట్లను సీని యర్ కళాకారులు చడీచప్పుడు లేకుండా సరిచేసేవారు. లేదంటే తక్షణమే లేదా ఆ తర్వాత ఉప యోగకరమైన సూచనను చేసే వారు. అయితే దాని ఉద్దేశం మాత్రం ప్రోత్సహించడమే. అయితే, థానేకు 250 కిలోమీటర్ల దూరంలోని బిల్హార్లో చేపట్టిన ఈ సాహసం అందుకు భిన్న మైనది. కేవలం మూడు రోజు ల్లోనే అంతా చేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లిన బృందం లోని వారు ఒకరికొకరు పరిచయ మైనది బస్సు ఎక్కేటప్పుడు, వారి నైపుణ్యాలతో పరి చయమైనది గోడల మీద బొమ్మలు వేసే పని చేయడం మొదలయ్యాకే. ప్రతి జట్టులోని వారికి నేతృత్వం వహించడానికి ఒక అనుభవజ్ఞుడైన కళాకారులు ఉండే వారు. ఆయన లేదా ఆమె తమ జట్టు సభ్యులు ఒక్కొ క్కరిలో ఉన్న భిన్న నైపుణ్యాలతో కూడిన ప్రతిభను ఒకే సమష్టి సృజనాత్మకతగా వ్యక్తమయ్యేలా మార్గదర్శ కత్వం వహించాల్సివచ్చింది. అలా పెంపొందిన సృజ నాత్మక సమన్వయం వల్ల జట్లు దాదాపు ప్రతిరోజూ రాత్రింబవళ్లూ పని చేశాయి. రంగులు, కుంచె చేయగల అద్భుతాలకు విభ్రాం తులై, ముందు ముందు ఏమైనా చేయవచ్చనుకున్న వారు సైతం జట్లలో చేరారు. అలాంటి వారు కేవలం అదీ ఇదీ అందిం^è డం, తెచ్చి ఇవ్వడం లాంటి పనులు చేయడానికి వెనుకాడలేదు. ఆ తరువాత వాళ్లు చిత్ర కళను తమంతట తాముగానే నేర్చుకుంటామని లేదా చిత్రకళ కోర్సులో చేరుతామని చెప్పారు. కొన్ని సంద ర్భాల్లో ప్రముఖులైన సీనియర్లు వాట్సాప్ ద్వారా తమ మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తామని ముందుకొచ్చారు. చిత్రలేఖనాన్ని 64వ ఏట మొదలుపెట్టిన నేను ఇంకా దాన్ని కొనసాగిస్తుండటానికి వారు సహాయపడ్డారు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com