breaking news
mother child murder
-
వేరే మహిళతో సంబంధం పెట్టుకొని వేధించేవాడు
-
అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం
-
అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం
విజయవాడ: అమెరికాలో జంట హత్యల కేసులో కొత్త కోణం బయటపడింది. మృతురాలు శశికళ పంపిన ఈ మెయిల్స్‌ను ఆమె కుటుంబ సభ్యులు శనివారం బయటపెట్టారు. తన భర్త నర్రా హనుమంతరావుకు ఓ కేరళ మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ శశికళ తన సోదరుడు వేణుకు మెయిల్ లో తెలిపింది. శశికళ మెయిల్ తో తెలిపిన విషయాలు... ‘సీటీఎస్‌లో పని చేసే దీపా అజిత్‌తో హన్మంత్‌కు సంబంధం ఉంది. రోజు దీపాతో హన్మంత్ ఫోన్లు, చాట్లు చేస్తున్నాడు. మొబైల్లో వీటిని చూసి హన్మంత్‌ను నిలదీశా. నేనేం తప్పు చేయలేదని బుకాయించాడు. హన్మంత్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. కొన్నిసార్లు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏమైనా చేసుకో పో అంటూ తిరగబడుతున్నాడు. ఐదేళ్ల కొడుకు ఉండికూడా మరో మహిళతో సంబంధం ఘోరం. హన్మంతరావును నేనెంతో నమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు ఇలాంటి మోసం జరగుతుందనుకోలేదు. వాళ్ల తల్లిదండ్రులు, అక్కా బావా అందరూ కుట్రదారులే. ఒక్క విషయం కూడా పంచుకోరు, పైగా ప్రమాదకారులు. ముఖ్యంగా మా అత్తమ్య చాలా చాలా ప్రమాదకారి. కొడుకును ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. ఈ విషయాలన్నీ అమ్మకు చెబితే బాధ పడుతుంది. ఇన్ని బాధలున్నా బతుకుతున్నానంటే కేవలం హనీష్ (కొడుకు) కోసమే.’ అని మెయిల్లో పేర్కొంది. అలాగే భార్యాభర్తల మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలుతో పాటు భర్త వేధింపులకు సంబంధించిన సోదరుడు వేణుకు పంపిన మెయిల్లను మృతురాలు తల్లిదండ్రులు మీడియాకు చూపించారు. (చదవండి- వివాహేతర సంబంధమే కారణమా?) తమ కూతురు, మనవడిని దారుణంగా హతమార్చిన హనుమంతరావును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, కృష్ణకుమారిలు డిమాండ్ చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస సహకారం కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి అయినప్పటినుంచే భర్త వేధింపులకు గురిచేస్తున్నడంటూ తమ కుమార్తె పలుమార్లు చెప్పినా తామే సర్దుకుపొమ్మని చెప్పామని, అయితే అల్లుడు ఇంత ఘాతుకానికి పాల్పడతాడని తాము ఊహించలేదని అన్నారు. మరోవైపు జంట హత్యల కేసులో హనుమంతరావును అక్కడ పోలీసులు విచారణ జరిపారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం అతడిని విడుదల చేశారు. హన్మంత్ తో కేరళ యువతి చాటింగ్... అలాగే హన్మంత్ కేరళ యువతితో చేసిన చాటింగ్‌ను కూడా శశికళ బంధువులు బయటపెట్టారు. ‘నా జీవితంతో ఆటలు ఆడుకుంటున్నావు. నువ్వొక అబద్ధాలకోరువు. నా భర్త ముందు నిలబడి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలను. ఇదే విషయం నువ్వు నీ భార్య ముందు చెప్పగలవా?. నీ భార్యకు నువ్వు భయపడుతున్నావు. నాతో సంబంధంపై భయపడేవాడివైతే ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు?. నీ దగ్గర నేనేం దాచలేదు.’ అని కేరళ యువతి హన్మంత్‌కు మెసేజ్ చేసింది. మరోవైపు జంట హత్యల కేసులో హనుమంతరావును అక్కడ పోలీసులు విచారణ జరిపారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం అతడిని విడుదల చేశారు. చదవండి... అమెరికాలో తల్లీబిడ్డల దారుణహత్య -
అమెరికాలో తల్లీబిడ్డల దారుణహత్య
ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెం, కృష్ణాజిల్లా పోరంకిల్లో విషాదం ♦ అల్లుడే చంపేశాడంటున్న మృతురాలి తల్లిదండ్రులు ♦ పార్లమెంట్ ఉభయసభల్లో సభ్యుల ఆందోళన ♦ అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ ♦ జాతివివక్ష దాడులు కావన్న అమెరికా అధికారులు పర్చూరు/పెనమలూరు: ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ కొడుకుతో సహా అమెరికాలో దారుణహత్యకు గురయ్యారు. నర్రా శశికళ (35), హనీశ్సాయి (7)లను దుండగులు గొంతుకోసి చంపేశారు. ఈ హత్యల సమాచారంతో ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెం, కృష్ణాజిల్లా పోరంకి గ్రామాల్లో విషాదం నెలకొంది. తమ కుమార్తెను, మనుమడిని అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు, శశికళ దంపతులు పదేళ్లుగా అమెరికా న్యూజెర్సీలోని మ్యాపుల్షేడ్లో ఉంటున్నారు. హనీశ్సాయి వీరి కుమారుడు. హనుమంతరావు సీటీఎస్ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా శశికళ అదే కంపెనీకి ఇంటి నుంచి (వర్క్ ఫ్రమ్ హోమ్) సేవలు అందిస్తున్నారు. హనుమంతరావు గురువారం హనీశ్సాయిని స్కూల్లో వదిలిపెట్టి విధులకు వెళ్లాడు. సాయంత్రం శశికళ కుమారుడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన హనుమంతరావు ఇంటి తలుపులు తెరవగా భార్య, కుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్నారు. గుర్తుతెలియని దుండగులు వీరిద్దరినీ గొంతుకోసి హత్యచేశారు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో హనుమంతరావు తిమ్మరాజుపాలెంలోని తల్లిదండ్రులు నర్రా శివపార్వతి, సుబ్బారావు, పోరంకిలో ఉన్న అత్తమామలు సుంకర కృష్ణకుమారి, వెంకటేశ్వరరావుకు ఫోన్‌చేసి విషయం తెలిపారు. అమెరికాలో పోలీసులు హత్య జరిగిన అపార్టుమెంట్‌ను సీజ్ చేసి, హనుమంతరావును విచారిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో హత్యలపై స్పందించండి: లోక్‌సభలో ఎంపీ వైవీ సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో జరుగుతున్న జాతివివక్ష హత్యలపై కేంద్రం వెంటనే స్పందించి నిర్మాణాత్మక చర్యలకు నడుం బిగించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు హత్యకు గురైన విషయాన్ని ఆయన శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్రం దృష్టికి తెచ్చారు. ‘అమెరికాలోని భారతీయులపై దాడులు తగ్గడం లేదు. కూచిభట్ల శ్రీనివాస్ హత్యను మరవకముందే మళ్లీ అలాందే జరగడం విషాదకరం’ అని అన్నారు. తల్లీకొడుకుల దారుణ హత్యల్ని తీవ్రంగా పరిగణించా లని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని పార్లమెంటరీ వ్యవహారా లశాఖ మంత్రి నక్వీకి సూచించారు. ఇదిలా ఉండగా ఈ హత్యపై అమెరికా అధికారులతో మాట్లాడుతున్నామని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే మీడియాతో చెప్పారు. ఈ దారుణ హత్యలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఇండియన్–అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర చెప్పారు. మృతదేహాలను భారతకు పంపేందుకు తానా సహాయం చేస్తుందని చెప్పారు. (ఎన్నారైల హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?) ఇవి జాతివివక్ష హత్యలు కాదు.. భారత్‌కు చెందిన ఐటీ ఉద్యోగిని శశికళ, ఆమె కుమారుడు న్యూజెర్సీలో మ్యాపుల్షేడ్లోని తమ ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారని బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ రాబర్ట్ బెర్నార్డి, మ్యాపుల్షేడ్ పోలీస్ చీఫ్ గ్యారీ గుబ్బే చెప్పారు. దుండగులు వారిని పలుమార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశారన్నారు. కొందరు మీడియా ప్రతినిధులు పేర్కొన్నట్లు ఈ హత్యలు జాతివివక్షతో జరిగాయనేదానికి ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్ కార్యాలయం పీఆర్వో జోయల్ బెవ్లీ చెప్పారు. శశికళ మృతితో విలపిస్తున్న తల్లిదండ్రులు అల్లుడే హత్య చేయించాడు: వెంకటేశ్వరరావు తమ కుమార్తెను, మనుమడిని అల్లుడే హత్య చేయించి ఉంటాడని శశికళ తండ్రి వెంకటేశ్వరరావు ఆరోపించారు. పోరంకిలో మీడియాతో మాట్లాడుతూ.. శశికళకు, హనుమంతరావుకు 2004లో వివాహమైందని.. డబ్బుల కోసం కుమార్తెను అల్లుడు వేధించేవాడని చెప్పారు. హనుమంతరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్నారు. తమ కుమార్తె భర్త ఆగడాలను పలుమార్లు ఫోన్లో తెలిపేదని, కొద్దిరోజుల కిందట అతడు కొట్టినట్లు కూడా చెప్పిందని తెలిపారు. కిరాయి హంతకులతో తమ అల్లుడే ఈ హత్యలు చేయించి ఉంటాడని చెప్పారు.