breaking news
Most Valuable Company
-
విలువైన కంపెనీల్లో ‘తెలుగు’ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 39 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా తదితర దిగ్గజాలు వీటిలో ఉన్నాయి. 2025కి సంబంధించి హురూన్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌లో భాగమైన బర్గండీ ప్రైవేట్ దేశీయంగా అత్యంత విలువైన టాప్ 500 కంపెనీలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీల మొత్తం విలువ రూ. 12.1 లక్షల కోట్లుగా ఉంది. 2021 నుంచి చూస్తే 75 శాతం పెరిగింది. ఇవి గత ఐదేళ్లుగా ప్రతి రోజు సుమారు రూ. 283 కోట్ల విలువను జోడించాయి. జాబితాలోని 39 తెలుగు కంపెనీలు.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో 3.4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2021తో పోలిస్తే ఈ సంఖ్య 70 శాతం పెరిగింది. ఇక మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీల్లో 8,480 మంది ఉద్యోగినులతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అగ్రస్థానంలో ఉండగా, 8,143 మందితో మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ రెండో స్థానంలో, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ 3,427 మందితో మూడో స్థానంలో ఉంది. ఎంటార్ టెక్నాలజీస్, స్కైరూట్ ఏరోస్పేస్ మొదలైన వాటికి ఈసారి స్థానం లభించింది. హెల్త్‌కేర్ రంగంలో తెలంగాణ నుంచి 16 సంస్థలు, ఏరోస్పేస్–డిఫెన్స్‌లో 5, పారిశ్రామికోత్పత్తుల్లో 3, ఆటోమొబైల్–ఆటో విడిభాగాల్లో 3, నిర్మాణం–ఇంజనీరింగ్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, కన్జూమర్ గూడ్స్ రంగాల్లో తలో రెండు కంపెనీల చొప్పున ఉన్నాయి. రిలయన్స్ టాప్.. జాతీయ స్థాయిలో టాప్ 500 కంపెనీలన్నింటి వేల్యుయేషన్ 3.4 లక్షల కోట్లడాలర్లుగా ఉంది. ఇది కెనడా జీడీపీ, ఇండొనేసియా–స్పెయిన్‌ల సంయుక్త జీడీపీ కన్నా అధికమని హురూన్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. వీటిలో దాదాపు 89 లక్షల మంది సిబ్బంది ఉండగా, పన్నుల కింద అవి రూ. 3.23 లక్షల కోట్లు చెల్లిస్తున్నాయి. 2026 ఏప్రిల్ 30 నాటికి కనీసం రూ. 10,230 కోట్ల విలువ చేసే కంపెనీలకు ఈసారి లిస్టులో చోటు దక్కింది. గత ఎడిషన్‌లో ఇది రూ. 9,580 కోట్లుగా ఉంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 19,36,230 కోట్ల వేల్యుయేషన్‌తో అగ్రస్థానంలో నిల్చింది. కాగా, అత్యంత విలువైన అన్‌లిస్టెండ్ కంపెనీగా ఎన్ఎస్ఈ అగ్రస్థానంలో కొనసాగింది. సంస్థ వేల్యుయేషన్ రూ. 4,86,340 కోట్లుగా ఉంది. అన్‌లిస్టెడ్ దిగ్గజాల్లో మేఘా ఇంజనీరింగ్ ఆరో స్థానంలో, జిరోధా అయిదో స్థానంలో, గ్రీన్కో 8వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఎస్ఈ రూ. 30,000 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఐదు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చోటు హురూన్ ఇండియా 2025 లిస్టులో 5 ఐపీఎల్ టీమ్‌లకు చోటు దక్కింది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ వీటిలో ఉన్నాయి. వీటి మొత్తం వేల్యుయేషన్ రూ. 71,000 కోట్లు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 20,850 కోట్లతో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా, ఓవరాల్ లిస్టులో 270వ స్థానంలో నిల్చింది. -
అదానీ గ్రూప్ విలువ జూమ్..
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా అదానీ గ్రూప్ నిల్చింది. 2025కి గాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ రిపోర్టు ప్రకారం అదానీ బ్రాండ్ విలువ 2024లో 3.55 బిలియన్ డాలర్లుగా ఉండగా తాజాగా 2.91 బిలియన్ డాలర్లు పెరిగి 6.46 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఓవరాల్‌గా గతేడాది 16వ స్థానంలో ఉండగా ఈసారి 13వ ర్యాంకుకు చేరింది. 82 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో అదానీ గ్రూప్ అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా నిల్చిందని రిపోర్ట్ పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. → ఇండియా 100 జాబితాలోని మొత్తం సంస్థల బ్రాండ్ విలువ 236.5 బిలియన్ డాలర్లు.→ అత్యంత విలువైన భారతీయ బ్రాండుగా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానంలో నిల్చింది. బ్రాండ్ విలువ 10 శాతం వృద్ధి చెంది 31.6 బిలియన్ డాలర్లకు చేరింది. → 15 శాతం బ్రాండ్ విలువ (16.3 బిలియన్ డాలర్లు) వృద్ధితో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ జాబితాలో అత్యంత విలువైన రెండో భారతీయ బ్రాండుగా నిల్చింది.→ హెచ్డీఎఫ్సీ గ్రూప్ బ్రాండ్ విలువ 14.2 బిలియన్ డాలర్లకు చేరడంతో ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిల్చింది. ఎల్ఐసీ (13.6 బిలియన్ డాలర్లు) నాలుగో ర్యాంకు, హెచ్‌సీఎల్‌టెక్ (బ్రాండ్ విలువ 17 శాతం అప్, 8.9 బిలియన్ డాలర్లు) ఒక ర్యాంకు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. ఎల్అండ్టీ గ్రూప్ (7.4 బిలియన్ డాలర్లు) తొమ్మిదో స్థానంలో, మహీంద్రా గ్రూప్ (7.2 బిలియన్ డాలర్లు) 10వ స్థానంలో నిల్చాయి. → అత్యంత పటిష్టమైన భారతీయ బ్రాండుగా తాజ్ హోటల్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. -
మార్కెట్ క్యాప్‌లో నెం.1గా యాపిల్
ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా యాపిల్ అవతరించింది. కరోనా కల్లోల సమయంలోనూ కంపెనీ అదిపోయే క్యూ2 ఫలితాలను ప్రకటించింది. మెరుగైన ఫలితాల ప్రకటన నేపథ్యంలో కంపెనీ షేరు 10శాతానికి పైగా లాభపడి 425.04 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సౌదీ ఆరామ్కో మార్కెట్ క్యాప్‌ను అధిగమించి 1.82 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాదిలో స్టాక్ మార్కెట్లో లిస్టైన సౌదీ ఆరాంకో మార్కెట్ క్యాప్ శుక్రవారం నాటికి 1.76ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా ఎఫెక్ట్‌తో అమెరికాలో టెక్నాలజీ షేర్లకు భారీగా డిమాండ్ నెలకొంది. యాపిల్ షేరు ఏడాది మొత్తం మీద 45శాతం ర్యాలీ చేసింది. రెండో త్రైమాసికం సందర్భంగా దాదాపు 6తర్వాత యాపిల్ కంపెనీ షేర్ల విభజనకు ఆమోదం తెలిపింది. ఈ ఆగస్ట్ 31 తరువాత 1:4 విభజిస్తారు. ఈ జూన్ కార్వర్ట్‌లో యాపిల్ కంపెనీ 16బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సరికి 4.33బిలియన్ల అవుట్‌స్టాడింగ్ షేర్లు ఉన్నట్లు నాస్డాక్ ఎక్చ్సేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. -
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా అమెజాన్
గ్లోబల్ ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సారధ్యంలోని అమెజాన్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టాప్ ప్లేస్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్‌ను వెనక్కి నెట్టి సోమవారం ఈ ఘనతను సాధించింది. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ రిటైల్ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి, ఈ భూమిపై అత్యంత విలువైన సంస్థగా మారింది. మంగళవారం గ్లోబల్ మార్కెట్లు ముగిసే సమయానికి అమెజాన్ షేరు మరో 10శాతం ఎగిసి, అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 810 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 57 లక్షల కోట్లు) గా నమోదైంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అమెజాన్ నిలిచింది. ఇది సమీప కంపెనీ మైక్రోసాఫ్ట్ సంపద 790 బిలియన్ డాలర్లతో పోలిస్తే 20 బిలియన్ డాలర్లు ఎక్కువ. మరోవైపు చైనా దెబ్బతో యాపిల్ మరింత పడిపోయింది. ఒకపుడు1.1 ట్రిలియన్ డాలర్లు అధిగమించిన యాపిల్ మార్కెట్ క్యాప్, ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి 35 శాతానికి పైగా దిగజారింది. యాపిల్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ 710 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో నాల్గవ స్థానంతో సరిపెట్టుకుంది. 750 బిలయన్ డాలర్లతో గూగుల్ ( మాతృసంస్థ ఆల్ఫాబెట్ ) మూడవ స్థానంలో ఉంది. జెఫ్ బెజోస్ నేతృత్వంలో అమెజాన్ రిటైల్ రంగంలో, ఆన్ లైన్ సేవలతో దూసుకుపోతోంది. 2013లో అమెజాన్ రెవిన్యూ 74.5 బిలియన్ డాలర్లు ఉండగా, 2018 చివరి నాటికి కంపెనీ ఆదాయం 177.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం చివరినాటికి అది 232.2 బిలియన్ డాలర్లుకు పెరగవచ్చని గ్లోబల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
గూగుల్‌ను బీట్ చేసిన అమెజాన్
గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బీట్ చేసింది. గూగుల్ బీట్ చేసిన ఈ కంపెనీ అమెరికా లిస్టెడ్ కంపెనీల్లో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. అమెజాన్, ఆల్ఫాబెట్ గూగుల్‌ను బీట్ చేయడం ఇదే తొలిసారి. అమెజాన్ షేర్లు 2.69 శాతం పెరగడంతో, ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 768 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అయితే ఇదే సమయంలో ఆల్ఫాబెట్ షేర్లు 0.39 శాతం నష్టపోయాయి. దీంతో ఆల్ఫాబెట్ గూగుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 762 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాదిగా అమెజాన్ స్టాక్ 81 శాతం పెరిగింది. తన కంప్యూటింగ్ ఆపరేషన్లను క్లౌడ్‌లోకి మార్చడంతో, ఈ కంపెనీ వేగంగా రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసులు కూడా మార్కెట్లో ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. కాగ, ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా 889 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఆపిల్ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ కంపెనీ షేర్లు 25 శాతం పెరుగుతూ వస్తున్నాయి. ఒకవేళ ఇదే విధంగా ఆపిల్ స్టాక్ పెరిగితే, ఆపిల్ మార్కెట్ క్యాప్ తొలిసారి 1 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకనుంది. -
టీసీఎస్‌ను బీట్ చేసిన బ్యాంకింగ్ దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న టెక్ దిగ్గజం టీసీఎస్‌ను, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధిగమించింది. మార్కెట్ విలువలో రెండో అత్యంత విలువైన కంపెనీగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు అవతరించింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,73,530.72 కోట్లకు ఎగిసింది. ఇది టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే రూ.797.4 కోట్లు ఎక్కువ. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.4,72,733.32 కోట్లగా ఉంది. బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 0.93 శాతం పైకి జంప్‌చేసి 52 వారాల గరిష్టంలో ట్రేడవుతున్నాయి. టీసీఎస్ కూడా 0.36 శాతం లాభాల్లో ట్రేడవుతున్నప్పటికీ, ఈ కంపెనీని హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ దిగ్గజం అధిగమించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు సుమారు 53 శాతం పైకి ఎగియగా.. టీసీఎస్ 5 శాతం మేర లాభపడింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.5,33,818.72 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లున్నాయి.


