breaking news
monthly users
-
‘ఎక్స్’లెంట్: ట్విటర్ సరికొత్త రికార్డ్! షేర్ చేసిన మస్క్
‘ఎక్స్’(X)గా పేరు మారిన ట్విటర్ (Twitter) సరికొత్త రికార్డ్ సాధించింది. మంత్లీ యూజర్ల సంఖ్యలో నూతన గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు దాని అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. మంత్లీ యూజర్ల సంఖ్య 540 మిలియన్లను దాటినట్లు చూపుతున్న గ్రాఫ్‌ను షేర్ చేశారు. ఇటీవల పడిపోయిన ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు సంస్థలో సంస్థాగత మార్పులు చేపట్టిన తరుణంలో యూజర్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. మరోవైపు ఇంకొక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా.. ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్ అనే మైక్రో బ్లాగింగ్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్‌లో మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి ముందు 2022 మే నాటికి ట్విటర్ 229 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉండగా తన ఆధీనంలోకి వచ్చాక 2022 నవంబర్‌లో 259.4 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు మస్క్ పోస్ట్ చేశారు. తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ ట్విటర్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. బ్లూటిక్‌ను పెయిడ్ సర్వీస్‌గా మార్చారు. అస్తవ్యస్తమైన మార్పుల ఫలితంగా ప్రకటనల ఆదాయం క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత మేలో ఎన్బీసీ యూనివర్సల్ అడ్వర్టైజింగ్ చీఫ్‌గా ఉన్న లిండా యాకారినోను ట్విటర్ (ఎక్స్)కు సీఈవోగా నియమించారు. తద్వారా తనకు సబ్స్క్రిప్షన్ రాబడితోపాటు ప్రకటనల ఆదాయం కూడా కీలకమని సంకేతాలిచ్చారు. ఇదీ చదవండి ➤ Elon Musk: అతని కోపం ప్రళయం.. మస్క్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ఉద్యోగిని ప్రకటనల ఆదాయంలో దాదాపు 50 శాతం తగ్గిపోయిందని, అలాగే పెరిగిన రుణ భారం కారణంగా నగదు లోటును ఎదుర్కొంటున్నట్లు జులై నెల ప్రారంభంలో మస్క్ చెప్పారు. ఇంతలో ట్విటర్‌ని ‘ఎక్స్’గా రీబ్రాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మెటా, మైక్రోసాఫ్ట్‌తోపాటు మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ‘ఎక్స్’ అక్షరంపై మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్నాయి. కాబట్టి దీనిపై చట్టపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. 𝕏 monthly users reach new high in 2023 pic.twitter.com/trqLGBEvvA — Elon Musk (@elonmusk) July 28, 2023 -
ప్రతినెలా 8 కోట్లమంది ఉపయోగిస్తున్నారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతినెలా ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారని సోషల్ మీడియా దిగ్గజం ఓ ప్రకటనలో తెలిపింది. తమ కుటుంబ సభ్యులు, మిత్రులుకు టచ్ లోఉండేందుకు, ఉద్యోగులు ప్రాజెక్టు వర్క్ లను నిర్వహించేందుకు ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారని ఆసంస్థ తెలిపింది. గతేడాది చాలామంది ఫేస్ బుక్ ను వదిలి వెళ్లడంతో వినియోగదారులను ఆకర్షించేందుకు డిస్కవరీ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 25 రకాల అంశాలకు సంబందించిన సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఉందని ఫేస్ బుక్ వెల్లడించింది.