breaking news
Monsoon Special
-
రూ. 899కి విమాన టికెట్
ఇండిగో వర్షాకాల ఆఫర్ చెన్నై: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో తాజాగా వర్షాకాల స్పెషల్ కింద ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో ప్రయాణానికి టికెట్ చార్జీలు రూ. 899 నుంచి ఉంటాయని తెలిపింది. హైదరాబాద్–ముంబై, కోల్‌కతా–అగర్తలా తదితర 39 రూట్లలో ఈ చార్జీలకు టికెట్లు పొందవచ్చని పేర్కొంది. జూన్ 12న మొదలైన ఆఫర్ 14 దాకా మూడు రోజులపాటు కొనసాగుతుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ టికెట్లు నాన్‌రిఫండబుల్‌గా ఉంటాయి. వేసవి ఆఫర్లకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో వర్షాకాల ఆఫర్ ప్రకటించినట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. -
గో ఎయిర్ ఆఫర్: రూ. 599లకే టికెట్
న్యూడిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్ సమ్మర్ స్పెషల్ సేల్ తరువాత దేశీయ ఎయిర్‌లైన్ గో ఎయిర్ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. మాన్ సూన్ క్యాంపెయిన్ పేరుతో అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 599 గా ప్రారంభమయ్యే ధరలను శుక్రవారం ప్రకటించింది. ఈ రోజు మే 12 నుంచి మే 15, 2017 అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులోఉండనున్నాయని ఎయిర్ లైన్ ఒకప్రకనట లో తెలిపింది. జూలై 01 - సెప్టెంబరు 30, 2017 మధ్య ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. తమ నెట్ వర్క్ లో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ డిస్కౌంట్ చెల్లుతుంది. 23 సెక్టార్లలో గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న విమానాల్లో ప్రయాణీకులకు అత్యల్ప ఛార్జీలను అందిస్తుంది. ఇన్ఫాంట్ గ్రూప్ బుకింగ్ కోసం ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదని, ఇతర ప్రమోషనల్ ఆఫర్‌తో లేదా ఏదైనా రూపంలో కలిపి వర్తించదని తెలిపింది. కాగా రూ .899ప్రారంభ ధరలతో మే 8, 2017 న, ఇండిగో 'సమ్మర్ స్పెషల్ సేల్' ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.