breaking news
mla pa
-
చిల్లర వేషాల గణేశా.. మక్కెలిరగ తంతా మల్లేశా!
‘గణపతి.. నేను మల్లేష్‌ను.. గ్రూపులో ఎగ్జిట్ ఎందుకు కొట్టావు.. నువ్వు ఎవడవు.. తీయడానికి....పోస్టులు పెడితే తీసేస్తావా... ఏ ఫొటోలు పెట్టాను.. ఎంపీ, మంత్రి, దాసునాయుడు ఫొటోలు పెట్టాను.. అంతమాత్రాన తీసేస్తావా? పార్టీ గ్రూపులో ఎలా తీస్తావ్. నన్ను తీయడానికి నువ్వెవడివి. పార్టీ కోసం పనిచేశాను. నీలా చిల్లర పనులు చేయిలేదు. టిఫిన్ కొట్టోళ్లు, చిల్లర వ్యాపారులు కడుపు కొట్టలేదు. – నరసన్నపేటకు చెందిన టీడీపీ నాయకుడు మల్లేష్ వాయిస్ ఇది..‘నేను అడ్మిన్‌ని గ్రూపులో ఫొటోలు ఇన్నేసి ఫొటోలు పెడితే ఎలా. అందుకే తీసేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తంతాను.. ఎవడితో చెప్పుకొంటావో చెప్పుకో.. ఎమ్మెల్యే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచం రా.. ఒరే మల్లేసు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నరసన్న పేట వస్తే తంతా ను. పాతే స్తాను. బోకరువు నువ్వు.. ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచనురా.. ఏమి పీక్కోంటావో పీక్కో..నీకు అంత సీను లేదు. నువ్వు పార్టీకి అవసరం లేదు. నువ్వు అడగడానికి ఎవడివి. నరసన్నపేట రా.. రెండు కాళ్లు పట్టుకొని క్రిందకి తొక్కెస్తా.. బచ్చా గాడవు, నాఇష్టం.. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చి వేషాలు వేయకు.. నరసన్నపేట రా తంతాను. ఎవడు అడుగుతాడు చూస్తాను..’ – నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి సంభాషణ ఇదిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పీఏ గణపతి, స్థానిక టీడీపీ నాయకుడు మల్లేష్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు నోటికొచ్చినట్టు మాట్లాడుకున్నారు. పచ్చిబూతులు తిట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయారు. వారి ‘వ్యవహారాలను’ వారే బయట పెట్టుకున్నారు. ఇందులో బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి ఒక అడుగు ముందుకేసి పాతేస్తాను.. తంతాను...అంటూ దర్పాన్ని చూపించగా, టిఫిన్ కొట్టులపై బ్రోకర్ పని చేశావ్. చిన్నోళ్ల కడుపుకొట్టడం... డబ్బులిచ్చినోళ్లకే పనులు చేశావు. నువ్వు చేసేదేంటి? అంటూ టీడీపీ నాయకుడు మల్లేష్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో చిచ్చు రేపింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
సమయం లేదు మిత్రమా
- వారం రోజుల్లో పీఏ శేఖర్‌ను సాగనంపాల్సిందే - లేకుంటే ఎన్టీఆర్ విగ్రహంవద్ద నిరాహార దీక్ష - విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీసీ, అంబికా హిందూపురం అర్బన్ : ‘‘వారం రోజులే గడువు. బాలకృష్ణ ఎమ్మెల్యే పీఏ శేఖర్‌ను సాగనంపాల్సిందే. లేదంటే హిందూపురం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలకు దిగుతాం’’ అని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం ముక్తకంఠంతో చెప్పారు. సినీనటుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వారం రోజులుగా టీడీపీలో అసమ్మతి సెగలు రేగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) చంద్రశేఖర్ (శేఖర్)ను హిందూపురం నుంచి వారం రోజుల్లోగా తప్పించాలని అసమ్మతి వర్గం అల్టిమేటం ఇచ్చింది. 30 యాక్ట్, 144 సెక్షన్ చిలమత్తూరులో అసమ్మతి నాయకులు ఆదివారం పెద్దఎత్తున సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే పోలీసు అధికారులు 30 యాక్టు, 144 సెక్షన్ అమలు చేయడంతో చిలమత్తూరు సమీపంలోని ఏడో నంబరు జాతీయ రహదారిలో నడుచుకుంటూ కృష్ణారెడ్డి తోటకు చేరుకున్నారు. కానీ అక్కడికీ పోలీసులు చేరుకుని సమావేశాన్ని అడ్డుకున్నారు. అనంతరం బాగేపల్లి సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద సమావేశం నిర్వహిస్తుండగా కర్ణాటక పోలీసులు వచ్చి భగ్నం చేశారు. దీంతో టీడీపీ అసమ్మతి నాయకులు సమావేశ స్థలాలు మూడుసార్లు మార్చుకోవాల్సి వచ్చింది. అడ్డుకోవడం సిగ్గుచేటు అసమ్మతి వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తమ సమావేశాన్ని పోలీసు బలగాలతో అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ‘‘మేం రాడికల్స్ కాదు. దేశద్రోహులు అసలే కాదు. పార్టీకి, ప్రభుత్వానికీ వ్యతిరేకమూ కాదు. కార్యకర్తల సమస్యలు మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశాన్ని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. వారం రోజులు డైడ్‌లైన్ ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ అధిష్టానంపై గౌరవంతో తమ నిర్ణయం (మూకుమ్మడి రాజీనామా) వారం రోజులు వాయిదా వేస్తున్నట్టు అసమ్మతి నేతలు ప్రకటించారు. వారంలోపు పీఏ శేఖర్‌ను సాగనంపకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. -
మిన్నంటిన ‘అసమ్మతి’ రాగం
- బాలకృష్ణ ఇలాకాలో తీవ్రమైన వర్గపోరు - ఎమ్మెల్యే పీఏను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం తీవ్ర ప్రయత్నాలు - ఉనికిని కాపాడుకునేందుకు పీఏ శేఖర్ పాట్లు - ‘తమ్ముళ్ల’ విభేదాలతో టీడీపీ కంచుకోటకు బీటలు హిందూపురం అర్బన్ : టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉంటున్న హిందూపురంలో ‘తమ్ముళ్ల’ మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఒకవైపు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ వర్గీయులు, మరోవైపు అసమ్మతిని లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు, బలనిరూపణలతో ‘పురం’ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వీరి కుమ్ములాటలతో పార్టీ కంచుకోటకు బీటలు కూడా వారాయి. ‘చూడు ఒక వైపే చూడు.. రెండో వైపు చూడొద్దు.. తట్టుకోలేవు’ అని సినిమా డైలాగులతో హూకరించే ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ వైపు చూస్తారోనన్న ఆసక్తి నెలకొంది. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక్కడి పెత్తనమంతా పీఏ శేఖర్‌కు అప్పగించారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన అవినీతికి తెరలేపారని, భారీఎత్తున వసూళ్లు పర్వం కొనసాగిస్తున్నారని అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. పీఏను ఇక్కడి నుంచి పంపించి వేయకపోతే తాము రాజీనామా చేస్తామని అల్టివేటం ఇచ్చారు. అందులో భాగంగానే చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ శనివారం రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా అసమ్మతినాయకులు చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి.. పార్టీ నాయకులను కూడగడుతున్నారు. పోటాపోటీగా బలప్రదర్శన ర్యాలీలు అసమ్మతి నాయకులు నాలుగురోజులుగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ర్యాలీలు చేపట్టారు. ర్యాలీలు, సమావేశాలు చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదని, సస్పెండ్ చేస్తుందని హెచ్చరిస్తూ వచ్చిన పీఏశేఖర్ వర్గీయులు కూడా తమకు బలం ఉందని నిరూపించుకోవడానికి శుక్రవారం లేపాక్షి మండలకేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అయితే.. వందమంది కూడా లేక అభాసుపాలయ్యారు. కొన్ని గ్రామాలకు వాహనాలు పంపినా కార్యకర్తలు రాలేదని సమాచారం. లేపాక్షి నంది విగ్రహం నుంచి మొదలైన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పీఏ శేఖర్, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరుకు చెందిన కొందరు నాయకులు మాత్రమే పాల్గొన్నారు. డప్పు వాయ్యిదాల మధ్య పురవీధుల గుండా వచ్చి ప్రధాన రహదారిలో ఎన్టీరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి.. జోరుగా ప్రసంగాలు చేశారు. పీఏతో పాటు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, ఎంపీపీ హనోక్, నాయకులు నాగరాజు తదితరులు మాట్లాడుతూ అందరూ పార్టీకి విధేయతగా ఉండాలన్నారు. బాలకృష్ణ అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించి.. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. తçక్కువ జనం ఉండడం చూసి తాము ర్యాలీ చేయడానికి రాలేదని, కేవలం ఎమ్మెల్యే పీఏకు స్వాగతించడానికి వచ్చామని చెప్పుకొచ్చారు. చిలమత్తూరులో హైటెన్షన్ చిలమత్తూరులో శనివారం çభారీర్యాలీతో పాటు సమావేశం నిర్వహించి తీరుతామని అసమ్మతి నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, సీసీవెంకటరాముడు తదితరులు చెబుతున్నారు. అవసరమైతే కర్ణాటక సరిహద్దులో చేస్తామంటున్నారు. పోలీసులతో అడ్డుకుంటే నిరహారదీక్షలు చేస్తామని, అరెస్టులు చేస్తే జైలులో కూడా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే.. సమావేశం ఎలా జరుగుతుందో చూస్తామని ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులు సవాల్ చేస్తున్నారు. కాగా.. చిలమత్తూరులో భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. 144సెక్షన్‌తో పాటు 30యాక్ట్ అమలు చేశారు. సభలు, సమావేశాలు చేయరాదని నిషేధాజ్ఞలు జారీ చేశారు.