breaking news
mla k.Srinivasulu
-
చంద్రబాబుకు తిరుగుబాటు తప్పదు: శ్రీనివాసులు
రాష్ట్ర విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రజలు అసహ్యయించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు యాత్రకు ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు శ్రీనివాసులు ఈ ఉదయం నిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా 'సాక్షి' టీవీతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు ప్రజలకు యాత్రలో ఏమని చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాజీనామా చేసి ప్రజలకు వద్దకు వెళ్లాలని సూచించారు. సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన రోజునే చంద్రబాబు యాత్ర చేపట్టనుండడం శోచనీయమని అన్నారు. సమన్యాయం కోసం జగన్ తన ప్రాణాన్ని లెక్కచేయకుండా ఏడు రోజులు నిరాహారదీక్ష చేయడం గర్వకారణమని శ్రీనివాసులు అన్నారు. -
ఆంటోని కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజం ఉండదు
ఎ.కే.ఆంటోని కమిటీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజం ఉండదని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శనివారం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలు అన్ని భూస్థాపితం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రైల్వేకోడూరులో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది. అయితే వైఎస్ఆర్ కడప జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనల హోరు ఉధృతంగా సాగుతోంది. కడప నగరంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రరెడ్డిలతోపాటు అదే జిల్లాలోని రాజంపేటలో స్థానిక ఎమ్మెల్యే ఆమర్నాథ్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షతో ఆరో రోజుకు చేరుకుంది. అలాగే కలెక్టరేట్ ఎదుట వికలాంగుల ఆమరణదీక్షతోపాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.