breaking news
Miss Colombia
-
'ఆమె పేరు చెప్పడం తప్పు.. సారీ'
లాస్ వెగాస్: మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత పేరును మొదట తప్పుగా ప్రకటించినందుకు నిర్వాహకుడు స్టీవ్ హార్వే క్షమాపణలు చెప్పారు. పొరపాటు చేశానని, ఇందుకు చింతిస్తున్నానని హార్వే వివరణ ఇచ్చారు. ఆదివారం రాత్రి జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత పేరును తప్పుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిస్ ఫిలిప్పీన్స్ ఈ కిరీటాన్ని దక్కించుకోగా.. తొలుత కొలంబియా యువతి గుటిరేజ్ గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆమెకు కిరీటాన్ని కూడా తొడిగారు. అంతలోనే నిర్వాహకులు పొరపాటు తెలుసుకుని మిస్ యూనివర్స్ గెలుచుకుంది ఫిలిప్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అని ప్రకటించారు. మిస్ కొలంబియా షాక్కు గురికాగా.. నిర్వాహకులు కిరీటాన్ని వెనక్కి తీసుకొని మిస్ ఫిలిప్పీన్స్ కు తొడిగారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో నిర్వాహకుల తప్పిదం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
మిస్ యూనివర్స్ విజేత ఆమె..కాదు ఈమె!
లాస్ వెగాస్: ఆదివారం రాత్రి ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాలకు చెందిన ముగ్గురు యువతులు తుదిపోటీలో నిలవగా.. మిస్ ఫిలిప్పీన్స్ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. అయితే ఆమెను విజేతగా ప్రకటించే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిస్ యూనివర్స్ కిరీటాన్ని కొలంబియా యువతి గుటిరేజ్ గెలుచుకున్నట్లు నిర్వాహకులు తొలుత ప్రకటించడంతో ఆమెకు కిరీటాన్ని తొడిగారు. నిజంగానే మిస్ యూనివర్స్ టైటిల్ వచ్చిందని భావించి సంతోషంలో ఉన్న గుటిరేజ్కు అంతలోనే షాకిచ్చిన నిర్వాహకులు 'వి ఆర్ రియల్లీ సారీ..' మిస్ యూనివర్స్ గెలుచుకుంది మీరు కాదు ఫిలిప్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అని ప్రకటించారు. దీంతో కొన్ని క్షణాల పాటు మిస్ యూనివర్స్ గా ఉన్న మిస్ కొలంబియా షాక్కు గురైంది. నిర్వాహకులు మిస్ కొలంబియా నుండి కిరీటాన్ని వెనక్కి తీసుకొని మిస్ ఫిలప్పైన్స్ గుటిరేజ్కు తొడిగారు. పొరపాటున మిస్ యూనివర్స్గా ప్రకటించబడ్డ మిస్ కొలంబియా దీనిపై మాట్లాడుతూ 'ఇది నిర్వాహకులు కావాలని చేసిన పొరపాటు కాదు. అలా జరిగిపోయింది. దీని గురించి నేనేం బాధ పడట్లేదు' అని తెలిపింది. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో నిర్వాహకుల తప్పిదం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.