breaking news
mega phone
-
మెగా ఫోన్ పట్టనున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్.. ఆ స్టార్ హీరోతోనే!
సినిమా చాలా పాఠాలు నేర్పుతుంది. అందులో మంచి, చెడు రెండు ఉంటాయి. ఇక సినిమా ద్వారా చాలా నేర్చుకున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాశ్ ఒకరు. ఆయన తమిళంలో కళవాణి, నాణయం, అనేగన్, మారి, నీదానే ఎన్ పొన్వసంతం, తిరుచిట్రఫలం తదితర చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పని చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఛాయాగ్రహకుడిగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషా చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పని చేశారు. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఓం ప్రకాశ్ సుమారు 500 చిత్రాలకు పైగా పని చేశారు. తాజాగా ఓం ప్రకాశ్ మెగాఫోన్ పట్డడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ హీరోగా ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు హీరో ధనుశ్ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనే తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం తన 50వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ధనుష్ తన సోదరి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ నిలావుక్కు ఏన్ ఎన్మేల్ కోపం అనే చిత్రాన్ని స్వీయ దర్శక్వంలో నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ తరువాత ఓం ప్రకాశ్ దర్శకత్వంలో చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. -
అమ్మ దారి!
‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’తో జాతీయ అవార్డు తెచ్చుకున్న బెంగాలీ గుమ్మ కొంకణాసేన్ శర్మా... తన తల్లి అపర్ణాసేన్ బాటలో పయనిస్తోంది. ఇప్పటి వరకు నటనకే పరిమితమైన కొంకణ... ఇక మెగాఫోన్ పట్టి డెరైక్టర్ అవతారం ఎత్తనుందనేది సమాచారం. ఈ బహుభాషా చిత్రానికి కథ, రచన కూడా ఆమే సమకూర్చుకుందట. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా ఎంతో గోప్యంగా జరుగుతుందనేది కోల్‌కతా టైమ్స్ కథనం. విశేషమేమంటే... ఇందులో అమ్మడు నటించడం లేదట! తొలి ప్రాజెక్ట్ కాబట్టి... పూర్తి ఫోకస్ డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌పై పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుందట. ఇందులో అనుభవం లేదు కాబట్టి... బిగ్‌స్క్రీన్‌కు వెళ్లే ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని అనుకుందట కొంకణా. ఎందుకో గానీ... మళ్లీ మనసు మార్చుకుని ‘బిగ్’ ప్రాజెక్ట్‌లోకి దూకేసింది. ప్రస్తుతానికైతే అపర్ణాసేన్ ఇన్వాల్వ్మెంటేమీ లేదు గానీ, అవసరమైతే అమ్మ తనను గైడ్ చేస్తుందంటూ సన్నిహితులతో చెప్పిందట కొంకణ!