అమ్మ దారి! | "Mr. and Mrs. Iyer ' | Sakshi
Sakshi News home page

అమ్మ దారి!

Mar 6 2015 11:46 PM | Updated on Sep 2 2017 10:24 PM

అమ్మ దారి!

అమ్మ దారి!

‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’తో జాతీయ అవార్డు తెచ్చుకున్న బెంగాలీ గుమ్మ కొంకణాసేన్ శర్మా... తన తల్లి అపర్ణాసేన్ బాటలో పయనిస్తోంది.

 ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’తో జాతీయ అవార్డు తెచ్చుకున్న బెంగాలీ గుమ్మ కొంకణాసేన్ శర్మా... తన తల్లి అపర్ణాసేన్ బాటలో పయనిస్తోంది. ఇప్పటి వరకు నటనకే పరిమితమైన కొంకణ... ఇక మెగాఫోన్ పట్టి డెరైక్టర్ అవతారం ఎత్తనుందనేది సమాచారం. ఈ బహుభాషా చిత్రానికి కథ, రచన కూడా ఆమే సమకూర్చుకుందట. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా ఎంతో గోప్యంగా జరుగుతుందనేది కోల్‌కతా టైమ్స్ కథనం. విశేషమేమంటే... ఇందులో అమ్మడు నటించడం లేదట! తొలి ప్రాజెక్ట్ కాబట్టి... పూర్తి ఫోకస్ డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌పై పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుందట.
 
 ఇందులో అనుభవం లేదు కాబట్టి... బిగ్‌స్క్రీన్‌కు వెళ్లే ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని అనుకుందట కొంకణా. ఎందుకో గానీ... మళ్లీ మనసు మార్చుకుని ‘బిగ్’ ప్రాజెక్ట్‌లోకి దూకేసింది. ప్రస్తుతానికైతే అపర్ణాసేన్ ఇన్వాల్వ్‌మెంటేమీ లేదు గానీ, అవసరమైతే అమ్మ తనను గైడ్ చేస్తుందంటూ సన్నిహితులతో చెప్పిందట కొంకణ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement