breaking news
medial seats
-
మెడికల్ పీజీలో లోకల్ కోటా రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో(PG medical quotas) రాష్ట్రాలు స్థానికత ఆధారంగా కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. స్థానిక కోటాను అనుమతిస్తే.. అది అభ్యర్థుల ప్రాథమిక హక్కులను అతిక్రమించడమే అవుతుందని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భాటిల ధర్మాసనం పేర్కొంది. ‘మనందరం భారత్‌లోని ఏదో ఒక ప్రదేశంలో స్థానికులమే. భారతీయ పౌరులం.దేశంలో నివసించే వాళ్లమే. దేశ పౌరులుగా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు మనకుంది. అలాగే దేశంలో ఎక్కడైనా వృత్తి, వ్యాపారాన్ని కొనసాగించే హక్కు ఉంది.అలాగే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని కోరే హక్కును కూడా మనకు రాజ్యాంగం కల్పిస్తోంది. విద్యాసంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కొంతమేరకే పరిమితం. ఆ రాష్ట్రంలో నివసించే వారికే సీట్లు కేటాయించడమనేది సరైనది కాదు. మెడికల్ కాలేజీల్లో(Medical Colleges) కూడా స్థానిక కోటా ఎంబీబీఎస్కే పరిమితం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. పీజీ ప్రవేశాల్లో దేశమంతా ఓపెన్ కేటగిరి కిందకు వస్తుందని స్పష్టం చేసింది. స్పెషలిస్టు డాక్టర్ల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చూస్తే స్థానికత ఆధారంగా రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని పేర్కొంది.ఇలాంటి రిజర్వేషన్లను అనుమతిస్తే అది విద్యార్థుల ప్రాథమిక హక్కులకు భంగకరమని పేర్కొంది. భారత సమాఖ్యలోని మరో రాష్ట్రానికి చెందిన వారని చెప్పి.. వారిని సమానంగా చూడకపోవడం తప్పు. ఆర్టికల్ 14 చెప్పే సమానత్వపు హక్కుకు భంగకరం అని ధర్మాసనం(Supreme Court) తేల్చి చెప్పింది.చట్టం ముందు అందరూ సమానులేననడాన్ని నిరాకరించడం అవుతుందని స్పష్టం చేసింది. అఖిల భారత పరీక్షల్లో రాష్ట్ర కోటా సీట్లు, సంస్థాగత రిజర్వేషన్లు వర్తించే సీట్లు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. చండీగఢ్ ప్రభుత్వ మెడికల్ కాలేజిలో ప్రవేశాలకు సంబంధించి పంజాబ్– హరియాణా హైకోర్టు ఈమేరకు ఇచి్చన తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్థానికత విషయంలో మెడికల్ కాలేజి నిబంధనలు చెల్లవని పంజాబ్– హరియాణా హైకోర్టు తీర్పునిచ్చింది.చండీగఢ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సుల ప్రవేశానికి మార్చి 28, 2019లో అడ్మిషన్లు ప్రారంభించారు. మొత్తం 64 పీజీ సీట్లను రాష్ట్ర కోటా కింద వర్గీకరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌కు స్థానికులైన వారికి లేదా ఇదే కాలేజీలో ఎంబీబీఎస్‌ను పూర్తిచేసిన వారికి ఈ 64 సీట్లను కేటాయిస్తామని నిబంధనలు పెట్టారు. ఈ 64 సీట్లలో సగం.. అంటే 32 సీట్లు అదే కాలేజీలో చదివిన వారికి రిజర్వు చేయడం సబబే అయినా... చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతవాసులకు మిగిలిన 32 సీట్లను కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
నీట్ ఫలితాల వేళ ఏపీ అభ్యర్థుల నెత్తిన పిడుగు
-
పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌కు బ్రేక్
సాక్షి, విజయవాడ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డిప్లొమా మెడికల్ కౌన్సెలింగ్ మూడో రోజు శుక్రవారం అర్ధంతరంగా ఆగిపోయింది. పీజీ సీట్లు కే టాయించేందుకు తయారుచేసిన సీట్ మ్యాట్రిక్స్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఆ తరువాత సీట్ మ్యాట్రిక్స్లో లోపాలు గుర్తించిన అధికారులు కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సీట్లు కేటాయించే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగి జాతీయ రహదారిపై వాహనాలను నిలిపేశారు. తమకు న్యాయం చేయాలంటూ వర్సిటీ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అడ్డుకున్నారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం కౌన్సెలింగ్‌ను రద్దుచేసే దిశగా ఆలోచిస్తున్నామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. శనివారంనాటి కౌన్సెలింగ్ ఆదివారానికి వాయిదావేస్తున్నామని, శనివారం ఒక నిర్ణయం తీసుకుంటామని వీసీ ‘సాక్షి’కి తెలిపారు.