breaking news
Marriage tractor turn
-
పెళ్లి ట్రాక్టర్ బోల్తా : 20 మందికి గాయాలు
కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఉప్పలపాడు వద్ద గురువారం పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... వెల్దుర్తి మండలం కిస్టాపురానికి చెందిన ట్రాక్టర్ కాలువబుగ్గ దేవస్థానంలో జరుగుతున్నపెళ్లికి బయలుదేరింది. ఉప్పలపాడు వద్ద రాగానే ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న 20 మందికి గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకంరగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (ఓర్వకల్) -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా-తల్లీకొడుకు మృతి
నందిపేట: పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడటంతో తల్లి, కొడుకు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన ఎర్రొల్ల చిన్న దేవాయి (45) తన కొడుకు మల్లేష్ (13)తో కలిసి మేనకోడలు పెళ్లికి నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం బంధువులతో కలిసి ట్రాక్టర్లో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ పొలంలో బోల్తా పడడంతో బురదలో కూరుకుపోయిన తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.