breaking news
Manthani Assembly Constituency
-
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్‌గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్‌లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
మంథని నియోజకవర్గంలో అధికారం వహించేది ఎవరు?
మంథని నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంధని నియోజకవర్గం నుంచి నాలుగోసారి విజయం సాదించారు. ఆయన సిటింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మదుపై 16230 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా కాంగ్రెస్ ఓడిపోగా, ఒక్క శ్రీధర్ బాబే గెలవగలిగారు. 2014లో శ్రీధర్ బాబును మదు ఓడిరచగా, 2018లో శ్రీదర్ బాబు పైచేయి సాదించారు. శ్రీదర్ బాబుకు 89045 ఓట్లు రాగా, పుట్టా మధుకు 72815 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అభ్యర్ది కె.నాగార్జున కు 5400 పైగా ఓట్లు వచ్చి, మూడో స్థానంలో ఉన్నారు. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన తండ్రి శ్రీపాదరావుకూడా మంథనినుంచి మూడుసార్లు గెలవగా, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రదాని పివి నరసింహారావు నాలుగుసార్లు గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు మొత్తం పదకుండు సార్లు గెలిచి నట్లయింది. 2014 ఎన్నికలలో దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఈసారి ఓటమిపాలయ్యారు. వరసగా మూడుసార్లు గెలుస్తూ వచ్చిన ఈయన టిఆర్ఎస్ ప్రభంజనానికి ఓటమి పాలు కాక తప్పలేదు. టిఆర్ఎస్ అభ్యర్ధి పుట్ట మధు ఇక్కడ శ్రీధర్ బాబుపై 19360 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మధు అంతకుముందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో ఉండి ఈ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల సమయంలో ఈయన ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. శ్రీధర్‌బాబు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖమంత్రి అయ్యారు. రోశయ్య మంత్రి వర్గంలో కూడా వున్నారు. అనంతరం ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా శ్రీధర్‌బాబు మంత్రిగా కొనసాగారు. టరమ్ చివరిలో కిరణ్‌తో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు 1991 నుంచి నాలుగేళ్లపాటు శాసనసభ స్పీకరుగా పనిచేశారు. ఆయనను నక్సలైట్లు హత్యచేశారు. శ్రీపాదరావు ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసింది కూడా మంధని నియోజకవర్గం కావడం ఒక ప్రత్యేకత. పి.వి. ఇక్కడ నుంచి నాలుగుసార్లు ఎన్నికై, నీలం, కాసు క్యాబినెట్లలో మంత్రిగా, రాష్ట్రముఖ్యమంత్రిగా, ఆ తరువాత కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టారు. మూడు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన నేతగా కూడా ప్రసిద్ధి గాంచారు. మన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని హన్మకొండ, నంద్యాలతోపాటు, మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి, ఒరిస్సాలోని బరంపురం నుంచి కూడా ఆయన లోక్‌సభకు గెలుపొందారు. మంథని నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..