ప్రియాంక చోప్రా నాకు స్ఫూర్తి
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(34) ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడు నటుడు టామ్ హిడిల్ స్టన్ తో కలిసి వేదికను పంచుకొని మరోసారి తళుక్కుమంది. మరోవైపు అమెరికాలోని క్వాంటికో సీరియల్-2 లో నటిస్తూ బిజీగా ఉంది.
ప్రియాంక ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అద్భుతంగా రాణిస్తారని, ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోందని, ఆమె ఎప్పుడూ తనకు చాలా అందంగా కనిపిస్తారని అందుకే ప్రియాంక తనకు ఇన్స్పిరేషన్ అని మరో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో ఎర్రరంగు గౌనులో తళుక్కుమని సినీ విమర్షకుల ప్రశంసలందుకున్నారని ప్రియాంకను ప్రశంసించారు. పరిణీతి ప్రస్తుతం మేరీ ప్యారీ బిందు సినిమాలో నటిస్తున్నారు. తదుపరి సినిమా తకదుమ్ కి సన్నద్ధమవుతున్నానని తెలిపింది. తను మొదటి సారి సినిమాలో పాట పాడబోతున్నానని పరిణీతి వెల్లడించారు.