breaking news
Mahant Avaidyanath
-
అయోధ్యలో రామాలయం కట్టాల్సిందే: వీహెచ్‌పీ
అయోధ్యలో రామాలయాన్ని వీలైనంత త్వరగా కట్టి తీరాల్సిందేనని వీహెచ్‌పీ నాయకుడు అశోక్ సింఘాల్ మరోసారి అన్నారు. బీజేపీ మాజీ ఎంపీ, 'శిలాన్యాసం' మూలపురుషుడు అయిన మహంత్ అవైద్యనాథ్ స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే.. అదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. గోరఖ్‌నాథ్ ఆలయం మాజీ ప్రధాన పూజారి కూడా అయిన మహంత్ అవైద్యనాథ్ స్మారకార్థం ఓ శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. మహంత్జీ ఆశయాల మేరకు ఆలయాన్ని వీలైనంత త్వరగా కట్టాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ సింఘాల్ అన్నారు. దీనిపై విలేకరులు అమిత్ షాను ప్రశ్నించగా, ఆయన మాత్రం నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అవైద్యనాథ్ గొప్ప సంఘ సంస్కర్త అని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. -
‘రామజన్మభూమి’ అవైద్యనాథ్ కన్నుమూత
గోరఖ్‌పూర్(యూపీ): అయోధ్య రామాలయ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మాజీ ఎంపీ మహంత్ అవైద్యనాథ్(95) శుక్రవారం రాత్రి ఇక్కడ అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రి నుంచి శుక్రవారమే గోరఖ్‌పూర్‌కు తీసుకొచ్చారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు సంతాపం ప్రకటించారు. ఆయన దేశభక్తుడని, సంఘసేవకుడని మోడీ కొనియాడారు.