breaking news
Magadha
-
‘చతుర్ముఖ’ వ్యూహాన్ని ఛేదిస్తేనే పీఠమెక్కేది..!
బిహార్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. మరోమారు పట్నా గద్దెనెక్కేందుకు నితీశ్ ఉవి్వళ్లూరుతుంటే ప్రస్తుత ఎన్నికల సంగ్రామంలో ఆయనను పడొగొట్టేందుకు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ వ్యూహాలు రచిస్తున్నారు. సమరంలో ఎవరు గట్టెక్కుతారో నిర్ణయించే గెలుపు వ్యూహాలు మాత్రం రాజధాని పాటలీపుత్రలో కాకుండా రాష్ట్రంలోని నాలుగు విభిన్న ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమీకరణాల్లో దాగి ఉన్నాయి. సీమాంచల్‌లోని మతపరమైన ఓటు బ్యాంకు, మిథిలాంచల్‌లోని ఈబీసీల మద్దతు, మగద్లోని దళిత ఓటర్లు, భోజ్పుర్లోని గ్రామీణ–పట్టణ వ్యత్యాసాలు అనే ఈ 4 అంశాలపైనే అధికార, విపక్ష కూటముల భవిష్యత్ ఆధారపడి ఉంది. నితీశ్ పాలనపై తీర్పుతో పాటు కుల, ప్రాంతీయ అస్తిత్వాల మధ్య జరుగుతున్న ఈ పోరు అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటములకు అసలుసిసలు పరీక్ష పెడుతోంది. కుల సమీకరణాల పునాదులపై జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో, ఎన్డీఏ ‘డబుల్ ఇంజిన్’నినాదం, మహాగఠ్‌బంధన్ ‘సామాజిక న్యాయం’హామీ రెండూ పదునైన అ్రస్తాలే.సీమాంచల్: మహాగఠ్‌బంధన్ కోటలో ‘చీలిక’గండం సీమాంచల్‌లో కిషన్‌గంజ్, అరేరియా, పూరి్నయా, కతిహార్ అనే నాలుగు ఉపప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 28 స్థానాలున్నాయి సీమాంచల్ అనేది బిహార్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతం. కిషన్‌గంజ్‌లో దాదాపు 70 శాతం జనాభా ముస్లింలు కాగా, ఇతర జిల్లాల్లో 35–45 శాతం వరకు ఉంటారు. ఇది సహజంగానే ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి కంచుకోట. ‘ముస్లిం –యాదవ్’సమీకరణంలో ‘ముస్లిం’ఓటు బ్యాంకు ఇక్కడ అత్యంత బలంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలను గెలుచుకుని, మహాగఠ్‌బంధన్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈసారి 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహాగఠ్‌బంధన్ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీని ఓడించాలంటే తమ కూటమికి పడే ఓట్లు చీలకుండా కాపాడుకోవాలని మహాగఠ్‌బంధన్ చూస్తోంది. ఎంఐఎం అనేది బీజేపీ ‘బీ–టీమ్’అని, ఓట్లు చీల్చడానికే వచ్చిందని ప్రచారం చేస్తూ, తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మహాగఠ్‌బంధన్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎన్డీఏ పూర్తిగా మహాగఠ్‌బంధన్ ఓట్లు ఎంత ఎక్కువగా చీలితే తమకు అంత లాభం చేకూరుతుందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు గాలమేస్తోంది. మిథిలాంచల్: నితీశ్‌కు అసలు సిసలు అగ్నిపరీక్ష మిథిలాంచల్‌లో ప్రధానంగా దర్భంగా, మధుబని, సమస్తిపూర్, సహర్సా, సుపాల్, మధేపుర ప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 50–60 స్థానాలున్నాయి. ఇది అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణాలున్న ప్రాంతం. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు (బీజేపీ ఓటు బ్యాంకు), యాదవులు (ఆర్జేడీ బలం) ఇక్కడ బలంగా ఉన్నారు. అయితే, ఫలితాలను శాసించేది మాత్రం ఈబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు). మల్లా, టెలీ, ధానుక్ వంటి అనేక చిన్న కులాలు సీఎం నితీశ్ కుమార్‌కు అండగా నిలుస్తున్నాయి. అయితే ‘సన్ ఆఫ్ మల్లా‘గా పిలుచుకునే ముఖేశ్ సహానీకి నిషాద్ కమ్యూనిటీపై గట్టి పట్టుంది. ఈయన ప్రస్తుతం మహాగఠ్‌బంధన్ కూటమిలో ఉండటం వారికి కలిసి రానుంది. ఈ ప్రాంతంలో ఎన్డీఏ తన సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా ఈబీసీలను కలుపుతోంది. నితీశ్‌ను ముందు నిలిపి ఈబీసీ ఓట్లను, అగ్రవర్ణాల ఓట్లను కొల్లగొట్టాలని ఎన్డీఏ ఆశపడుతోంది. ఈ కూటమి 2020లో మెరుగైన ప్రదర్శన చేసి 34 సీట్లు గెలుచుకుంది. మహాగఠ్‌బంధన్ మాత్రం ’సహానీ’తో ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టే ప్లాన్ చేస్తోంది. ముస్లిం, యాదవ్‌లతోపాటు ఈసారి మల్లాలను, వామపక్ష పారీ్టలకు దగ్గరగా ఉన్న శ్రామిక వర్గాలను ఏకం చేయాలని విపక్షపారీ్టలు ఆశిస్తున్నాయి. నితీశ్‌పై ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఈబీసీ ఓట్లను తమ వైపు తిప్పుతుందని మహాగఠ్‌బంధన్ గట్టిగా నమ్ముతోంది. ఇది నితీశ్ విశ్వసనీయతకు అసలైన పరీక్ష.మగధ్: ‘లెఫ్ట్’జోరుకు కళ్లెం! మగధ్ ప్రాంతంలో గయా, జెహానాబాద్, ఔరంగాబాద్, నవాడా, అర్వాల్ అనేవి ముఖ్యమైనవి. ఇక్కడ సుమారు 28 స్థానాలున్నాయి. మగధ్ ప్రాంతం ఆర్జేడీ, వామపక్షాలకు కంచుకోట. ఇక్కడ యాదవులు, దళితులు/మహాదళితులు (ముసహర్, పాశ్వాన్), భూమిహార్ల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. 2020లో ఎన్డీఏ ఇక్కడ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ప్రాంతంలోని 26 స్థానాల్లో మహాగఠ్‌బంధన్(ముఖ్యంగా ఆర్జేడీ, సీపీఐ –ఎంఎల్) ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్డీఏలోని జితన్ రాం మాంఝీ (హెచ్ఏఎం పారీ్ట), చిరాగ్ పాశ్వాన్ (లోక్‌జనశక్తి– పాశ్వాన్) గత కొంతకాలంగా బలాన్ని పుంజుకుంటున్నారు. ఈ దళిత మిత్రుల సాయంతో 2020 నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుంది. గయా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మాంఝీ (ముసహర్ నేత), చిరాగ్ పాశ్వాన్ (పాశ్వాన్ నేత) ద్వారా విపక్షాల దళిత ఓటు బ్యాంకును చీల్చాలని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. మహాగఠ్‌బంధన్ మాత్రం ‘ఆర్జేడీ (యాదవ్), సీపీఐ–ఎంఎల్ (అణగారిన వర్గాలు/దళితులు) అనే విజయవంతమైన ఫార్ములాను నమ్ముకుంది. ఈసారి కూడా తమను అదే ఫార్ములా విజయతీరాలకు చేర్చనుందని బలంగా నమ్ముతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మగధ్ ప్రాంతంలో తప్పనిసరిగా మోదీ మ్యాజిక్ పనిచేయాల్సిందే. 2020లో గెలిచిన ఆరు సీట్లను పెంచుకుని ఈసారి కనీసం 15 సీట్లలో విజయపతాక ఎగరేస్తేనే అధికారంపై ఆశలు బలపడతాయి.భోజ్‌పూర్: నగరాలపై ‘కమలం’ఆశ భోజ్‌పూర్ పరిధిలో పట్నా, భోజ్‌పుర్(ఆరా), రోహ్తాస్, బక్సర్, కైమూర్ ప్రాంతాలున్నాయి. ఇక్కడ మొత్తంగా దాదాపు 46 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాజ్‌పుత్‌ల గడ్డగా పిలుస్తారు. అగ్రవర్ణాలలో రాజ్‌పుత్‌ల ఆధిపత్యం ఎక్కువ. ఆర్జేడీకి మద్దతుగా నిలబడే యాదవ్, జేడీయూకు మద్దతుగా నిలిచే కుర్మీ–కోయిరీల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. పటా్నలోని పట్టణ ఓటర్లు (కాయస్థులు, బనియాలు) బీజేపీకి మద్దతునిస్తున్నారు. 2020లో మగధ్ లాగే భోజ్‌పుర్ గ్రామీణ ప్రాంతాల్లో మహాగఠ్‌బంధన్ అద్భుతమైన ప్రదర్శన చేసి 43 స్థానాలకు గాను ఏకంగా 30 చోట్ల విజయం సాధించడం విశేషం. ఇక్కడ పట్టు సాధించేందుకు ఎన్డీఏ పట్టణ ఓటును, అగ్రవర్ణాలను ఏకీకరణ చేస్తూనే ఈబీసీ, ఓబీసీలను కలుపుకుపోయే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. మహాగఠ్‌బంధన్ మాత్రం గ్రామీణ పట్టు నిలుపుకునే యత్నం చేస్తోంది. ఈ చతుర్ముక పోరులో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే ఫలితాల వెల్లడిదాకా ఆగక తప్పదు. -
ఈ ప్రొఫెసర్లు బిహార్ పరువు తీశారు!
పాట్నా : పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపియింగ్‌కు బిహార్ పెట్టింది పేరు. అక్కడ పరీక్షలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది అయితే, ఆ రాష్ట్రం మాస్ కాపియింగ్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. అయితే, తాజాగా వెలుగు చూసిన అంశాల ప్రకారం అక్కడ విద్యావ్యవస్థే అంత దారుణంగా ఉందని, సరిగ్గా పాఠాలు చెప్పే గురువులే కరువయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా నైపుణ్యం లేని గురువులు, విషయ సంబంధ జ్ఞానం లేనివారు ఉన్నారని బయటపడింది. ఇంకా చెప్పాలంటే ముగ్గురు గణిత ప్రొఫెసర్లు బిహార్ విద్యావ్యవస్థ పరువు తీసినంత పనిచేశారు. ఇటీవల తమకు గణితానికి సంబంధించిన ప్రొఫెసర్ కావాలంటూ బిహార్‌లో ప్రముఖ యూనివర్సిటీ అయిన 'మగద' ప్రకటన ఇచ్చింది. అంతకంటే ముందు తమ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లను పరీక్షించాలని అనుకుంది. వారి ముగ్గురుని పిలిచి సెలక్ట్ కమిటీ ముందు పరీక్షించగా కనీసం వారు తొమ్మిదో తరగతి లెక్కలు కూడా చేయలేకపోయారు. ఇక ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ట్రయాంగిల్ స్పెల్లింగ్‌ను ట్రాంగల్గా మార్చి చెప్పారు. మరో అసోసియేట్ ప్రొఫెసర్ కాస్త పర్వాలేదనిపించారు. దీనిపై వీసీ ప్రొఫెసర్ ఖమర్ అహసన్ స్పందించేందుకు నిరాకరించారు. కాగా, అంతకుముందు నిర్వహించిన ఇంటర్వ్యూలను వీడియో తీసి సిండికేట్ ముందుకు సీల్డ్ కవర్లో తీసుకెళ్లారు. ఆ ప్రొఫెసర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అక్కడి వారంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. -
నేతన్నలను ఆదుకోవడంలో విఫలం
హామీలన్నిటినీ చంద్రబాబు మగ్గం గుంతలో పాతిపెట్టేశారు! సంక్షేమ పథకాలను ఆపేసి కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యారు సెప్టెంబర్ 8వ తేదీలోపు ముడిపట్టు రాయితీ బకాయిలు మొత్తం చెల్లించాలి చేనేత ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం (ధర్మవరం టౌన్): సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్నికల హామీలతోపాటు చేనేత దినోత్సవం రోజున నేతన్నలకు ఇచ్చిన హామీలను సైతం మగ్గం గుంతలో పాతిపెట్టారని విమర్శించారు. చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన ముడిపట్టురాయితీ బకాయిలు చెల్లించాలంటూ కాంగ్రెస్, సీపీఐ, సీసీఎం, ఆమ్ ఆద్మీ నాయకులతో కలసి ధర్మవరంలోని సెరిఫెడ్ కార్యాలయం ఎదుట వేలాదిమంది చేనేత కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు ఆయన నివాసం వద్దనుంచి సెరిఫెడ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో గత ఏడాది చేనేత దినోత్సవం రోజున చేనేత కార్మికులకు ముడిపట్టు రాయితీని రూ.600 నుంచి రూ.1,000 పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. పెంచిన ముడిపట్టు రాయితీ మొత్తాన్ని నెలనెలా కార్మికుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉందన్నారు. అయితే ఆరు నెలలుగా జమ చేయడం లేదన్నారు. ముడిపట్టు రాయితీ రూ.600 చొప్పున 12 నెలల బకాయిలు, రూ.1,000 చొప్పున ఆరు నెలల బకాయిలు మొత్తం రూ. 17.48 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ మొత్తాన్ని విడుదల చేసి ఉంటే స్థానిక టీడీపీ నాయకుల జేబుల్లోకి చేరిందా.. లేక విడుదల చేయకుండా చంద్రబాబు చేనేతలను మోసం చేస్తున్నారా.. అనేది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత నిర్వీర్యానికి కుట్ర చేనేత వ్యవస్థను నమ్ముకుని జిల్లాలో 5 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని, వ్యవసాయం తరువాత అధిక సంఖ్యాకులు ఆధారపడి జీవిస్తున్న రంగాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేతిరెడ్డి మండిపడ్డారు. అప్పటి దాకా అమలవుతున్న లాంబార్డ్ స్కీంను ఎత్తివేశారని, కమీషన్ల పంపిణీలో తేడాలు వచ్చి ఎన్‌హెచ్‌డీసీ పథకానికి మంగళం పాడారని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చకపోగా.. ఉన్న సంక్షేమ పథకాలు నిలిపివేసి నేతన్నల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని దుయ్యబట్టారు. చేనేతలపై కేంద్రం జీఎస్టీ భారం మోపితే ఏ ఒక్క టీడీపీ నాయకుడూ నోరుమెదపలేదన్నారు. సెప్టెంబర్ 8వ తేదీలోపు పెండింగ్ బకాయిలు మొత్తం చేనేత కార్మికుల ఖాతాల్లోకి జమచేయకపోతే అందోళన చేపడతామన్నారు. వారికి న్యాయం జరిగే వరకు ఆఫీస్ ఎదుటే దీక్షలు చేస్తామన్నారు. అనంతరం ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పోలా రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జింకాచలపతి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రంగన అశ్వర్థనారాయణలు మాట్లాడుతూ దేశంలోనే చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలలో ఏపీని అగ్రగామిగా నిలుపుతున్నారని ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. అనంతరం ఓఎస్డీ అచ్చన్నకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు గిర్రాజు నగేష్, చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బీరే ఎర్రిస్వామి, పట్టణ కార్యదర్శి జింకా కంబగిరి, రైతు సంఘం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, వైఎస్సార్సీపీ నాయకులు గడ్డం కుళ్లాయప్ప, చందమూరి నారాయణరెడ్డి, బీరే జయచంద్ర, గుర్రం రాజ, లాయర్, కిష్టయ్య, యుగంధర్, శంకర తేజ, బాలం గోపాల్, బడిమెల మూర్తి, గాజుల శంకర్, శీలా రాయుడు, డోల్ సత్తి, యల్లయ్య, జీఆర్ రామ్మోహన్, కొళ్లమోరం చంద్రశేఖరరెడ్డి, జింకా రాఘవేంద్ర, శంకర్, సత్తి, తొండమల రవి, పురుషోత్తంరెడ్డి, మేడాపురం వెంకటేష్, కుమారస్వామి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. -
కురుక్షేత్ర సభపై నిఘా
♦ ఎక్కడికక్కడే ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్టు చేసేందుకు సన్నద్ధం ♦ ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ♦ వివరాలు గోప్యంగా ఉంచుతున్న వైనం ♦ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ఏఎన్‌యూ పట్నంబజారు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నేడు తలపెట్టిన మాదిగ కురుక్షేత్ర మహాసభకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గుంటూరు నగరంతోపాటు అనేక ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారమే హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చిన జాతీయ కళాకారుల బృందానికి చెందిన ఆరుగురిని గుంటూరు నగరంలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంచినట్లు తెలిసింది. ఎమ్మార్పీఎస్ నేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), ఇంటిలిజెన్స్, కౌంటర్ ఇంటిలిజెన్స్, కిక్‌రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ) బృందాలను రంగంలో దింపినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి నుంచి సభా సమయం ముగిసే వరకు ఎమ్మార్పీఎస్ ముఖ్యనేతలను నిలువరించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్ నాయకులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణం వద్ద పోలీసు బలగాలు అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏపీఎస్పీ బెటాలియన్, ఆర్మ్డ్ రిజర్వుడుతోపాటు ఆయా స్టేషన్లకు చెందిన అధికారులు, వెయ్యి మందికిపైగా పోలీసులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ప్రతి వ్యక్తీ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సభా ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లను గురువారం గుంటూరు రేంజ్ డీఐజీ కే.వీ.వీ.గోపాలరావు, అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయారావు, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు పర్యవేక్షించారు. రాత్రి సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పోలీసుల బలగాలకు యూనివర్సిటీతోపాటు, పరిసర ప్రాంతాల్లో వసతి కల్పించారు.


