breaking news
Lotus
-
చలికి ఏమాత్రం చలించని.. ‘కలువ రహస్యాలు’
చలికాలంలో మనమంతా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు స్వెట్లర్లు, హీటర్లు లాంటివాటిని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కలు చలికాలంలో వెచ్చిదనం కోసం ఏం చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బయట భారీగా మంచు కురుస్తూ, చలి గాలి వణికిస్తున్న సమయంలో కొన్ని మొక్కలు తమ లోపల 35° సెంటీగ్రేడ్ వరకు వేడిని పుట్టించుకుంటాయి. ఇదే మాదిరిగా ఒక పుష్పం చలి కాలంలో రాత్రి వేళ కీటకాలకు వెచ్చని ‘లగ్జరీ రూమ్’లా మారుతుంది. కమల పుష్పం మొదలుకొని ‘డెడ్ హార్స్ లిల్లీ’ వరకు.. ఇవన్నీ తమ గర్భంలో అద్భుతమైన ‘థర్మోజెనిసిస్’ రహస్యాలను దాచుకున్నాయి. దీనిపై ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైన వివరాలు శాస్త్రవేత్తలను సైతం తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి.థర్మోజెనిసిస్ అంటే..శీతాకాలంలో పక్షులు, జంతువులు చలిని తట్టుకునేందుకు ప్రకృతి వాటికి అనువైన శరీర ఆకృతిని ఇచ్చిందని మనం ఎక్కడో చదివేవుంటాం. అయితే మొక్కలు కూడా తమ శరీర ఉష్ణోగ్రతను పెంచుకోగలవు అనే విషయం మీకు తెలుసా? దీనిని ‘థర్మోజెనిసిస్’ అంటారు. కణాలలోని మైటోకాండ్రియా ఆహారాన్ని ఏటీపీగా మార్చే క్రమంలో కొంత శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది. అయితే ‘ఆల్టర్నేటివ్ ఆక్సిడేస్’ అనే ఎంజైమ్ సాయంతో కొన్ని ప్రత్యేక మొక్కలు చక్కెరల నుండి నేరుగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఉత్తర, మధ్య భారతదేశపు సరస్సుల్లో పెరిగే కమల పుష్పం ఇందుకు ఒక అద్భుత ఉదాహరణగా నిలిచింది.బయటి ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా..వేసవి కాలం ప్రారంభంలో వికసించే కమలం మూడు, నాలుగు రోజుల పాటు వికసించి ఉంటుంది. బయట ఉష్ణోగ్రత 10°C కి పడిపోయినా, దాని లోపల మాత్రం 30-35°C వేడి నిరంతరం కొనసాగుతుంది. పుష్పం రేకుల కొనలు పింక్ రంగులోకి మారినప్పుడు ఈ వేడి పుట్టడం మొదలవుతుంది. ఈ ఉష్ణోగ్రత ఆ పుష్పం నుంచి సుగంధం వెదజల్లడానికి తోడ్పడుతుంది. దీనివల్ల కీటకాలు ఆకర్షితమై, పరాగసంపర్కం సులభతరం అవుతుంది.కీటకాలకు వెచ్చని గదిలా..కమలంలోని మధ్య భాగంలో పిస్టిల్స్ తొలుత పరిపక్వం చెందుతాయి. పుష్టంలోని వేడికి ఆకర్షితమైన తేనెటీగలు, తుమ్మెదలు దాని లోపలికి చేరుకుంటాయి. మధ్యాహ్నం వేళ పుష్పం రేకులు మూసుకుపోతాయి. కీటకాలకు రాత్రి పూట ఒక వెచ్చని గదిలా రక్షణ కల్పిస్తాయి. మరుసటి రోజు ఉదయం పువ్వు వికసించే సమయానికి పుప్పొడి సిద్ధమవుతుంది. కీటకాలు ఈ పుప్పొడిని అద్దుకుని వేరే మొక్కలకు వెళ్లడం ద్వారా ‘క్రాస్ పాలినేషన్’ జరుగుతుంది. ఇది మొక్కల జన్యు వైవిధ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కాల్షియం అయాన్ల మ్యాజిక్మొక్కలో ఇలా ఉష్ణోగ్రత పెరగడానికి కాల్షియం అయాన్లు ఒక ‘ఆన్ స్విచ్’లా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. వేడి సమయంలో కణాలలోని కాల్షియం స్థాయి నాలుగు రెట్లు పెరుగుతుంది. ఇది మైటోకాండ్రియాను వేగంగా పనిచేయమని సిగ్నల్ ఇస్తుంది. ఈ ప్రక్రియలో మొక్కలో నిల్వ ఉన్న స్టార్చ్, కొవ్వు పదార్థాలు పెద్ద మొత్తంలో వినియోగమై, వేడిని ఉత్పత్తి చేస్తాయి. పుష్పంలోని ఇతర భాగాల కంటే పిస్టిల్స్ ఉన్న పైభాగం 4-5°C ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది.మంచును సైతం కరిగిస్తూ..ఉత్తర అమెరికాలో పెరిగే ‘ఈస్టర్న్ స్కంక్ క్యాబేజీ’ మరో అడుగు ముందుకేసి, మంచును సైతం కరిగించేస్తుంది. వసంతకాలం ఆరంభంలో ఇది మంచు పొరలను చీల్చుకుని పైకి రావడానికి వేడిని పుట్టిస్తుంది. దీని నుండి వచ్చే గాఢమైన వాసన వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బీటిల్ పురుగులు మంచు కురిసే సమయంలో ఈ పువ్వు ఇచ్చే వెచ్చదనం కోసం చేరుకుంటాయి.కుళ్లిన వాసనతో ఆకట్టుకుంటూ..సార్డీనియాలో కనిపించే ‘డెడ్ హార్స్ ఏరమ్ లిల్లీ’ కథ మరింత విభిన్నం. ఇది వేడిని ఉపయోగించి ఒక రకమైన కుళ్లిన వాసనను (డైమిథైల్ డైసల్ఫైడ్) విరజిమ్ముతుంది. ఇది కుళ్లిన మాంసం వాసనను పోలి ఉంటుంది. మాంసం కోసం వెతికే ‘బ్లోఫ్లైస్’ ఈ వాసనకు ఆకర్షితమై తండోపతండాలుగా వస్తాయి. ఈ విధంగా ప్రకృతిలో భాగమైన మొక్కలు తమ మనుగడ కోసం, పరాగసంపర్కం కోసం ఉష్ణోగ్రతను ఒక ఆయుధంగా వాడుకోవడం నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: Bangladesh: మోగిన ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 12న పోలింగ్ -
లోటస్ కాన్సెప్ట్.. మెరుపు వేగంతో దూసుకెళ్లే సూపర్ కారు (ఫోటోలు)
-
లోటస్ స్టేటస్! ఈ వైపు ఓ లుక్ వేయండి..
ఎక్కువ హంగామా లేకుండా ఇంటికి కళ తెచ్చేది పూల అలంకరణే! అలాగని రోజూ తాజా పువ్వులకు తూగలేం కదా! అందుకే ఈ లోటస్ ఫ్రేమ్ వైపు ఓ లుక్ వేయండి.. దాంతో ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించవచ్చు!తామర పువ్వుల గుచ్ఛంతో ఉన్న ఫ్రేమ్స్, లోటస్ పెయింటింగ్‌ని లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లలో అలంకరించవచ్చు. వీటివల్ల ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా అనిపిస్తుంది.సూర్యోదయం వెలుగులో అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వుల అందం ఇంటి వాతావరణాన్ని వైబ్రెంట్‌గా మారుస్తుంది. గోవుతో కలసి ఉన్న తామర పువ్వుల వాల్ పేపర్స్‌ను పూజ గది, పార్టిషన్స్కు ఉపయోగించవచ్చు.హంగు, ఆర్భాటాలు అక్కర్లేదనుకునేవారు లోటస్ క్యాండిల్ ఏర్పాటుతో ఇంటి శోభను పెంచుకోవచ్చు.లోటస్ థీమ్‌తో ఉన్న కుషన్ కవర్స్‌ను ఎంచుకుంటే గదికి అలంకరణ.. మనసుకు ఆహ్లాదం చేకూరుతాయి.వందల రూపాయల నుంచి లభించే రకరకాల లోటస్ డిజైన్స్‌ను మీ అభిరుచికి తగ్గట్టు ఎంచుకుని, ఇలా డెకరేషన్లో భాగం చేసి ఇంటి స్టేటస్‌నే మార్చేసుకోవచ్చు! -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్‌కు భారత్‌లో అ«దీకృత సంస్థగా ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు
న్యూఢిల్లీ: చాకొలెట్లు, కోకోవా ప్రొడక్టుల కంపెనీ లోటస్ చాకొలెట్స్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా పేర్కొంది. 51 శాతం వాటా కొనుగోలుని తాజాగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ లోటస్ చాకొలెట్స్‌లో నియంత్రిత వాటా కొనుగోలు చేయనున్నట్లు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించింది. ఈ బాటలో అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ నెల 24కల్లా లోటస్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలియజేసింది. షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రకారం లోటస్‌లో మొత్తం 77 శాతం వాటాను రిలయన్స్ కన్జూమర్ కొనుగోలు చేయనుంది. ప్రమోటర్లు ప్రకాష్ పి.పాయ్, అనంత్ పి.పాయ్ నుంచి 51 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 113 చొప్పున రూ. 74 కోట్లు వెచ్చించింది. సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇదీ చదవండి: 5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు.. -
అంబానీ చేతికి హైదరాబాద్ కంపెనీ, లోటస్ చాకొలెట్లో రిలయన్స్ మరింత వాటా
న్యూఢిల్లీ: లోటస్ చాకొలెట్లో మరో 26 శాతం వాటా కొనుగోలుకి రిలయన్స్ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఓపెన్ ఆఫర్ ప్రకటించాయి. లోటస్ చాకొలెట్ వాటాదారుల నుంచి ఈ వాటాను సొంతం చేసుకునేందుకు ఓపెన్ ఆఫర్ చేపట్టనున్నట్లు తెలియజేశాయి. ఇందుకు షేరుకి రూ. 115.5 ధరను నిర్ణయించినట్లు 2 సంస్థల తరఫున ఆఫర్‌ను చేపట్టనున్న డీఏఎం క్యాపిటల్ తెలియజేసింది. తద్వారా 33.38 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. పూర్తి వాటాకు రూ. 38.56 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఓపెన్ ఆఫర్ ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 6న ముగియనున్నట్లు పబ్లిక్ నోటీస్ ద్వారా తెలియజేసింది. 3 నెలల గరిష్టం రిలయన్స్ సంస్థలు కన్నేయడంతో లోటస్ చాకొలెట్ షేరు బీఎస్ఈలో గురువారం రూ. 149ను దాటి ముగిసింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. శుక్రవారం(6న) సైతం షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 157 సమీపంలో నిలిచింది. కంపెనీ చాకొలెట్లు, కోకోవా ప్రొడక్టులు, డెరివేటివ్స్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ కన్జూమర్.. రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీ విభాగంకాగా.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీలివి. లోటస్ చాకొలెట్లో గత వారమే రిలయన్స్ కన్జూమర్ ప్రమోటర్ల నుంచి 51 శాతం వాటాను చేజిక్కించుకుంది. -
రిలయన్స్ చేతికి లోటస్ చాకొలేట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చాకొలేట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన లోటస్ చాకొలేట్ కంపెనీలో రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ 51 శాతం వాటా తీసుకోనుంది. అలాగే మరో 26 శాతం వరకు వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్టు రిలయన్స్ గురువారం వెల్లడించింది. లోటస్ ప్రమోటర్లు ప్రకాశ్ పి పాయ్, అనంత్ పి పాయ్, ఇతరులతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. 51 శాతం వాటాకు సమానమైన 65,48,935 షేర్లను ఒక్కొక్కటి రూ.113 చొప్పున మొత్తం రూ.74 కోట్లు చెల్లించి దక్కించుకోనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్, లోటస్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ.10 ముఖ విలువ కలిగిన 5,07,93,200 నాన్ క్యుములేటివ్ రెడీమేబుల్ ప్రిఫరెన్స్ షేర్లను సబ్‌స్క్రైబ్ చేసుకుంటాయి. వీటి ద్వారా వచ్చే నిధులను కంపెనీ వృద్ధికి వినియోగించనున్నారు. ప్రముఖ సినీ నటి టి.శారద, ఇంజనీర్ ఎన్.విజయరాఘవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సమీపంలోని దౌలతాబాద్ వద్ద కోకో ప్రాసెసింగ్, చాకొలేట్ తయారీ కేంద్రం 1992లో ప్రారంభం అయింది. ఈ కంపెనీ 2008లో పజ్జొలానా గ్రూప్ పరమైంది. -
Lotus: కుండీల్లో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేలు
కొలనుల్లో తామరలు సూర్య నమస్కారాలు చేస్తాయి. దొరువుల్లో కలువలు చంద్రునికి మోహలేఖలు రాస్తాయి. కాని అవి పాత రోజులు. ఇప్పుడు ఇళ్లల్లో అలంకరణ కోసం తామరలు కొని నీటి తొట్లలో వదులుతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? కేరళలో అంజలి లాంటి స్త్రీలు కుండీల్లో, ప్లాస్టిక్ తొట్లలో తామరలను పెంచి అమ్ముతున్నారు. దాదాపు 40 రకాల తామరలు ఉన్నాయి. 300 నుంచి ఒక్కో పువ్వు 4000 రూపాయల వరకూ పలుకుతాయి. నెలకు 30 నుంచి 50 వేలు సంపాదిస్తూ ఉంది అంజలి. కోవిడ్ వల్ల ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా అది అంజలికి తామరలు కూడా పూయించింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 28 ఏళ్ల అంజలిని చూడండి. కోవిడ్ కాలంలో భర్తకు సంపాదన పోవడంతో తామరలను నమ్ముకుంది. ముందు మిద్దె మీద పెంచింది. ఆదాయం బాగుండటంతో ఇప్పుడు 20 సెంట్ల భూమి సంపాదించి అక్కడ తామరలు పెంచుతోంది. అన్నీ కుండీల్లోనే. లేకుంటే ప్లాస్టిక్ టబ్బుల్లో. దీనిని ‘నీటి తోట’ అనొచ్చు. నీటి మొక్క తామర. దీనితో పాటు కలువ. అంజలి జీవితం ఇప్పుడు మూడు కలువలు ఆరు తామరలుగా సాగిపోతోంది. వేసిన 15 రోజులకే పూస్తుంది ‘ముందు నాటు రకం తామరలు పెంచాను. అవి ఏడాదికి కాని పూలు పూయవు. ఇలా కాదని హైబ్రిడ్ తామరలను పెంచడం నేర్చాను. కొన్ని హైబ్రిడ్ తామర మొక్కలు నెలకే పూస్తాయి. వీటిని థాయ్‌లాండ్ వాళ్లు డెవలప్ చేశారు. అమిరి కెమిలియా అనే తామర రకం ఉంది. అదైతే వేసిన 15 రోజులకే పూస్తుంది. ఇప్పుడు నా తామర సాగులో దాదాపు 40 రకాలు ఉన్నాయి’ అంటుంది అంజలి. ఆమెకు పూలు పూయించడంతో పాటు ప్రచారం చేయడం కూడా వచ్చు. ఫేస్బుక్లో, ఇన్‌స్టాలో ఆ తామర మొక్కలు, పూలు ఫోటోలు పెడుతుంది. మొదట కేరళ నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘తామరలు దుంపవేరు నుంచి వస్తాయి. దుంపవేర్లు కొనేవాళ్లు ఉంటారు. కాని వాటిని పెంచడం తెలియాలి. కొందరు నేరుగా మొక్కలు కొంటారు. అవి కొన్న తర్వాత పది రోజులకు మించి బతకవు. అందుకని వెంటనే వాడుకోవాల్సి ఉంటుంది. కొందరు ఒట్టి పూలే కొంటారు’ అంటుంది అంజలి. రూ. 4000 పెడతారు కూడా! నాటు తామరలకు రెక్కలు తక్కువ ఉంటాయి. హైబ్రిడ్ తామరలకు రెక్కలు ఎక్కువ. ‘మిరకిల్’ అనే వెరైటీలో పువ్వుకు 700 రెక్కలు ఉంటాయి. ఇక సహస్రదళపద్మానికి డిమాండ్ జాస్తి. దీనిలో వేయి రెక్కలు ఉంటాయి. ‘బుద్ధ పద్మం’, ‘దుర్గపద్మం’ అని చాలా రకాలే ఉన్నాయి. ‘పసుపు రంగు తామరలకు బాగా గిరాకీ ఉంది. ఒక్కో మొక్కకు రూ. 4000 పెట్టడానికి కూడా సిద్ధమవుతారు’ అంటుంది అంజలి. నెలకు యాభైవేల వరకు సంపాదన ఆమె దగ్గర పూలు, దుంపవేర్లు, మొక్కలు రకాన్ని బట్టి 300 నుంచి మొదలవుతాయి. నెలకు అన్ని రకాలూ 100 పూల వరకూ అమ్ముతుంది. అన్నీ కుదిరితే 50 వేలు కూడా సంపాదిస్తుంది. వీటితోపాటు కలువలు కూడా సాగు చేస్తుంది. వాటి మీద ఆదాయం కూడా బాగుంది. ‘మొక్కలను జాగ్రత్తగా చూడాలి. తామరకు బాగా ఎండ తగలాలి. నీటి కుండీల్లో దోమలు చేరకుండా గుప్పీ చేపలను వదిలితే మంచిది’ అంటుంది అంజలి. తన దగ్గర మొక్కలు కొన్నవారికి వాటిని ఎలా సంరక్షించాలో చెబుతుంది. ఇప్పుడు శ్రీమంతులే కాదు మధ్యతరగతి వారు కూడా ఇంటి ముంగిలిలో ఒక తామరతావును లేదా పూలను అలంకరించడానికి ఇష్టపడుతున్నారు. ఈ సాగు నేర్చితే మహిళలు ఇంటి దగ్గరి నుంచే ఆదాయం గడించవచ్చు. చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
Recipe: చపాతీలోకి తామర పువ్వు కాడతో రుచికరమైన వంటకం!
తామరపువ్వు కాడలతో ఘుమఘుమలాడే కశ్మీరీ వంటకం నద్రు యఖని. ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకుని సరికొత్త రుచులను ఆస్వాదించండి. కావలసినవి: ►తామరపువ్వు కాడలు – నాలుగు ►పెరుగు – రెండు కప్పులు ►శనగపిండి – టేబుల్ స్పూను ►సోంపు పొడి – టీస్పూను ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►బిర్యానీ ఆకులు – రెండు ►నల్ల యాలక్కాయలు – రెండు ►సాధారణ యాలక్కాయలు – రెండు ►జీలకర్ర – టీస్పూను ►లవంగాలు – రెండు ►ఇంగువ – పావు టీస్పూను ►గరం మసాలా – టీస్పూను ►నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు. తయారీ.. ►ముందుగా తామరపువ్వు కాడల తొక్కతీసి శుభ్రంగా కడగాలి. ►తరువాత సన్నని ముక్కలుగా తరగాలి. ►తరిగిన ముక్కల్లో కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో పెరుగు, శనగపిండి ముప్పావు కప్పు నీళ్లు పోసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్నీ పదినిమిషాలపాటు సన్నని మంట మీద ఉడికించాలి. ►పెరుగు మిశ్రమం ఉడికిన తరువాత ఉడికించిన తామర పువ్వు కాడలు, గరంమసాలా, సోంపుపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. ►స్టవ్ మీద మరో బాణలిపెట్టి నెయ్యి వేయాలి. ►నెయ్యి వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి వేయించాలి. ►ఇది వేగాక దాల్చిన చెక్క, లవంగాలు, రెండు రకాల యాలుక్కాయలు, బిర్యానీ ఆకులు వేసి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ►మసాలా దినుసులన్నీ వేగాక ఇంగువ వేసి తిప్పాలి. ►ఈ పోపు మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన నద్రు యఖని రెడీ. చపాతీ, అన్నంలోకి ఇది చాలా బావుంటుంది. చదవండి 👇 Mutton Rogan Josh Recipe In Telugu: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్ రోగన్ జోష్! -
PPE Kit: ప్రొటెక్షన్.. ప్రొడక్షన్
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి అత్యవసరమైనవి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్లు. అందుకే వీటిని ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నాయి. విజయవాడ మధురానగర్ నేతాజీ కాలనీలోని డైమండ్ మెడికల్ సెంటర్లో పీపీఈ కిట్లను తయారు చేస్తున్న సిబ్బందిని చిత్రంలో చూడొచ్చు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, విజయవాడ -
కమలం కలవరం
గెలిచే అవకాశాలున్న సీట్లపై టీడీపీ కన్ను బలహీన స్థానాలు బీజేపీకి అంటగ ట్టాలని వ్యూహం ససేమిరా అంటున్న ‘కమలం’ నేతలు పొత్తు వ్యవహారం బీజేపీ, టీడీపీల్లో గందరగోళానికి దారి తీసింది. ఏ నియోజక వర్గం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ ఆ రెండు పార్టీల్లోనూ ఉంది. మోడీ గాలి బలంగా వీస్తుండడంతో లబ్ధి పొందాలని టీడీపీ భావిస్తోంది. తాము గెలవలేని స్థానాలను బీజేపీకి అంటగట్టాలని చూస్తోంది. దీన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒప్పుకునేది లేదని నిర్మొహమాటంగా చెబుతున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్: పొత్తుతో లాభం పొందాలి. గెలిచే అవకాశాలున్న సీట్లనే దక్కించుకోవాలి. బలహీనంగా ఉన్న స్థానాలను బీజేపీకి కేటాయించాలి...ఇదీ టీడీ పీ వ్యూహం. దీని వల్లే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి రావడం లేదని తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ రెండు పార్టీల నేతలు ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయో తెలియక ఆయా పార్టీల కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొంది. రెండు పార్టీల పొత్తు వ్యవహారానికి బుధవారం డెడ్‌లైన్ పెట్టుకున్నా పొత్తు చర్చలు ఫలవంతం కాకపోవడంతో ఈ అనిశ్చితికి టీడీపీయే కారణమంటూ బీజేపీ నేతలు రగలి పోతున్నారు. మోడీని చూపించి ఎన్నికల్లో ల బ్ధి పొందాలని టీడీపీ చూస్తూ తమను మా త్రం సీమాంధ్రలో అణగదొక్కాలని చూస్తోం దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరడాన్ని చూసుకుని తమను తక్కువగా అంచనా వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తాము కోరిన సీట్లను టీడీపీ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. సీట్ల మార్పులకు అస్సలు ఒ ప్పుకోబోమని చెబుతున్నారు. జిల్లాకు సం బంధించి విశాఖ పార్లమెంటు నియోజక వ ర్గంతో పాటు విశాఖ ఉత్తర, గాజువాక, పాడే రు అసెంబ్లీ నియోజక వర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా ఈ నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎన్నికల్లో నిలి పి గెలిపించుకోవాలని అంటున్నారు. -
పైలాన్...
సాక్షి, హన్మకొండ : కమలంలా వికసించుకున్న రెండు హస్తాలు. దాని మధ్యలోంచి నిటారుగా నిల్చున్న కాకతీయుల కాలం నాటి స్తంభం. దానిపై రాజసం ఉట్టిపడేలా హంస. కాకతీయ ఉత్సవాల్లో భాగంగా వరంగల్ నగరంలో నిర్మిస్తున్న పైలాన్ డిజైన్ ఇది. పైలాన్ కింది భాగంలో స్వచ్ఛతకు గుర్తుగా కమలం ముద్ర... దానిపై కాకతీయల సాంకే తిక నైపుణ్యం, నిర్మాణ కౌశలానికి ప్రతిబింబించేలా కీర్తితోరణాల స్తంభం... దాని మీద కాకతీయ కళలు, సంస్కృతి చిహ్నాలు ముద్రిస్తూ... స్తంభం పైభాగంలో హంస నిల్చుని ఉండేలా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పైలాన్‌ను నిర్మిస్తున్నారు. రూ.6.5 లక్షల వ్యయంతో వడ్డేపల్లి చెరువు గట్టుపై ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ నెల 20వ తేదీ నాటికి పైలాన్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కానుంది. కాకతీయ ఉత్సవాల సందర్భంగా పైలాన్ నిర్మించాలని గతంలోనే నిర్ణయించినా... పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కాకతీయ ఫెస్టివల్ ముగింపు సమయంలో పైలాన్ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పైలాన్‌ను ఎక్కడ నిర్మించాలనే అంశంపై నగరంలో చాలా ప్రాంతాలను పరిశీలించారు. చివరకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్, వడ్డేపల్లి చెరువును ఎంపిక చేశారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం వడ్డేపల్లి చెరువు కట్టపై బతుకమ్మ విగ్రహం పక్కన స్థలాన్ని పైలాన్ నిర్మాణానికి అనువైనదిగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా పైలాన్ నిర్మాణానికి సంబంధించి వందలాది డిజైన్లు వచ్చినా... చివరికి ఏడు డిజైన్లు ఉత్తమమైనవిగా నిర్ధారించారు. దానిలో చిలువేరు మనోహర్ డిజైన్ని అత్యుత్తమంగా ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టారు.


