breaking news
Lorry management
-
చర్చలు విఫలం.. లారీల సమ్మె ఉధృతం
-
చర్చలు విఫలం లారీల సమ్మె ఉధృతం
-
చర్చలు విఫలం.. లారీల సమ్మె ఉధృతం
⇒ 8 నుంచి దేశవ్యాప్త సమ్మె ⇒ అత్యవసర వస్తువుల రవాణాను నిలిపివేస్తాం ⇒ లారీ సంఘాల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: లారీ యాజమాన్య సంఘాలతో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ సోమవారం జరిపిన చర్చలు విఫల మయ్యాయి. దీంతో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న సమ్మెను ఉధృతం చేయను న్నట్లు దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ ప్రకటించాయి. ఈ నెల 8 నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు తెలి పాయి. ప్రైవేట్ బీమా సంస్థల ప్రయోజనాల కోసమే అన్ని రకాల వాహనాలపై బీమా మొత్తాన్ని పెంచారంటూ లారీ సంఘాలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. గత నెల 30 నుంచి ప్రారంభమైన సమ్మెతో హైదరాబాద్ కు నిత్యావసర వస్తువుల రవాణా పూర్తిగా స్తంభించింది, రాజధానిలో భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక రవాణా కూడా ఆగిపోయింది. వనస్థలిపురం, ఆటోనగర్, మూసాపేట్, ఔటర్‌రింగు రోడ్డు, తదితర ప్రాంతాల్లో లారీ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నాయి. బీమా మొత్తమే ప్రధానం... వాహనాలపై బీమా మొత్తాన్ని ఏకంగా 41% పెంచడానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ సమ్మె నేపథ్యంలో సోమవారమిక్కడ బషీర్‌బాగ్ లోని పరిశ్రమల భవన్ ఐఆర్డీఏ కార్యా లయంలో చైర్మన్ విజయన్, ప్రతినిధుల బృందం లారీ సంఘాల ప్రతినిధులతో చర్చ లు జరిపింది. పెంచిన బీమాను ఉపసంహ రించుకోవాలని లారీ సంఘాలు కోరాయి. లారీ సంఘాల డిమాండ్లపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఐఆర్డీఏ చైర్మన్ విజయన్ స్పష్టం చేశారు. ఈ కమిటీలో లారీ సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని తెలిపారు. కమిటీ ఏర్పాటుపై సుముఖత వ్యక్తం చేసిన లారీ సంఘాలు అప్పటి వరకు బీమా పెంపును నిలిపివేయాలని కోరాయి. అయితే ఇప్పటికే అది అమల్లోకి వచ్చినందున నిలిపివేయడం సాధ్యం కాదని విజయన్ తెలిపారు. ఇందుకు నిరసన తెలుపుతూ లారీ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్క రించి బయటకు వచ్చారు. సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకే పరి మితమైన సమ్మెను ఈ నెల 8 నుంచి ‘చక్రా బంద్’ పేరుతో దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం తమ సమ్మె పారిశ్రామిక రంగానికి చెందిన ముడి సరుకులు, నిత్యావసర వస్తువుల రవాణాకు పరిమితమైందని, 6వ తేదీ నుంచి అత్యవసర వస్తువులైన పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు, పెట్రోల్, డీజిల్ వంటి వస్తువుల రవాణాను కూడా నిలిపివేయనున్నట్లు తెలి పారు. 4వ తేదీ నుంచే అత్యవసర వస్తువుల సరఫరాను బంద్ చేయాలని అనుకున్నప్పటికీ 5న శ్రీరామనవమి ఉన్న దృష్ట్యా 6 నుంచి నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొ న్నారు. మంగళవారం నుంచి రాస్తారోకోలు, వంటావార్పు, ధర్నాలు, ర్యాలీలు వంటి నిరసన కార్యక్రమాలతో సమ్మెను ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రలకు కౌంటర్ పర్మిట్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని తెలం గాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బూడిద నందారెడ్డి అన్నారు. ఇందుకు నిరసనగా ఆటోనగర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కాగా లారీల సమ్మె ప్రభావం నిత్యావసర సరుకు లపై పడింది. హోల్‌సేల్ ధరల్లో 10–15% పెరుగుదల కనిపించింది. సమ్మె వల్ల మహా రాష్ట్ర నుంచి వచ్చే సరుకు రవాణా వాహనా లను జహీరాబాద్ వద్ద నిలిపివేస్తున్నారు. -
తప్పుడు కేసు పెట్టిన లారీ యజమాని అరెస్టు
హిందూపురం అర్బన్ : లారీ దాచిపెట్టి చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, లారీపై తీసుకున్న ఫైనాన్స్ ఎగ్గొట్టి, ఆపై ఇన్సూరెన్సు పొందాలని ప్లాన్ వేసిన లారీ యాజమానితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లారీలు, లారీ చారుుస్, నెంబర్లు మార్చడానికి ఉపయోగించే పరికారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు మంగళవారం వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం... హిందూపురం సమీపంలోని సడ్లపల్లికి చెందిన నరసింహమూర్తి శ్రీరామ్ఫైనాన్స్లో రూ.6లక్షలు అప్పుగా తీసుకున్నారు. దానికి తన ఇంటిని అమ్మితే వచ్చిన సొమ్ము రూ.2.80లక్షలు కలిపి లారీ కొన్నాడు. లారీ సరిగా తిరగక అప్పులు ఎక్కువై లారీని రూ.2లక్షలకు షాబాజ్ట్రాన్స్పోర్టు మహబూబ్‌బాషకు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని సలహా మేరకు లారీని దాచిపెట్టి, చోరీ అయ్యిందని ఫిర్యాదు చేస్తే ఇన్సూరెన్స్ కింద రూ.6లక్షలు వస్తుందని, దాంతో అప్పులు తీర్చుకుని కుతురుపెళ్లి చేయవచ్చునని ప్లాన్ వేశారు. ఈ మేరకు తన లారీ ఏపీ 02వై 6842 చోరీకి గురైందని నవంబర్ 19న టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంతలో నరసింహమూర్తి షాబాజ్ లారీ ట్రాన్స్‌పోర్టు ఓనర్ మహబూబ్ బాష సహకారంతో 15వ తేదీనే లారీని ఇరువురు కలిసి ఎవరికీ తెలియకుండా కర్ణాటకలోని హోసకోట గ్రామ సమీపంలోని ఇటసంద్ర తీసుకెళ్లారు. అక్కడ మహబూబ్‌బాష అన్న అల్లాబకాష్ ఇంటి వద్ద 20 రోజులు ఉంచి కొత్త పెయింటింగ్ చేశారు. లారీకి ఉన్న పాతపేరు నాగలక్ష్మి తొలగించి షాబాజ్ట్రాన్స్ పోర్టుగా మార్చి లారీ నంబరును ఏపీ26 యు 9898గా మార్చుకున్నారు. ఈ నెంబరు లారీకి నెల్లూరు శ్రీరాంఫైనాన్స్లో స్కాప్కింద రెండేళ్ల కిందట కొన్న లారీ నంబరు మహబూబ్‌బాష వేశారు. ఆ స్కాప్కింద కొన్న లారీకి ప్రొద్దుటూరులో ఓ వ్యక్తితో కొన్న లారీ ఏపీ 36 యు 6455నెంబరు వేరుుంచారు. చాసి నెంబరును 426021బిడబ్ల్యుజెడ్ 705373గా మార్చుకున్నాడు. నెల్లూరు స్కాప్లో కొన్న లారీ నెంబరు, చాసీ నెంబర్లను 426021సిడబ్లుజెడ్ 203474 నరసింహమూర్తి లారీకి మార్చుకున్నారు. ఈ రెండు లారీల చాసి నెంబర్లు మార్చుకోవడానికి రహమత్‌పురంలోని ఆయూబ్‌తో చాసి నెంబర్లును గ్రైండింగ్చేయించి సిద్ధం చేశారు. నరసింహమూర్తి మాటలపై అనుమానం వచ్చి డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో టూటౌన్ ఎస్సై అబ్దుల్కరీం సబ్‌డివిజన్ టాస్క్ఫోర్సు ఎస్సై ఆంజినేయులు, సిబ్బంది తిరుమలేసు, మల్లికార్జున, శివకుమార్, షాకీర్‌లు దర్యాప్తు చేసి నరసింహమూర్తి, మహబూబ్‌బాష, షేక్ ఆయూబ్‌లను అరెస్టు చేసి, రెండు లారీని సీజ్ చేశారు. సీఐలు మధుభూషన్, రాజగోపాల్, ఎస్సైలు ఆంజినేయులు, కరీం, సిబ్బంది పాల్గొన్నారు.