breaking news
korean youth
-
ఫిబ్రవరి 14 మాత్రమే కాదు.. ప్రతి నెల 14 వారికి ప్రేమికుల రోజే! ఎక్కడంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు 'ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ రోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు గుర్తుగా దీన్ని ప్రేమికుల రోజుగా ఏటా జరుపుకొంటారు. అయితే ప్రపంచం మొత్తం ఒక్కరోజే వాలెంటైన్స్ డేను జరుపుకొంటే కొరియాలోని యువత మాత్రం ప్రతి నెల 14వ తేదీని ప్రేమికుల రోజుగానే జరుపుకొంటారు. ఇలా మొత్తం ఏడాదిలో 12 రోజులు తమ ప్రియమైన వారికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఆ 12 రోజుల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం... డైరీ డే (జనవరి 14) దక్షిణ కొరియాలో జనవరి 14ను 'డైరీ డే'గా జరుపుకొంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు, ఈరోజున కొత్త డైరీలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఏడాది తర్వాత డైరీ డే రావడంతో వ్యాపారులు కూడా ఆకర్షణీయంగా వీటిని రూపొందించి విక్రయిస్తారు. మరొకొందరు ఈ రోజును 'క్యాండిల్ డే'గా జరుపుకొంటారు. అలంకరించిన క్యాండిల్స్‌ను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు రిటర్న్ గిఫ్ట్‌గా ఏమీ ఇవ్వకూడదు. ఇది వీళ్ల సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే కొరియా వ్యాపారులు ఈరోజు రకరకాల చాక్లెట్లను ప్రదర్శిస్తూ యువతను ఆకర్షిస్తుంటారు. వైట్ డే (మార్చి 14) వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే 'వైట్ డే' కొరియాలో చాలా స్పెషల్. ప్రేమికుల రోజు తమ ప్రేయసి నుంచి చాక్లెట్లు కానుకగా అందుకున్న అబ్బాయిలు.. వైట్ డే రోజు వాళ్లకు రిటర్న్ గిఫ్టులు ఇస్తారు. తెల్లరంగు చాక్లెట్లనే ఇవ్వడం వల్ల ఈ రోజుకు వైట్ డే అని పేరు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో తెల్లరంగుతో పాటు నల్లరంగు చాక్లెట్లను కూడా రిటర్న్ గిఫ్టులుగా ఇవ్వడం అలవాటైంది. అయితే అమ్మాయిలు వాలెంటైన్స్ డే రోజు ఒక్క చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే.. అబ్బాయిలు మాత్రం రిటర్న్‌గా మూడు గిఫ్టులు ఇస్తారు. వైట్ చాక్లెట్‌తో పాటు క్యాండీస్, లాలీపప్లను కలిపి ఇస్తుంటారు. బ్లాక్ డే (ఏప్రిల్ 14) వాలెంటైన్స్ డే, వైట్ డే రోజున ఎలాంటి కానుకలు రాని యువత బ్లాక్ డేను జరపుకొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సింగిల్స్ డే. తమకు ప్రేమ ప్రపోజల్ రాని యువతీయువకులు ఈ రోజు కలిసి బ్లాక్ నూడుల్స్ తింటారు. సింగిల్స్ మీటింగ్‌గా చెప్పుకునే బ్లాక్ డే రోజున తమను ప్రేమించేవారు లేరని యువత కాస్త ఒత్తిడికి గురవుతారు. ఎల్లో డే (మే 14) ఈ రోజున ప్రేమికులు, దంపతులు పుసుపు రంగు పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రియమైన వారితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తారు. ఈ రోజు ఎక్కువ సమయం వారికి కేటాయిస్తారు. కిస్ డే (జూన్ 14) కొరియన్ల ఫేవరెట్ డే ఇది. తమ గాఢమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. జంటలకు ఇది బెస్ట్ రొమాంటిక్ డే అని చెప్పుకుంటారు. సిల్వర్ డే (జులై 14) ఈ రోజున ప్రేమికులు ఉంగరాలు మార్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే నిశ్చితార్థంలా అనమాట. జీవితాంతం కలిసి ఉంటామని ఇద్దరు ప్రామిస్ చేసుకుని రింగ్స్ మార్చుకుంటారు. గ్రీన్ డే (ఆగస్టు 15) ఈ రోజున ప్రేమికులు, దంపతులు అందమైన పశ్చికబయళ్లు ఉంటే ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అక్కడే భోజనం చేస్తుంటారు. వీలైతే ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తారు. ఈ రోజు ఫ్యామిలీస్ ఎక్కువగా పార్కులకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఫొటో డే (సెప్టెంబర్ 14) ఈరోజున ప్రేమికులు, స్నేహితులు, ఫ్యామిలీస్ ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. సెల్ఫీలతో పాటు స్టూడియోలకు వెళ్లి ఫొటో షూట్లు నిర్వహిస్తారు. తమ జీవితంలో ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చూసుకుంటారు. వైన్ డే (అక్టోబర్ 14) ఇది వైన్ ప్రియులకు ఇష్టమైన రోజు. ప్రేమికులు, దంపతులు వైన్ డే రోజున ప్రత్యేక పార్టీలు చేసుకుంటారు. స్నేహితులు, కుటంబసభ్యులతో కలిసి బార్లకు, పార్టీలకు వెళ్లి ఇష్టమైన వైన్ తాగుతారు. మూవీ డే (నవంబర్ 14) కొరియన్లకు ఇది కూడా చాలా ఇష్టమైన రోజు. తమ ప్రియమైన వారిని సినిమా హాళ్లలో కలుస్తారు. కొత్త సినిమాలు చూస్తారు. మరికొందరేమో ఇళ్లలోనే డీవీడీలు అద్దెకు తెచ్చుకుని పాప్‌కార్న్ తింటూ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తారు. హగ్ డే (డిసెంబర్ 14) ఈ రోజున కొరియన్ ప్రజలు తమకు ఇష్టమైన వారిని ఆలింగనం చేసుకుంటారు. ప్రేమికులు ఎక్కడున్నా ఈరోజు కలుసుకొని హగ్ ఇస్తుంటారు. సింగిల్స్ అయితే తమ ఇంట్లో వాళ్లని, స్నేహితులను ఆలింగనం చేసుకుంటారు. ఏడాదికి 12 రోజులు ఇలా ప్రత్యేకంగా జరుపుకొన్నా.. వాలెంటైన్స్ డే, వైట్ డే రోజుల్లో మాత్రం సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రోజులు వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. చదవండి: ప్రేమ కానుక.. మనసు దోచెనిక.. ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..! -
కంటైనర్లలోనే వారి కాపురాలు
సాక్షి, పెనుకొండ : ఈ భవనం కియా కార్ల పరిశ్రమ సమీపంలోని ఎర్రమంచి రహదారిలో కంటైనర్లతో నిర్మించారు. ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన దీని పేరు ‘విదమ్ హాస్పెటాలిటీ’ పేరుతో కొరియన్లకు ఆతిథ్యం కల్పిస్తున్నారు. బేగ్ అనే కొరియన్ దీనిని నిర్వహిస్తున్నాడు. కంటైనర్లలో భవంతులు నిర్మించి నిబంధనలకు తూట్లు పొడిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలు కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో అనేక మంది నిర్వహిస్తున్నారు. పెనుకొండ మండలంలో కియా కార్ల పరిశ్రమ ప్రారంభమై రెండేళ్లవుతోంది. ఇందులో పని చేయడానికి వందలాది మంది కొరియన్లు వారి దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. పలువురు కొరియన్లు సమీపంలోని భవనాల్లో బాడుగలకు ఉంటున్నారు. మరి కొందరు కంటైనర్ బాక్సులతో రూపొందించిన భవనాల్లో నివసిస్తున్నారు. లక్షలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నారు. భద్రత డొల్ల.. కంటైనర్లలో కాపురం ఉండడం అంత శ్రేయస్కరం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఏ మాత్రం షార్ట్‌సర్క్యూట్ జరిగినా, ఏ ఇతర ప్రమాద సమయాల్లోనైనా ప్రాణాపాయం తప్పదని అభిప్రాయపడుతున్నారు. 2017లో కంటైనర్‌లో నివాసం ఉంటున్న తాడిపత్రికి చెందిన ఇద్దరు బేల్దార్లు పొగ ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో కంటైనర్ కాపురాలు మరిన్ని పెరగడం ఆందోళన రేపుతోంది. అనుమతులు ప్రశ్నార్థకమే? ఒక భవనం నిర్మించాలంటే గ్రామ పంచాయతీ లేదా అహుడా అనుమతి ఉండాలి. అయితే కంటైనర్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, కేవలం ధనార్జనే ధ్యేయంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఒక్క అధికారి కూడా దీనిని ప్రశి్నంచకపోవడంతో నిర్మాణాలు మరింత జోరందుకుంటున్నాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించడం వల్లే వీటి నిర్మాణాలు అధికమవుతున్నాయనే విమర్శలుమున్నాయి. ఇప్పటికే ఎర్రమంచి, హరిపురం, అమ్మవారుపల్లి, దుద్దేబండ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు జరిగాయి. కియా, ఏపీఐఐసీ అతిథి గృహాలు సైతం కంటైనర్లతో నిరి్మంచడం గమనార్హం. అధికారులు తగిన చర్యలు తీసుకుని ఇలాంటి నిర్మాణాలకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
వీడింతే.. ఇక ఎదగడు!
లేలేత బుగ్గలు, అమాయకపు చూపులతో కనిపిస్తున్న వీడు స్కూలుకు వెళ్లే పిల్లాడేమీ కాదు. రాత్రి పూట పబ్బులకు వెళ్తూ, మద్యం సేవిస్తూ మధ్యమధ్యలో అమ్మాయిలతో స్టెప్పులేస్తున్న గడుగ్గాయే. పట్టుమని పన్నెండేళ్లు కూడా లేని ఈ పిల్లాడికి ఇవేం పాడు బుద్ధులనుకుంటే పొరపాటే. 'నువ్వు పిల్లాడివి.. నిన్ను పబ్‌లకు అనుమతించం' ’అంటూ పబ్బుల ద్వారపాలకులు అడ్డుకున్నప్పుడల్లా ఇతడు తన ఐడీ కార్డులో ఉన్న బర్త్ డేను దర్జాగా చూపించి లోపలికెళతాడు. విషయం ఏమిటంటే, 1989లో జన్మించిన ఇతడికి ఇప్పుడు సరిగ్గా 26 ఏళ్లు. 'హైలాండర్ సిండ్రోమ్' అనే జబ్బుతో బాధపడుతున్న ఇతడికి ఎదుగుదల టీనేజీలో ఆగిపోయిందట. జీవించినంత కాలం ఇలా పిల్లాడిలానే కనిపిస్తాడని, ఈ జబ్బుకు మందు లేదని వైద్యులు చెబుతున్నారు. అయినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని, దిగులు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. హ్యోమియుంగ్ షిన్ అనే పేరుగల ఇతడిని 'పీటర్ పాన్ ఆఫ్ కొరియా' అని పిలుస్తున్నారు. పబ్బుల్లో అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నా చిన్న పిల్లాడిలానే భావించి బుగ్గలు గిల్లుతున్నారట తప్ప, యుక్త వయస్సు వచ్చిన యువకుడిగా ఎవరు ఫీలవడం లేదని పాపం తెగ ఫీలయిపోతున్నాడు. ఏరోజుకైనా తగిన అమ్మాయి దొరక్కపోతుందా అన్న ఆశతో క్రమం తప్పకుండా పబ్బులకు వెళుతున్నాడట. ప్రస్తుతానికి హాలీవుడ్ తార స్కార్లెట్ జోహాన్సన్ క్యాలెండర్‌ను గది గోడకు తగిలించుకొని ఆరాధిస్తున్నాడు.